ఇప్పటివరకు మనం UPI చెల్లింపులు చేయాలంటే PIN ఎంటర్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్‌తో, వేలిముద్ర లేదా Face Scan చేస్తే చాలు – చెల్లింపు పూర్తవుతుంది! ఇది NPCI (National Payments Corporation of India) తీసుకొచ్చిన కొత్త సదుపాయం. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో దీన్ని ఆవిష్కరించారు.
ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో NPCI స్పష్టంగా చెప్పలేదు కానీ, కొన్ని వార్తా సంస్థలు చెప్పినట్టు అక్టోబర్ 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఆధార్‌లో ఉన్న బయోమెట్రిక్ డేటా ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

25% టైమ్ ఆదా !
పాత పద్ధతిలో UPI PIN ఎంటర్ చేయడం వల్ల కొంత టైమ్ పడుతుంది. కానీ ఈ కొత్త ఫీచర్ వల్ల లావాదేవీల టైమ్ 25% వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ యాప్‌లో ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్ అవసరం లేకుండా Face Scan లేదా Bio Metricతో చెల్లింపు పూర్తవుతుంది.
ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, పెద్దవారికి, డిజిటల్ పేమెంట్స్ విషయంలో భయం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. NPCI ఈ ఫీచర్‌ను పూర్తిగా పరీక్షించి, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ తీసుకొచ్చింది.
ఒకే ఖాతా – ఇద్దరు యూజర్లు
ఇంకా ఒక కొత్త ఫీచర్ ఏమిటంటే, ఒకే బ్యాంక్ ఖాతాను ఇద్దరు వ్యక్తులు UPI చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. ఒకరు లావాదేవీ ప్రారంభిస్తే, రెండో వ్యక్తికి నోటిఫికేషన్ వస్తుంది. ఇద్దరూ తమ ఫోన్లలో UPI PIN ఎంటర్ చేసి లావాదేవీ పూర్తిచేయొచ్చు. ఇది ఫ్యామిలీ ఖాతాలు, బిజినెస్ ఖాతాలకు చాలా ఉపయోగపడుతుంది.
స్మార్ట్ గ్లాస్‌తో చెల్లింపులు
ఇంకా NPCI తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్ – స్మార్ట్ గ్లాస్. QR CODEను Scan చేసి, నోటితో ఆదేశం ఇవ్వడం ద్వారా చెల్లింపు చేయొచ్చు. ఫోన్ లేకుండా, పిన్ లేకుండా, టచ్ చేయకుండా – పూర్తిగా హ్యాండ్స్ ఫ్రీ పేమెంట్!
Read also : Kannada Big Boss హౌస్‌కు తాళాలు (click here)
డాలర్లను డిజిటల్‌గా కొనొచ్చు
ఇంకా ఒక ముఖ్యమైన అప్‌డేట్ – RBI ప్రకారం, FX Retail అనే విదేశీ మారకద్రవ్య ప్లాట్‌ఫామ్‌తో భారత్ కనెక్ట్ అనుసంధానమైంది. దీని ద్వారా మనం అమెరికా డాలర్లను డిజిటల్‌గా కొనుగోలు చేయొచ్చు. ఫారెక్స్ కార్డ్‌లో లోడ్ చేయొచ్చు, విదేశీ నగదు చెల్లింపులు చేయొచ్చు.
ఈ సదుపాయం ప్రస్తుతం SBI, Axis Bank, ICICI Bank, Federal Bank, Yes Bank వంటి బ్యాంకులతో అందుబాటులో ఉంది. ఖాతాదారులు ముందుగా వివరాలు నమోదు చేసుకుని, డాలర్ ధరలు చూసి, కావాలంటే కొనుగోలు చేయొచ్చు. FX Retail ప్లాట్‌ఫామ్‌ను Clearcorp Dealing Systems నిర్వహిస్తోంది.
ఈ కొత్త ఫీచర్ల వల్ల UPI చెల్లింపులు మరింత సులభం, భద్రతగా, అందరికీ అందుబాటులో ఉండేలా మారాయి. PIN-free, biometric-based, voice-command payments – ఇవన్నీ మన డిజిటల్ లైఫ్‌ను ఇంకొంచెం స్మార్ట్‌గా మార్చబోతున్నాయి!
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/