Media నమ్మకాన్ని చంపేసిందా ? Washington Post Failures సాక్ష్యం

Washington post

మీరు రోజూ చదివే పేపర్, చూసే న్యూస్ ఛానెల్… అందులో వచ్చే ప్రతి మాటా నిజమని గ్యారంటీ ఏంటి? ఆ వార్తలను బట్టే కదా మీరు ఒక అభిప్రాయానికి వచ్చేది? మరి… ఒకవేళ మీ నమ్మకమే అబద్ధమైతే? మీకు చెప్పే ప్రతి వార్త వెనుక ఒక రాజకీయ అజెండా దాగి ఉంటే? ఈ ప్రశ్నలు వినడానికి పెద్దవిగా అనిపించవచ్చు. కానీ, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పత్రికగా, అమెరికా అధ్యక్షుడినే గడగడలాడించిన ‘వాషింగ్టన్ పోస్ట్’ కథ వింటే, ఈ ప్రశ్నలు ఎంత నిజమో మీకే తెలుస్తుంది. ఇది కేవలం ఒక అమెరికన్ పత్రిక కథ కాదు. మన మీడియా, మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో చెప్పే ఒక హెచ్చరిక. మీడియా మన నమ్మకాన్ని ఎలా హత్య చేసిందో చెప్పే కథ.

మీడియాపై కూలిపోతున్న నమ్మకం


ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు, నిజం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం? ఒకప్పుడు మనందరి సమాధానం ‘మెయిన్ మీడియా’ – అంటే పేపర్లు, టీవీ ఛానెళ్లు. మరి ఇప్పుడు? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వైపు, యూట్యూబ్ ఛానెళ్ల వైపు చూస్తున్నారు. ఎందుకొచ్చింది ఈ మార్పు? ఎందుకంటే, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలా నిలబడాల్సిన మీడియా, ఇప్పుడు రాజకీయ పార్టీల పాంప్లేట్ లాగా మారిపోయిందనే అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. వార్త వార్తలా కాకుండా, ఒకరిపై దాడిలా, మరొకరిపై భజనలా కనిపిస్తోంది. ఈ నమ్మకద్రోహం ఎలా మొదలైంది? దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే, వాషింగ్టన్ పోస్ట్ కథను మనం ఒక కేస్ స్టడీగా చూడాలి. 25 years సీనియర్ జర్నలిస్ట్ గా నా అనుభవం కూడా కలిపి ఇస్తున్నా. గతంలో నేను కూడా అదే ఛానెల్స్, డైలీస్ లో చేసి వచ్చా… ఇప్పుడు సొంతంగా ఎదుగుతున్నా… దయచేసి…మన Telugu Journalist ఛానెల్ ని subscribe చేసుకొని… ఈ జర్నలిస్ట్ ను ఆదరించండి. Link:

ఒక మీడియా దిగ్గజం కథ – వాషింగ్టన్ పోస్ట్ వైభవం – పతనం

వాషింగ్టన్ పోస్ట్… ఈ పేరు వినగానే జర్నలిజం గురించి తెలిసిన ఎవరికైనా గుర్తొచ్చేది ‘వాటర్‌గేట్ కుంభకోణం’. 1970లలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ను పదవికి రిజైన్ చేయించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో ప్రపంచవ్యాప్తంగా మీడియా శక్తిని చాటి చెప్పిన సంస్థ అది. ‘ప్రజాస్వామ్యం చీకటిలో అంతరిస్తుంది’ (Democracy Dies in Darkness) అనేది వాళ్ళ నినాదం. అంటే, నిజాలు బయటకు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదని బలంగా నమ్మిన పత్రిక వాషింగ్టన్ పోస్ట్.

అలాంటి పత్రిక, 2013లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చేతుల్లోకి 250 మిలియన్ డాలర్లకు వెళ్ళినప్పుడు, దాని భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, సరిగ్గా దశాబ్దం గడిచేసరికి, ఆ దిగ్గజం కుప్పకూలడం మొదలైంది.

నష్టం అంకెల్లో చెప్పాలంటే… 2024లో వాషింగ్టన్ పోస్ట్ కి దాదాపు 100 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అంతకు ముందు రెండేళ్లలో మొత్తం నష్టం 177 మిలియన్ డాలర్లు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చదివే ఈ పత్రిక, ఇటీవలి కాలంలో తన ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మందిని, అంటే దాదాపు 300 మంది జర్నలిస్టులను తొలగించింది. స్పోర్ట్స్, బుక్స్ లాంటి కీలక విభాగాలను పూర్తిగా మూసివేసింది. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో తమ బ్యూరోలను క్లోజ్ చేసి, ఇంటర్నేషనల్ కవరేజీని భారీగా తగ్గించుకుంది. 2025లో, 55 ఏళ్లలో మొదటిసారిగా దాని ప్రింట్ సర్క్యులేషన్ లక్ష కంటే తక్కువకు పడిపోయింది. ఇదొక మామూలు పతనం కాదు, ఒక మీడియా సామ్రాజ్యం మన కళ్లముందే కూలిపోవడం.

ఎందుకిలా జరిగింది? పతనానికి అసలు కారణాలు ఏంటి ?

ఒకప్పుడు జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పత్రికకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది: రాజకీయ జోక్యం (Political Polarization). డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వాషింగ్టన్ పోస్ట్ ఆయనపై తీవ్రమైన విమర్శనాత్మక స్టోరీస్ పబ్లిష్ చేసింది. ఇది ఆ టైమ్ లో సబ్‌స్క్రైబర్లను బాగా పెంచింది. కానీ, ట్రంప్ ఓడిపోయాక అదే వాళ్ళని దెబ్బతీసింది. డెమోక్రాట్ మద్దతుదారులు “ఇక ట్రంప్‌ను విమర్శించడానికి ఏముందిలే” అని చదవడం మానేశారు. మరోవైపు, కన్జర్వేటివ్‌లు మొదటి నుంచీ దాన్ని ఒక “లిబరల్ పేపర్”గా ముద్రవేసి దూరంగానే ఉన్నారు. అంటే, ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఉండటం కొన్నాళ్లు లాభం కలిగించినా… చివరికి నమ్మకాన్ని ఎలా నాశనం చేస్తుందో వాషింగ్టన్ పోస్ట్ ఉదంతం ఒక గుణపాఠమని చెప్పాలి. వార్తా సంస్థ ఒక ఉద్యమ సంస్థగా మారినప్పుడు, ప్రజలు దాన్ని తమ అభిప్రాయాలను బలపరుచుకోవడానికే చూస్తారు. ఆ అవసరం తీరాక వదిలేస్తారు.

రెండవది: యజమాని జోక్యం అండ్ నమ్మకాన్ని కోల్పోవడం. జెఫ్ బెజోస్ యాజమాన్యంపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, పత్రిక ఎడిటోరియల్ బోర్డు కమలా హారిస్‌కు మద్దతుగా ఎండోర్స్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించగా, జెఫ్ బెజోస్ వ్యక్తిగతంగా దాన్ని ఆపేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సంఘటనతోనే, దాదాపు 2,50,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు తమ చందాను రద్దు చేసుకున్నారని సమాచారం. యజమాని తన వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం పత్రిక స్వరూపాన్ని మార్చాలని చూస్తున్నాడనే భావన పాఠకులలో బలంగా వెళ్ళింది. ఇది పత్రిక క్రెడిబిలిటీపై పడిన అతిపెద్ద దెబ్బ.

మూడవది: మారుతున్న వ్యాపార నమూనా. డిజిటల్ యుగంలో వార్తలను చదివే విధానం పూర్తిగా మారిపోయింది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఉచితంగా వార్తలు … క్షణం క్షణ అప్ డేట్ అవుతున్నప్పుడు… కేవలం సబ్‌స్క్రిప్షన్లనే నమ్ముకోవడం వాషింగ్టన్ పోస్టును దెబ్బతీసింది. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు వార్తలతో పాటు, గేమ్స్, కుకింగ్, ప్రొడక్ట్ రివ్యూస్ లాంటి ఇతర సర్వీసెస్ కూడా అందిస్తూ తమ సబ్‌స్క్రైబర్లను నిలుపుకున్నాయి. కానీ వాషింగ్టన్ పోస్ట్ మాత్రం… ఈ మార్పును అందుకోవడంలో వెనుకబడింది.

మన అద్దంలో వాషింగ్టన్ పోస్ట్ – తెలుగు మీడియా పరిస్థితి

ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. వాషింగ్టన్ పోస్ట్‌లో జరిగిన ఈ కథ మన తెలుగు మీడియాకు ఏ పాఠాలు నేర్పుతోంది? అక్కడ జరిగిన తప్పులే ఇక్కడ కూడా జరుగుతున్నాయా?

** డౌట్ లేకుండా అవుననే చెప్పాలి.**

వాషింగ్టన్ పోస్ట్‌ను దెబ్బతీసిన రాజకీయ జోక్యం… మన తెలుగు మీడియాలో అంతకంటే భయంకరమైన స్థాయిలో పాతుకుపోయింది. ఇక్కడ దాదాపు ప్రతి ప్రధాన మీడియా సంస్థ ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా ఊదుతోందనేది బహిరంగ రహస్యం. కొన్ని మీడియా సంస్థలు ఒక పార్టీకి, మరికొన్ని మరో పార్టీకి కొమ్ము కాస్తున్నాయని, వాటి వార్తల్లో, చర్చల్లో ఈ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోందని జనం మాట్లాడుకుంటున్నారు. ఒక ఛానెల్ ఒక నాయకుడిని దేవుడిని చేస్తే, మరో ఛానెల్ అదే లీడర్ ని రాక్షసుడిలాగా చూపిస్తుంది. దీనివల్ల ప్రజలు వార్తను వార్తలా కాకుండా, అది ఏ పార్టీకి అనుకూలమో ముందే నిర్ణయించుకుని చూస్తున్నారు. దాంతో వాషింగ్టన్ పోస్ట్ లాగే, తెలుగు మీడియా కూడా ప్రజల నమ్మకాన్ని వేగంగా కోల్పోతోంది.

అక్కడ జెఫ్ బెజోస్ జోక్యం చేసుకుంటే, ఇక్కడ మీడియా యజమానులే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండటం లేదా పొలిటికల్ పార్టీలతో బలమైన వ్యాపార బంధాలు కలిగి ఉండటం సాధారణంగా మారింది. దీనివల్ల వార్తల ఎంపిక నుంచి, వాటిని చూపించే విధానం వరకు అంతా ఓనర్ల రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రకటనలు, కార్పొరేట్ సంస్థల మద్దతుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ వల్ల…. మీడియా స్వేచ్ఛగా పనిచేయడానికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రకటనలు ఆగిపోతాయనే భయం, పాలకులకు వ్యతిరేకంగా రాస్తే వ్యాపారాలపై దాడులు జరుగుతాయనే ఆందోళన జర్నలిజం గొంతు నొక్కేస్తున్నాయి.

ప్రజాస్వామ్యంపై ప్రభావం, ప్రభుత్వాల నియంత్రణ

మీడియా ఇలా క్రెడిబిలిటీరి కోల్పోయి, ప్రచార సాధనంగా మారడం వల్ల జరిగే అతిపెద్ద నష్టం ప్రజాస్వామ్యానికే. జనానికి సరైన, నిష్పక్షపాతమైన సమాచారం అందనప్పుడు, వాళ్ళు సరైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? పాలకులను ప్రశ్నించే గొంతుకలే మూగబోతే, ఇక జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది?

ఈ ఖాళీని సోషల్ మీడియా, ఇండిపెండెంట్ యూట్యూబ్ క్రియేటర్లు కొంతవరకు భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జనం కూడా ప్రధాన మీడియాను వదిలిపెట్టి, తమకు నమ్మకం కలిగించే కంటెంట్ కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఇక్కడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒకవైపు ఫేక్ న్యూస్, దుష్ప్రచారం ఒక సమస్య అయితే, మరోవైపు ప్రభుత్వాల కంట్రోల్ మరో పెద్ద సమస్యగా మారుతోంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రూల్స్ 2021, డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వానికి అపరిమిత అధికారాలను ఇచ్చాయి. ప్రభుత్వానికి నచ్చని కంటెంట్‌ను 36 గంటల్లో తొలగించాలని ఆదేశించే అధికారం, వార్తను ఎవరు పుట్టించారో గుర్తించాలనే రూల్ భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకులుగా మారాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలను విమర్శించే యూట్యూబ్ ఛానెళ్లపై కేసులు పెట్టడం, వాటిని బ్లాక్ చేయించడం లాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే, ఒకవైపు ప్రధాన మీడియా పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారింది, మరోవైపు స్వతంత్రంగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా ప్రభుత్వాల నియంత్రణ నీడలోకి వెళ్ళిపోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

ఫ్రెండ్స్ వాషింగ్టన్ పోస్ట్ పతనం మనకు చెబుతున్న పాఠం ఒక్కటే. మీడియా తన ప్రాథమిక ధర్మాన్ని—అంటే నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వార్తలను అందించడమనే బాధ్యతను—విస్మరిస్తే, జనం దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఆ నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే, తిరిగి సంపాదించడం దాదాపు అసాధ్యం. ఈరోజు వాషింగ్టన్ పోస్ట్, రేపు మన తెలుగు మీడియా కూడా కావచ్చు. ఈ ప్రమాదాన్ని మనం గుర్తించాలి. ఒక పాఠకుడిగా, ఒక ప్రేక్షకుడిగా, ఒక పౌరుడిగా మనం మేల్కొనాల్సిన సమయం ఇది.

ఇలాంటి పరిస్థితుల్లో మనం వార్తలను ఎలా స్వీకరించాలి?

ఏది నిజమో, ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవాలి?

ఒకే వార్తపై భిన్నమైన మీడియా సంస్థల కథనాలను చూడటం, వాట్సాప్ ఫార్వర్డ్‌లను గుడ్డిగా నమ్మకపోవడం, మనకు నచ్చని అభిప్రాయాన్ని కూడా వినడానికి సిద్ధంగా ఉండటం లాంటివి మనం చేయాల్సిన కనీస ప్రయత్నాలు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మీడియా తన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి? కింద కామెంట్స్‌లో తప్పకుండా పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, ఈ కింద పెట్టిన వీడియోను లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానెల్‌ Telugu Journalistను సబ్‌స్క్రయిబ్ చేసుకుని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. 25యేళ్ళ జర్నలిజం హిస్టరీ ఉన్న ఈ సీనియర్ జర్నలిస్ట్ ను ఆదరించడం అస్సలు మర్చిపోవద్దు.

author avatar
Vishnu Kumar
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
Vishnu Kumar  के बारे में
Vishnu Kumar Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms. Read More
For Feedback - telanganaexams@gmail.com