EXPOSED : అమెరికా మన మీద పడి ఏడ్వడం దేనికి ?

Latest Posts NRI Times Top Stories

భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు  రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఒత్తిడి చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టె వంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25% టారిఫ్‌లు విధించారు, మళ్లీ  50% సుంకాలు విధించారు.  దీనికి భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాతో భారీగా వాణిజ్యం చేస్తూ, భారత్‌ను మాత్రం టార్గెట్ చేయడం దేనికి? అని ప్రశ్నించింది.

రష్యా నుంచి చమురు కొనడం ఎందుకు?

ఉక్రెయిన్ యుద్ధం షురూ అయిన తర్వాత,  సాంప్రదాయ చమురు సరఫరా యూరప్‌కు మళ్లింది. దీంతో అమెరికా స్వయంగా భారత్‌ను రష్యా నుంచి చమురు కొనమని ప్రోత్సహించింది. ఎందుకంటే, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను స్టేబుల్‌గా ఉంచడానికి  ఇది అవసరమని అమెరికా భావించింది. భారత్ కూడా తన ప్రజలకు తక్కువ ధరల్లో ఇంధనం అందించడానికి, దేశ ఆర్థిక భద్రత కోసం రష్యా నుంచి చమురు కొనడం మొదలెట్టింది. 2024-25లో భారత్ రష్యా నుంచి 87.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసింది, ఇది భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 36% వాటా. భారత్ ఇలా చేయడం వల్ల గ్లోబల్ చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని, లేకపోతే బ్యారెల్‌కు 120-130 డాలర్లకు చేరేవని  కేంద్ర ఇంధన మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పష్టం చేశారు. అయినా, భారత్‌కు 80% చమురు, 50%  హజవాయువు
దిగుమతుల మీద ఆధారపడాల్సి ఉంది. ఇంధన భద్రత దేశానికి కీలకం. అలాంటప్పుడు రష్యా నుంచి చౌకగా లభించే చమురు కొనకుండా ఎలా ఉంటాం? అని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి
లండన్‌లో ఓ రేడియో ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

అమెరికా, యూరప్ డబుల్ స్టాండర్డ్స్ 

అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికీ రష్యాతో భారీగా వాణిజ్యం చేస్తున్నాయి.  2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల వస్తువుల వాణిజ్యం చేసింది…17.2 బిలియన్ యూరోల సర్వీసెస్ బిజినెస్ చేసింది. ఇంకా, యూరప్ 2024లో రష్యా నుంచి 16.5 మిలియన్ టన్నుల LNG దిగుమతి చేసింది, ఇది 2022 రికార్డును మించిపోయింది. ఈ వాణిజ్యం కేవలం ఇంధనంతోనే కాదు, ఎరువులు, మినరల్స్, రసాయనాలు, ఇనుము, ఉక్కు, మెషీన్లు, రవాణా సామగ్రి కూడా ఉన్నాయి.

ఇక అమెరికా విషయానికొస్తే, అది రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ (న్యూక్లియర్ ఇండస్ట్రీకి), పల్లాడియం (ఎలక్ట్రిక్ వాహనాలకు), అలాగే ఎరువులు, రసాయనాలు దిగుమతి చేసుకుంటోంది. అలాంటప్పుడు, భారత్‌ను మాత్రం టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? టర్కీ, హంగరీ, స్లోవాకియా లాంటి నాటో సభ్య దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనం కొంటున్నాయి, కానీ వాళ్లపై నాటో ఎందుకు మౌనంగా ఉంది? అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రశ్నించారు. ట్రంప్ కళ్ళు… నాటో చీఫ్ రుట్టే కళ్ళు మూసుకుపోయాయా… లేదంటే… ఇండియా అంటే అంత చులకనా..

ట్రంప్, నాటో వ్యాఖ్యలపై భారత్ ఖండన

ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందని, అది మంచి అడుగు అని చెప్పిన కామెంట్స్ ను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదని, యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీలు ధర, నాణ్యత, లాజిస్టిక్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఇది ఎలాంటి విధానపరమైన మార్పు కాదని వివరించాయి. అలాగే, నాటో చీఫ్ మార్క్ రుట్టె రష్యాతో వాణిజ్యం చేస్తే 100% సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటో డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తోందని,
ఇది ఆమోదయోగ్యం కాదని జైశ్వాల్ అన్నారు. రష్యాతో భారత్‌కు దశాబ్దాల సుదీర్ఘ స్నేహబంధం ఉంది… దాన్ని మూడో దేశం దృష్టితో చూడకూడదని హెచ్చరించారు.

 భారత్ ఎందుకు రష్యాతో కొనసాగుతుంది? 

భారత్‌కు రష్యా ఒక ముఖ్యమైన భాగస్వామి. చమురుతో పాటు, రక్షణ పరికరాలు, S-400 మిసైల్ వ్యవస్థ లాంటి రష్యా నుంచి దిగుమతి అవుతున్నాయి.  ఈ సంబంధాలు జాతీయ ప్రయోజనాలకు, ఆర్థిక భద్రతకు కీలకం. అమెరికా, యూరప్ ఆంక్షలు లేనప్పుడు రష్యా నుంచి చమురు కొనడం ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలనూ ఉల్లంఘించడం కాదని భారత్ స్పష్టం చేసింది. పైగా, రష్యా నుంచి చమురు కొనడం ఆపితే భారత్‌కు ఏటా 1100 కోట్ల డాలర్ల (సుమారు 95 వేల కోట్ల రూపాయలు) అదనపు ఖర్చు భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారం అవుతుంది. అందుకే, భారత్ తన ఇంధన కొనుగోళ్లను మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాల ఆధారంగా కొనసాగిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పేసింది.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

 

Read also : నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ? : చిరంజీవి

Read also : OnePlus 13Rపై భారీ డిస్కౌంట్: అదిరిపోయే ఆఫర్‌ మిస్ చేయకండి!

Tagged

Leave a Reply