జీఎస్టీ తగ్గిందని షాపింగ్ చేయకండి! ఎక్కడ తగ్గాయో తెలుసుకోండి !!
కేంద్ర ప్రభుత్వం GST స్లాబ్స్ తగ్గించింది. కొత్త శ్లాబులు అమల్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడే షాపింగ్ మాల్స్‌కి పరుగెత్తడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే, చాలా స్టోర్స్‌లో ఇంకా పాత రేట్లకే వస్తువులు అమ్ముతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సూపర్ మార్కెట్లలో Customers అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఆర్టికల్‌లో మనం GST తగ్గింపు వెనుక ఉన్న నిజాన్ని, మార్కెట్లో జరుగుతున్న పరిస్థితిని, షాపింగ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం.
GST తగ్గింది అనగానే వెంటనే షాపింగ్ చేస్తున్నారా ?
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త GST శ్లాబులను అమల్లోకి తీసుకొచ్చింది. కొన్ని వస్తువులపై 28% నుంచి 18%, 18% నుంచి 12% లేదా 5%కి తగ్గించారు. ముఖ్యంగా నిత్యావసరాలు, కార్లు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు ఇలా 375కి పైగా వస్తువులపై తగ్గింపు అమల్లోకి వచ్చింది.
అయితే, ఈ తగ్గింపు ప్రకటనలతో షాపింగ్ మాల్స్‌కి వెళ్లిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే, చాలా స్టోర్స్‌లో ధరలు తగ్గలేదు. పాత స్టాక్‌కి కొత్త GST స్టిక్కర్లు పెట్టాల్సిన అవసరం ఉన్నా, చాలా చోట్ల అది జరగడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మోర్, రిలయన్స్, రత్నదీప్, స్పెన్సర్స్ లాంటి పెద్ద సూపర్ మార్కెట్లు ఉన్నాయి. కానీ వీటిల్లో కొన్నింటిలో ధరలు తగ్గించలేదని Customers ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రత్నదీప్‌లో ఓ customer “GST తగ్గిందని షాపింగ్ చేశాను, కానీ ఒక్క రూపాయి కూడా తగ్గలేదు” అంటూ సిబ్బందితో గొడవపడిన వీడియో వైరల్ అయింది.
కేంద్రం ప్రకటనలు vs గ్రౌండ్ రియాలిటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్ మెంట్ ప్రకారం, దాదాపు 99% నిత్యావసరాలపై ధరలు తగ్గాయని చెప్పారు. ప్రధాని మోడీ కూడా పబ్లిక్ మీటింగ్‌లో ఈ విషయాన్ని హైలైట్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేలా ఉన్నాయి. పాత స్టాక్ అమ్ముడయ్యాకే కొత్త స్టాక్‌కి తగ్గించిన GST అమలు చేస్తామని కొన్ని షాపులు చెబుతున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం.
పాత స్టాక్‌కి కొత్త GST ఎలా అమలు చేయాలి?
కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం, పాత స్టాక్‌కి కూడా కొత్త GST స్టిక్కర్లు పెట్టాలి. కానీ చాలా రిటైల్ స్టోర్స్‌లో ఇది జరగడం లేదు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, బిల్లులో GST బాదుడు ఉంటే అవసరమైతే ఫిర్యాదు చేయాలి.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో కూడా ఇదే తంతు
ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో GST ని Zero చేసింది. కానీ చాలా కంపెనీలు తమ పాలసీల ప్రీమియంలను తగ్గించలేదు. తగ్గిన GST ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇవ్వకుండా, తమ లాభాల్లో కలుపుకుంటున్నాయి.
ఎలక్ట్రానిక్స్, యాక్ససిరీస్ పరిస్థితి ఏంటి ?
టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులపై కూడా GST తగ్గింది. కానీ కొన్ని స్టోర్స్‌లో ఇంకా పాత రేట్లకే అమ్ముతున్నారు. వినియోగదారులు ధరలు తగ్గాయా లేదా అన్నది బిల్లు చూసి నిర్ధారించుకోవాలి.
కార్ల ధరలు మాత్రం తగ్గాయి!
కార్ల విషయంలో మాత్రం కంపెనీలు బాగా ధరలు తగ్గించాయి. మహీంద్రా మోడల్స్‌లో లక్షన్నర వరకు తగ్గించారు. నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్స్‌పై లక్షకు పైగా తగ్గింపు ఉంది. ఫార్చ్యూనర్‌లోని ఓ వేరియంట్‌పై ఏకంగా ₹3.49 లక్షల లెస్ అయింది. కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.
GST తగ్గిందని వినిపించిన వెంటనే షాపింగ్‌కి వెళ్లడం కంటే, అసలు తగ్గింపు అమలవుతోందా లేదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బిల్లులో GST రేట్లు చూసి, అవసరమైతే స్టోర్ మేనేజ్మెంట్ని అడగండి. ప్రభుత్వం చెప్పినదానికీ, మార్కెట్లో జరుగుతున్నదానికీ తేడా ఉందని గ్రహించండి.
మీ డబ్బు విలువైనది – దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయండి!
గుండూ బాస్ అన్నట్టు… డబ్బులు ఊరికే రావు… అని గుర్తుంచుకోండి.
What Can You Do If GST Isn’t Applied?
If you suspect that a retailer is not applying the revised GST rates, here’s what you can do:
✅ Step-by-Step Complaint Process:
- Check your bill – Look for GST breakdown and rate applied.
- Speak to store management – Ask why the new rates aren’t reflected.
- File a complaint with:
- National Consumer Helpline: Call 1800-11-4000 or visit consumerhelpline.gov.in
- GST Portal: gst.gov.in → Use “Raise Complaint” section
- Email CBIC: cbecmitra.helpdesk@icegate.gov.in
You can also tag official handles on social media:
- @FinMinIndia
- @GST_Council
- @ConsumerVoiceIn

అందరికీ నమస్తే! Amazon Great Indian Festival ప్రారంభమైంది. ఈ పండగ సీజన్లో మీరు ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే, ఈ అఫిలియేట్ లింక్ ద్వారా కొనండి. మీకు అదనంగా ఏమీ ఖర్చు కాదు, కానీ నాకు చిన్న కమీషన్ వస్తుంది — ఇది నా కంటెంట్‌ను ఇంప్రూవ్ చేసుకోడానికి సహాయపడుతుంది. మీ మద్దతుకు ధన్యవాదాలు!

హలో ఫ్రెండ్స్! Flipkart Big Billion Days సేల్ స్టార్ట్ అయింది. బ్రాండెడ్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైనా కొనాలి అనుకుంటే, నా అఫిలియేట్ లింక్ ద్వారా కొనండి. మీకు అదనంగా ఖర్చు ఉండుదు. కానీ నాకు చిన్న ఆదాయం వస్తుంది. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది — ముందుగానే థ్యాంక్స్ చెబుతున్నాను!


