* 5 యేళ్ళ తర్వాత ప్రత్యక్షం
* యాప్ పై ఇంకా నిషేధం
మన దేశంలో 2020లో నిషేధించిన చైనా మూలాల షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్, ఇప్పుడు వెబ్‌సైట్ రూపంలో తిరిగి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నాడు కొందరు యూజర్లు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలుగుతున్నారు, అయితే మొబైల్ యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు. భారత్-చైనా సంబంధాలు మళ్ళీ ఇంప్రూవ్ అవుతుండటమే ఇందుకు కారణమా అని చర్చ మొదలైంది. అయితే టిక్‌టాక్ భారత్ లోకి ఎంట్రీపై ఇంకా ఇంకా అధికారిక నిర్ధారణ ఏదీ రాలేదు.
టిక్ టాక్ పై ఎందుకు నిషేధం
2020 జూన్ 29న, గాల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దు ఘర్షణ తర్వాత, భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధించింది. ఈ యాప్‌లు డేటా ప్రైవసీ, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. అప్పటికి భారత్‌లో 200 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్న టిక్‌టాక్, చైనా బయట అతిపెద్ద మార్కెట్‌గా ఉండేది. ఈ నిషేధంతో బైట్‌డాన్స్ (టిక్‌టాక్ మాతృ సంస్థ)కు భారీగా నష్టాలు వచ్చాయి. భారతీయ యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లాంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లారు.
నిషేధం తర్వాత, టిక్‌టాక్ వెబ్‌సైట్ కూడా 2023 నుంచి భారత్‌లో అందుబాటులో లేకుండా పోయింది. అయితే, ఇటీవలి కాలంలో భారత్-చైనా సంబంధాలు మెరుగవుతున్నాయి. సరిహద్దు చర్చలు కూడా జరిగాయి, ఇటీవల చైనా రాయబారి భారత్‌తో “డ్రాగన్-ఏలిఫెంట్ టాంగో” అని అన్నారు. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఈ నెలాఖరున సమావేశం జరగనుంది,
అందుబాటులోకి వెబ్‌సైట్, యాప్ లేదు
టిక్‌టాక్ అధికారిక వెబ్‌సైట్ మొబైల్, డెస్క్‌టాప్ రెండింటిలోనూ చేస్తోందని అంటున్నారు. అయితే, కొన్ని సబ్‌పేజీలు ఇంకా పని చేయట్లేదు. ఇది అందరికీ అందుబాటులో రాలేదని కొందరు యూజర్లు X లో తెలిపారు. ఇది ఫేజ్డ్ రోల్‌ఔట్ లేదా టెస్టింగ్ దశ అని భావిస్తున్నారు. టిక్‌టాక్ వెబ్‌సైట్ తిరిగి అందుబాటులోకి రావడం యూజర్లలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది, కానీ భారత్‌లో టిక్‌టాక్ తిరిగి రావాలంటే, డేటా సెక్యూరిటీపై భరోసా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. ప్రస్తుతానికి, యాప్ నిషేధం కొనసాగుతోంది, ఇతర దేశాల్లో కూడా టిక్‌టాక్ సమస్యలు ఎదుర్కొంటోంది అమెరికాలో 2025లో నిషేధం విధించారు.