చిన్న కార్లపై GST (GST on Small Cars) తగ్గింపు కారణంగా త్వరలో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. కొత్త Guidelines ప్రకారం, సెప్టెంబర్ 22, 2025 నుంచి చిన్న కార్లపై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నారు. దీంతో ఒక్కో కార్ ధర రూ. 45,000 నుంచి 1,00,000 వరకు తగ్గే అవకాశం ఉంది
ఏమేమి మార్పులు ?
– చిన్న కార్లపై GST: పొడవు 4 మీటర్లు లోపు, పెట్రోల్/CNG/LPG ఇంజిన్ 1200CC లోపు, డీజిల్ ఇంజిన్ 1500CC లోపు కార్లకు 18% GST వర్తించనుంది.
– ఎక్కువ రేట్లు ఉండే కార్లపై గతంలో ఉన్న సెస్సు (17-22%) తొలగింపు: ఇప్పుడు 40 శాతమే GST రేటు కనిపిస్తుంది. దీని వల్ల, అందుబాటు-మధ్యతరగతి కార్ల ధరలు కూడా కొంతమేర ఉపశమనం పొందుతాయి.
[irp posts=”4229″ ]
మార్కెట్‌పై ప్రభావం
– డిమాండ్ పుంజుకునే ఛాన్స్: స్టార్టింగ్-సెగ్మెంట్ కార్ల రేట్లు తగ్గుతుండటంతో, రెండో, మూడో స్థాయి పట్టణాల్లో కొనుగోళ్లు పెరిగే అవకాశముంది, ముఖ్యంగా పండుగ సీజన్లలో రేట్లు భారీగా తగ్గుతాయి.
– ప్యాసింజర్ కార్ల వాటా: చిన్న కార్ల మార్కెట్ శాతం గత ఏడాది 31% నుంచి 27%కి పడిపోయింది; ధరల తగ్గింపు వల్ల ఇది తిరిగి పెరుగుతుందని నమ్ముతున్నారు.
– ప్రయోజనం పొందే వర్గాలు: మొదటిసారిగా కార్లు కొనే మధ్య వర్గ కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు
– ఎలక్ట్రిక్ కార్లపై GST : ఇది 5% రేటు కొనసాగనుంది. ఇటీవల అమలు చేసిన రేట్లలో ఎలాంటి మార్పు లేదు
పరిశ్రమ వర్గాలు నిపుణుల స్పందనలు
– SIAM ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర: పండగల టైమ్ లో GST రేటు తగ్గించడంతో ఆటో రంగానికి బాగా కలిసొస్తుంది. వినియోగదారులకు బెనిఫిట్ దొరుకుతుంది. అని అన్నారు.
– గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ సాకేత్ మెహ్రా: ‘12% తగ్గింపు వల్ల కొనుగోలు వ్యయం రూ. లక్ష వరకు తగ్గే అవకాశముంది, ఫెస్టివల్ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుంది’
– FADA ప్రెసిడెంట్ సి.ఎస్. విఘ్నేశ్వర్: ‘GST రేట్ల తగ్గింపు వలన కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది’ అని అభిప్రాయపడ్డారు
ప్రీమియం అండ్ మిడ్‌సైజ్ కార్లు
– ప్రీమియం కార్లపై: 40% GST రేటు అమలులో ఉన్నప్పటికీ సెస్సు లేకుండా ఉండటం వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
– మిడ్‌సైజ్ కార్లపై: 40% రేటు అమలవుతుంది. కానీ సెస్సు తొలగించడంతో కొంత తగ్గింపు ఉంటుంది.
Key Points
– సెప్టెంబర్ 22, 2025 నుంచీ కొత్త GST Rates అమల్లోకి వస్తాయి; ఇది నవరాత్రి ప్రారంభ దినమే.
– ఆటోమొబైల్ కొనుగోళ్లకు అత్యుత్తమ సీజన్ కానుంది―కొనుగోలు ఆలోచనలో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్.
Read also : క్రిప్టో కరెన్సీకి క్యూఆర్ కోడ్ : సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్