అమెరికాకు ఎంత కండకావరం ? నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్

Latest Posts NRI Times Top Stories

Fro English Article : CLICK HERE

మోడీ, భారతీయులపై నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్

అమెరికా లీడర్లకు ఎంత కండకావరం ఉందో ఈ ఆర్టికల్ లో చెబుతాను.  భారత్ తన చెప్పుకింద ఉండాలన్న అహంభావం క్లియర్ గా కనిపిస్తోంది…. మొన్నటి దాకా ట్రంప్ తో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇతరులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు… ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి, మన ప్రధాని మోడీ తో పాటు భారతీయులపై అమెరికా ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో ఎలా నోరు పారేసుకున్నాడో
చూద్దాం.

రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ళపై అమెరికా మన మీద 50శాతం  టారిఫ్స్ విధించింది… మనం దిగొచ్చి… దేహీ అని అడుక్కుంటామని అనుకుంది… కానీ మనం మన ఉత్పత్తులను అమ్ముకోడానికి…. అమెరికా మార్కెట్ ను వదిలి వివిధ దేశాల్లో మార్కెట్లను పరిశీలిస్తున్నాం… ఇది అమెరికాకు మండిపోతోంది… దాంతో బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో ట్రంప్ అడ్వైజర్ నవారో ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోడీ యుద్ధం’ అని పిలిచాడు. ఈ యుద్ధాన్ని. భారత్ రష్యా నుంచి చౌక చమురు కొనుగోలు చేస్తూ పుతిన్ యుద్ధ యంత్రానికి సాయం చేస్తోందని విరుచుకుపడ్డాడు. “భారత్ తీరుతో అమెరికాలో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. ఆ దేశం విధిస్తున్న అధిక టారిఫ్స్ మా ఉద్యోగాలు, ఫ్యాక్టరీలపై ప్రభావం చూపిస్తోంది.  మేం మోడీ యుద్ధానికి డబ్బులిస్తున్నాం” అని ట్రంప్ అడ్వైజర్ నవారో అన్నాడు.  అంతేకాదు, “పుతిన్ యుద్ధం కాదు, మోడీ యుద్ధం” అని మళ్లీ చెప్పాడు. భారత్ రష్యా చమురు కొనడం ఆపేస్తే 25% అదనపు టారిఫ్స్ తీసేస్తామని అన్నాడు.

నవారో కండకావరాన్ని ఇండియన్స్ తప్పుబడుతున్నారు… ఇది పూర్తి హిపోక్రసీ అని చాలా మంది విమర్శిస్తున్నారు. భారత్ ఒక ప్రజాస్వామిక దేశం, అతను అలా నోరు పారేసుకోవడం సరికాదని అంటున్నారు..  ఉదాహరణకు, చైనా రష్యా చమురు ఎక్కువ కొంటోంది కానీ అమెరికా దాన్ని ఎందుకు టార్గెట్ చేయడం లేదు? CNN ఇంటర్వ్యూలో నవారోను జర్నలిస్ట్ ఇదే ప్రశ్నించారు,  కానీ అతను దానికి సమాధానం చెప్పలేదు.  అమెరికా డెమోక్రాట్లు కూడా “ఇండియాపై ఆంక్షలు విధించడంలో లాజిక్ లేదు, చైనాను వదిలేసి… ఇండియా మీద ట్రంప్ ప్రభావం చూపించడం ఏంటని అని విమర్శిస్తున్నారు… చైనా, యూరప్ కూడా రష్యా చమురు కొనడం ఆపాలని …అప్పుడే యుద్ధం ఆగుతుందని యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్లు అంటున్నారు. భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు…. “ఇది ఉక్రెయిన్ గురించి కాదు, అమెరికా-భారత్ సంబంధాలకు ద్రోహం” అని అన్నారు.

READ ALSO  కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025: లోక్‌సభలో ఆమోదం.. కీలక మార్పులు ఏమిటి?

ట్రంప్ అడ్వైజర్ కామెంట్స్ పై (ట్విట్టర్)లో పెద్ద చర్చ జరుగుతోంది. భారతీయులు నవారోను తీవ్రంగా విమర్శించారు. “భారత్ తన జాతీయ ప్రయోజనాలు చూసుకుంటుంది… అని అన్నారు.  మరొకరు ” అమెరికా హిపోక్రసీ పీక్‌లో ఉంది, వెస్ట్ ఆయుధాలు సప్లై చేస్తుంది… కానీ భారత్‌ను బ్లేమ్ చేస్తుంది” అని ట్వీట్ చేశారు. ఇంకా, “నవారో మాటలు అమెరికాను లూజర్‌గా చూపిస్తున్నాయి” అని మరొక ట్వీట్ లో నెటిజన్ విమర్శించారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా “మా 1.4 బిలియన్ ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం, బెస్ట్ డీల్ తీసుకుంటాం” అని స్పందించారు. ట్రంప్ కూడా ఇండియాపై ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నాడు. గతంలో మోడీని ‘గ్రేట్ లీడర్’ అని ప్రశంసించాడు కానీ ఇప్పుడు 50% టారిఫ్స్ విధించాడు ఇండియా గూడ్స్ పై, రష్యా ఆయిల్ కొనడం వల్ల…. ఇది US-ఇండియా రిలేషన్స్‌ను డ్యామేజ్ చేస్తోంది, 25 ఏళ్ల ప్రయత్నాలు వృథా అవుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా భారత్‌ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకుంటోంది, ట్రేడ్ ప్రెషర్ ద్వారా కంట్రోల్ చేయాలని. కానీ భారత్ తన స్వతంత్ర పాలసీని కొనసాగిస్తోంది.

అంతేకాదు, ట్రంప్ ఎరాలో పాకిస్తాన్‌కు ప్రోత్సాహం ఇచ్చాడు. పాక్ మిలటరీ చీఫ్‌ను వెల్కమ్ చేశాడు, ఆయుధాలు సప్లై చేశాడు.  పరోక్షంగా టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్… పైగా ఇండియా-పాక్ క్లాష్‌ను ఆపాను అని ట్రంప్ క్లెయిమ్ చేశాడు,   కానీ ఇది ఇండియాపై ఒత్తిడి పెంచడానికే అని అందరికీ తెలుసు.  పాకిస్తాన్ విషయంలో అమెరికా డబుల్ స్టాండర్డ్‌ను చూపిస్తోంది.  మొత్తానికి, నవారో, ట్రంప్ మాటలు US-ఇండియా సంబంధాలపై ప్రభావం చూపుతాయి,  కానీ భారత్ తన ప్రయోజనాలు చూసుకుంటుంది. చర్చల ద్వారా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.

మీరు ఏమంటారు?

Read also : Google Pixel 10 & Pixel 10 Pro Launched in India

Read also : Chat GPT తెగ వాడుతున్నారా? ఇకపై చార్జీల మోతే !

Tagged

Leave a Reply