* పొమ్మనలేక పొగబెడుతున్నారని అనుమానాలు
* కల్వకుంట్ల ఫ్యామిలీ భారీ స్కెచ్ అంటున్న అభిమానులు
కేసీఆర్ కుటుంబంలో విభేదాలు కుమార్తె కవితను పార్టీ నుంచి బయటకు పంపించేంత వరకూ వెళ్లాయి. కవిత కూడా పార్టీ వద్దనుకున్నప్పుడు నాకు కూడా పార్టీ అవసరం లేదంటూ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేశారు. అయితే పార్టీలో హరీశ్ రావు , సంతోశ్ రావు వల్ల కేసీఆర్, కేటీఆర్ కు ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. అయితే కవిత హెచ్చరికలపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని పార్టీ నుంచి సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ డ్రామా ఆడుతోందని హరీశ్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
హరీశ్ రావు బీఆర్ఎస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తన మామ కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. హరీశ్ పార్టీ ఆవిర్భావం నుంచి లేరని, ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారని లేటెస్ట్ గా కవిత ఆరోపించారు.. కానీ పార్టీలో హరీశ్ రావుకి ఉన్న ఇంపార్టెన్స్ ని ఎవరూ కాదనలేనిది. ఆయన్ను పార్టీలో అందరూ ట్రబుల్ షూటర్ గా భావిస్తుంటారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని చక్కబెట్టే బాధ్యతలను చాలా సార్లు హరీశ్ రావుకు అప్పగించారు కేసీఆర్. హరీశ్ రావు కూడా తనకు అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా పాటిస్తూ వాటిని సాల్వ్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు పార్టీలో ఎంత పట్టుందో మాస్ లీడర్ గా కూడా హరీశ్ రావుకు కూడా అంతే పట్టు ఉందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొంతకాలంగా పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు అనేదానిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనుచరులంతా ఇందులో డౌట్ ఎందుకు.. కేటీఆరే అని ఢంకా బజాయించి చెప్తున్నారు.
అయితే హరీశ్ రావుకు కూడా పార్టీలో మంచి కేడర్ ఉంది. ఆయన్నిఅభిమానించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకవేళ హరీశ్ రావు బయటికెళ్తే పార్టీ చీలిపోతుందేమోనని అనుమానించే వాళ్లు కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్లిన టైమ్ లోనే హరీశ్ కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం తనకు అలాంటి ఉద్దేశం లేదని, తుది శ్వాస వరకూ కేసీఆర్ వెంటే నడుస్తానని, ఆయనే తన నాయకుడని ప్రకటించారు. అప్పటి నుంచి హరీశ్ రావును కేసీఆర్ మళ్లీ దగ్గర చేర్చుకున్నారు. దీంతో సమస్య ముగిసిందని భావించారు. అయితే హరీశ్ రావుతో ఎప్పటికైనా పార్టీకి ముప్పు పొంచి ఉంటుందనే అనుమానాలు చాలాకాలంగా ఉంటున్నాయి. అందుకే ఆయన్ను వదిలించుకునేందుకు కవిత ద్వారా కల్వకుంట్ల ఫ్యామిలీ స్కెచ్ వేసిందని లేటెస్ట్ గా టాక్ నడుస్తోంది. హరీశ్ కు రాజకీయ జీవితం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్, కేటీఆర్ పై కాకుండా హరీశ్ పై కవిత తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఆయన అభిమానులు అనుమానిస్తున్నారు. హరీశ్ రావుపైన కవిత అవినీతి ముద్ర వేశారు. అంతేకాక కేటీఆర్, కేసీఆర్ కు హరీశ్ రావు నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ టైమ్ లో హరీశ్ రావు తనంతట తానుగా పార్టీని విడిచి వెళ్ళిపోతే తాను ముందే చెప్పానని కవిత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ హరీశ్ రావు బయటకు వెళ్లకుండా ఇలాగే ఉంటే….అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి బయటకు పంపొచ్చు. అప్పుడు పార్టీకి పెద్ద నష్టం ఉండదు. కేటీఆర్ మాత్రమే సింగిల్ వారసుడిగా ఉండిపోతారు. అందుకే కవిత ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిమీద గత మూడు రోజులుగా BRS తో పాటు… సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. కవిత ఆరోపణలపై హరీశ్ అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో…
Read also : బిగ్‌బాస్ 9 తెలుగు: డబుల్ హౌస్, డబుల్ డోస్‌తో మళ్లీ వచ్చేసింది!
Read also : బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ – క్లైమాక్స్ ఎప్పుడు ?
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/