15 రోగాలకు పసుపే మందు!

Healthy Life Latest Posts

మన వంటింట్లో నిత్యం వాడే పసుపు ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు,  ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. పసుపులోని కర్క్యూమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాల కారణంగా వివిధ రోగాల చికిత్సలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. పసుపులోని ఔషధ గుణాలు, దాని ఉపయోగాలు, దానిపై జరిగిన సైంటిఫిక్ స్టడీస్ గురించి  ఈ ఆర్టికల్ లో వివరిస్తాను.

పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు ఒక శక్తివంతమైన యాంటీబయోటిక్ పదార్థం, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, ముఖ వర్చస్సును పెంచుతుంది. ఇది షుగర్, హై బీపీ, ఎనీమియా, సోరియాసిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, మైగ్రేన్, కంటి వాపు వంటి 15 రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR), అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంస్థలు నిర్వహించిన స్టడీస్ లో తేలింది.  CCRAS రీసెర్చ్ CCRAS సంస్థ పసుపును ప్రధానంగా ఉపయోగించి 22 మెడిసినల్ ఫార్ములేషన్స్ తయారు చేసింది.  ఈ మెడిసన్స్ 15 రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయని  క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిర్ధారణ అయింది. 2025 మార్చి వరకు జరిగిన ఈ ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఔషధాలు సమర్థవంతంగా పనిచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోక్‌సభలో తెలిపింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు ఈ సమాచారం సమాధానం ఇచ్చింది

ICAR అండ్ ICMR స్టడీస్ చూద్దాం.

ICMR: పసుపులోని ఫైటోకెమికల్స్, ఫార్మకోలాజికల్ యాక్టివిటీస్, బయో యాక్టివిటీస్ పై ఒక మోనోగ్రాఫ్ తయారు చేసింది. ఈ స్టడీలో పసుపు ఔషధ గుణాలు, దాని దుష్ప్రభావాల గురించి వివరంగా ఇచ్చారు. ICAR: కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (IISR) పసుపు, దాల్చిన చెక్క కలిపిన మిశ్రమం డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుందని గుర్తించింది.  జంతువులపై జరిగిన పరీక్షల్లో, ఈ మిశ్రమం రక్తంలోని షుగర్ స్థాయిలను బాగా తగ్గించడమే కాక, కొవ్వును కరిగించి, కాలేయం, మూత్రపిండాల టిష్యూ పునరుద్ధరణలో కూడా సహాయపడినట్లు తేలింది. అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ARI): పుణెలోని ఈ సంస్థ పసుపు ఔషధ విలువలపై పరిశోధనలు చేస్తోంది. టిష్యూ కల్చర్, మాలిక్యులర్ బయాలజీ, ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో ఈ స్టడీస్ కొనసాగుతున్నాయి. పసుపు రకాలపై IISR స్టడీ దేశంలో వివిధ రకాల పసుపు వంగడాలు అందుబాటులో ఉన్నాయి. కర్క్యూమిన్ కంటెంట్ 5% కంటే ఎక్కువ ఉన్న రకాలైన IISR ప్రతిభ, IISR ప్రగతి, అళెప్పీ సుప్రీమ్, రోమా, రాజేంద్ర సోనియా లాంటి వెరైటీలను కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. అలాగే, లకడోంగ్ (మేఘాలయ), వైగాన్ (మహారాష్ట్ర) లాంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపు పొందిన రకాలపై IISR పరిశోధనలు చేసింది.  పసుపు ఔషధ రీసెర్చ్ కోసం ల్యాబ్‌లు పసుపు ఔషధ గుణాలపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది.  IISR: కోజికోడ్‌లో ఫీల్డ్ జీన్ బ్యాంక్ అత్యంత నాణ్యమైన కర్క్యూమిన్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ICAR డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్: ఔషధ మొక్కలపై పరిశోధనలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (పుణె): ఔషధ మొక్కలపై పరిశోధనల కోసం టిష్యూ కల్చర్, ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్‌లను నిర్వహిస్తోంది.

READ ALSO  జాగ్రత్త....మధు మేహం తినేస్తోంది !

పసుపు, దాల్చిన చెక్క మిశ్రమం

IISR జరిపిన స్టడీస్ లో పసుపు దాల్చిన చెక్క కలిపిన మిశ్రమం డయాబెటిస్ నియంత్రణలో అద్భుత ఫలితాలను చూపించింది. జంతు పరీక్షల్లో, కిలో బరువుకు 150 మిల్లీగ్రాముల మోతాదులో ఈ మిశ్రమాన్ని ఇచ్చినప్పుడు:

  • రక్తంలోని షుగర్ స్థాయిలు బాగా తగ్గాయి.
  • రక్తంలోని కొవ్వు (లిపిడ్స్) కరిగింది.
  • పాంక్రియాస్ నిర్మాణం మెరుగై, దాని పనితీరు సమర్థవంతంగా మారింది.
  • కాలేయం, మూత్రపిండాల్లో చనిపోయిన లేదా దెబ్బతిన్న కణజాలం పునరుద్ధరణ కూడా అయింది.
  • కాలేయంలో మెటబాలిజానికి సంబంధించిన ఎంజైములు మరింత సమర్థవంతంగా పనిచేశాయి.
  • అదనంగా, పసుపు శరీర ఎదుగుదలకు మెటబాలిక్ హెల్త్ మెరుగుదలకు కూడా సహాయపడుతుందని స్టడీస్ నిర్ధారించాయి.
  • పసుపుతో ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే…  పసుపు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంది:
  • ఆర్థరైటిస్: పసుపులోని కర్క్యూమిన్ ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పులు వాపును తగ్గిస్తుందని స్టడీస్ సూచిస్తున్నాయి.
  • డిప్రెషన్: కొన్ని పరిశోధనల ప్రకారం, కర్క్యూమిన్ మెదడులోని  న్యూరోట్రాన్స్‌మిటర్స్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా డిప్రెషన్ లక్షణాలను తగ్గించవచ్చు.
  • క్యాన్సర్ నివారణ: కర్క్యూమిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడవచ్చని కొన్ని ప్రైమరీ స్టడీస్ సూచిస్తున్నాయి.
  • జీర్ణ సమస్యలు: పసుపు జీర్ణక్రియను మెరుగుపరచడంలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.

జాగ్రత్తలు

పసుపు సాధారణంగా సురక్షితమైనది అయినప్పటికీ, అధిక మోతాదులో తీసుకోవడం వల్ల  కొందరిలో జీర్ణ సమస్యలు లేదా అలెర్జీలు కలగవచ్చు. గర్భిణీలు, రక్తం పలుచగా చేసే ఔషధాలు తీసుకునే వారు, లేదా ఆపరేషన్ కు సిద్ధమయ్యే వారు పసుపు సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించాలి. పసుపు మన వంటిల్లో ఒక సాధారణ పదార్థం మాత్రమే కాదు, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన ఔషధంగా పనిచేస్తుంది.  CCRAS, ICAR, మరియు ICMR వంటి సంస్థలు దీనిపై జరిపిన పరిశోధనలు పసుపు యొక్క ఔషధ విలువను మరింత బలపరిచాయి. ఈ సైంటిఫిక్ ఆధారాలతో, పసుపును రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం  ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

వ్యాధి: డయాబెటిస్
మందు: సప్తవింశాటిక గుగ్గులు, హరిద్ర చూర్ణ, నిశ ఆమలకి చూర్ణ, చంద్రప్రభా వటి. నిషాకటకాది కషాయ

వ్యాధి: డయాబెటిస్
మందు: అశ్వగంధ ద్యరిష్ట

వ్యాధి: రక్తహీనత
మందు: పునర్నవాది మండ్యూరా

వ్యాధి: మైగ్రెయిన్
మందు: పత్యాది క్వత చూర్ణ

వ్యాధి: సోరియాసిస్
మందు: పంచతిక్త గుగ్గులు ఘృత, బృహన్ మరీచాద్య తైల, నల్పమరాది తైలం

వ్యాధి: అజీర్తి/ కడుపులో మంట (గ్యాస్)
మందు: పిప్పాలద్యాసవ

READ ALSO  మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

వ్యాధి: కంజక్టివైటిస్ (కంటి సమస్య)
మందు: హరిద్రఖండ

వ్యాధి: కాగ్నిటివ్ డెఫిసిట్
మందు: కల్యాణక ఘృత

వ్యాధి: ఎగ్జిమా (తామర)
మందు: నల్పమరాది తైలం

వ్యాధి: పైల్స్ (ఫిషర్స్)
మందు: జట్యాది ఘృత, జట్యాది తైలం

వ్యాధి: హైపర్ యూరిసీమియా (రక్తంలోయూరియా)
మందు: నింబాది చూర్ణ, బ్రహ్మ రసాయన

వ్యాధి: మెంటల్ రిటార్డేషన్
మందు: సప్తవింశాటిక గుగ్గులు, హరిద్ర చూర్ణ, నిశ ఆమలకి చూర్ణ, చంద్రప్రభా వటి, నిషాకటకాది కషాయ

వ్యాధి: రసాయన (శరీర పునరుజ్జీవ చికిత్స)
మందు: బ్రహ్మ రసాయన

వ్యాధి: కిడ్నీలో రాళ్లు
మందు: చంద్రప్రభా వటి

వ్యాధి: మొటిమలు
మందు: నింబాది చూర్ణ

Tagged

Leave a Reply