PhonePe Protect : మోసాలను అడ్డుకునే కొత్త ఫీచర్
డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే (PhonePe) , ఆన్‌లైన్ మోసాలను తగ్గించేందుకు ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ప్రభుత్వం ప్రమాదకరంగా గుర్తించిన నంబర్లకు చెల్లింపులు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయబడతాయి. అలాగే, అనుమానాస్పద ఖాతాలకు డబ్బు పంపే ముందు యూజర్లకు అలర్ట్ చూపిస్తుంది.
ఫోన్‌పే ప్రొటెక్ట్ (PhonePe Protect) ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవస్థ Department of Telecom (DoT) అందించే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) డేటాను ఉపయోగిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఫోన్ నంబర్లను రిస్క్ స్థాయిలుగా వర్గీకరిస్తుంది.
- “చాలా ప్రమాదకరమైన” నంబర్లకు డబ్బు పంపే ప్రయత్నం చేస్తే, ఫోన్‌పే చెల్లింపును బ్లాక్ చేస్తుంది.
- “మధ్యస్థ ప్రమాదం” ఉన్న నంబర్లకు అలర్ట్ చూపించి, యూజర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తుంది.
ఈ వ్యవస్థ రియల్ టైమ్‌లో పనిచేస్తుంది. కొత్త మోసపూరిత నంబర్లు (Fraud Mobile Numbers) గుర్తించిన వెంటనే అప్డేట్ అవుతుంది.

ఫోన్‌పే ప్రొటెక్ట్ (PhonePe Protect) ఎలా ఆన్ చేయాలి?
ఈ ఫీచర్‌ను యూజర్లు ఇలా ఆన్ చేయవచ్చు:
- ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయండి
- ప్రొఫైల్ లేదా సెట్టింగ్స్ సెక్షన్‌కి వెళ్లండి
- యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేయండి
- “PhonePe Protect” అనే ఆప్షన్ కనిపిస్తే, దాన్ని ఆన్ చేయండి
- నోటిఫికేషన్లు అనుమతించండి
Read also : ఆధార్ అప్ డేట్ ఇక మరింత ఈజీ : Nov 1 నుంచి కొత్త రూల్స్, PAN తో లింక్ చేసుకోండి
ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యమైనది?
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఫోన్‌పే ప్రొటెక్ట్ ద్వారా:
- యూజర్లు అప్రమత్తంగా ఉంటారు
- మోసపూరిత చెల్లింపులు తగ్గుతాయి
- డిజిటల్ చెల్లింపులపై నమ్మకం పెరుగుతుంది
ఇలాంటి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే, మా గ్రూప్‌లలో చేరండి:
👉 అరట్టై గ్రూప్
👉 టెలిగ్రామ్ ఛానల్
👉 Join our Arattai Group
👉 Join our Telegram Channel
For English Version : New PhonePe Feature Stops Fraud Before You Pay



