ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి…అసెంబ్లీ సెషన్స్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది… తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో….
కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి….ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు… కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకంటే ముందే వేడెక్కుతోంది అక్కడి రాజకీయ వాతావరణం YSR కాంగ్రెస్ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ఓ టాక్ నడుస్తోంది. మరి అది నిజమేనా ?
జగన్ అటెండ్ కాకపోతే బహిష్కరణ వేటు పడుతుందా…?
ఏపీలో ప్రతిపక్ష నేత హోదా కావాలిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈమధ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్ తో మిగిలిన 10 మంది YCP ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది… త్వరలో పులివెందుల ఉపఎన్నిక రాబోతుంది అని చెప్పారు… అంటే 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు పడుతుందా ? అనే టెన్షన్ మొదలైంది… కొందరు వైసీసీ ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా కొత్తగా గెలిచిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు… మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు ప్రత్యేక కూటమిగా ఏర్పడి…. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం…. వాళ్ళని సభకు వెళ్లనీయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వైసీపీలో గెలిచింది…11 ఎమ్మెల్యేలు.. వీళ్ళల్లో రాయలసీమ నుంచి గెలిచిన ఐదుగురిలో జగన్ ఒకరు…కడప నుంచి జగన్ తో కలిపి ముగ్గురు…చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… ఆయన బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. వీళ్ళంతా నమ్మకంగా జగన్ వైపే ఉంటారని అంటున్నారు. ఐదుగురు వరకూ ఓకే.. మిగిలిన ఐదుగురి పరిస్థితి ఏంటి అన్నది డౌట్ గా ఉంది. కూటమి 164 సీట్లతో అధికారంలో ఉంది.
అందువల్ల కొత్త సభ్యులను… అందులోనూ వైసీపీ సభ్యులను చేర్చుకోవడం కష్టమే. అందుకే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేలు ప్రత్యేక కూటమిగా హాజరవుతారని చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకూ అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించకపోయినా, పొలిటికల్ సర్కిల్లో ఈ ట్విస్ట్ మీద హాట్ డిస్కషన్ నడుస్తోంది.
18న మొదలయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్సుందని అంటున్నారు….

RuPay is more than just a card—it’s your gateway to smarter spending and festive joy. With unbeatable discounts, seamless UPI integration, and lifestyle perks, it’s the perfect companion for this season’s celebrations.
So why wait? Tap into these offers now using your RuPay Credit Card—and if you’re new to RuPay, apply through my [affiliate link] to get started and enjoy all the perks!
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/