రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయ్! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికా టారిఫ్ వివాదాలు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు చేస్తుండడంతో పసిడి గిరాకీ ఊపందుకుంది. వచ్చే వారంలో బంగారం ధరలు కొత్త రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆభరణాల వ్యాపారులు యూకే, యూరోపియన్ యూనియన్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే కీలక డేటాను గమనిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల వల్ల బంగారం ధరల్లో ఒడిదొడుకులు ఉంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలాఖరున 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.98,079 ఉండగా, వారాంతానికి రూ.1,03,420కి చేరి ఆల్‌టైమ్ హై సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం జూలై 30న 3,268 డాలర్లు ఉండగా, ఆగస్టు 8 నాటికి 3,534 డాలర్లకు పెరిగింది. టారిఫ్ వార్, ఆర్థిక అనిశ్చితుల వల్ల బంగారం ధర ఔన్సుకు 3,800 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. దేశీయంగా కూడా మరో మూడు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ధరలు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు కూడా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ధరలు మరింత పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం రేట్స్ పెరుగుదల వెనుక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు కూడా ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Read also : ICICI బ్యాంక్ వీర బాదుడు – ₹50,000 మినిమమ్ బ్యాలెన్స్
Read also : ఏ పొడిచాడని ట్రంప్‌కి నోబెల్ ఇవ్వాలి ?