ఇరాన్ పై పగ తీర్చుకున్న ఇజ్రాయెల్
Israel-Iran War – BIG BREAKING ! మిడిలీస్ట్ అగ్నిగుండంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ప్రపంచ దేశాలు దేని గురించి అయితే భయపడ్డాయో, ఆ ఘటనే ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా ఇరాన్‌పై భీకర దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆఫీస్ ఉన్న ఏరియానే టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు జరిగాయి. ఈ ఊహించని పరిణామంతో టెహ్రాన్ ఆకాశం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీస్తున్నారు. మరోవైపు, ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతుయన్న అంచనాలతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. అసలు టెహ్రాన్‌లో ఏం జరిగింది? ఈ దాడి వెనుక కారణాలేంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ క్షేమంగా ఉన్నారా? రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ?
ఇరాన్ లో ఏం జరిగింది అంటే…
శనివారం మధ్యాహ్నం (Feb 28th, 2026) … మిడిలీస్ట్ హిస్టరీలో మోస్ట్ పవర్ ఫుల్ డేంజర్ చాప్టర్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిసి ఒక భారీ సైనిక ఆపరేషన్‌ను చేపట్టాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ రోరింగ్ లయన్” అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లక్ష్యం ఒక్కటే – ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, తద్వారా తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడం. టెహ్రాన్ లోకల్ టైమ్ ప్రకారం, మధ్యాహ్నం సమయంలో రాజధానిలోని కీలక ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ F-35, F-15 ఫైటర్ జెట్లు, అమెరికాకు చెందిన F-22 రాప్టర్లతో కలిసి ఇరాన్ ఆకాశంలోకి చొచ్చుకెళ్లాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖోమ్ నగరాల్లోని అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, కమాండ్ సెంటర్లే వీటి మెయిల్ టార్గెట్స్. ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం, ఉత్తర టెహ్రాన్‌లోని అత్యంత కీలకమైన షెమిరాన్ జిల్లాపై భారీ సంఖ్యలో మిస్సైల్స్ విరుచుకుపడ్డాయి. ఇక్కడే ఇరాన్ అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా మండలి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధికారిక నివాసం, ఆఫీసులు ఉన్నాయి. అమెరికాకు చెందిన USS గెరాల్డ్ R. ఫోర్డ్, USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌకల నుంచి కూడా ఈ ఎటాక్స్ జరిగినట్టు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక ప్రకటన చేశారు. “ఇరాన్ నుంచి మా దేశానికి ఉన్న ముప్పును పర్మనెంట్ గా తొలగించడానికే ఈ కఠినమైన, ముందస్తు దాడి చేశాం” అని అన్నారు. ఇది చాలా నెలల పాటు అమెరికాతో కలిసి పక్కాగా ప్లాన్ చేసిన ఆపరేషన్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఖమేనీ ఎక్కడ? సురక్షితంగా ఉన్నారా?
ఈ భీకర దాడి టైమ్ లో ఇరాన్ అత్యున్నత నాయకుడు, 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారు? ఆయన సేఫ్‌గా ఉన్నారా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే అడుగుతోంది. దాడులు నేరుగా ఆయన ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర్లోనే జరగడంతో ఆయన భద్రతంగా ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే, రాయిటర్స్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రకారం, దాడి జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ భద్రతా వర్గాలు ఖమేనీని హెచ్చరించాయి. గత కొన్ని రోజులుగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఆయన పబ్లిక్ ఈవెంట్స్‌కి కూడా దూరంగా ఉంటున్నారు. దాడికి ముందే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పెషల్ టీమ్ ఆయన్ను టెహ్రాన్ నుంచి ఒక అత్యంత రహస్య, సురక్షిత బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఖమేనీ ప్రాణాలతోనే, సురక్షితంగానే ఉన్నారని సమాచారం. కానీ, ఆయన అధికార కేంద్రంపై, ఆయన ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర జరిగిన ఈ దాడి, ఇరాన్ పాలన ప్రతిష్టకు పెద్ద దెబ్బ. ఇది ఇరాన్ ప్రభుత్వానికి తీరని అవమానమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వెంటనే ప్రతీకారం – ఇరాన్ ఎదురుదాడి
“యుద్ధం మొదలుపెట్టింది మీరు, కానీ ముగింపు ఇచ్చేది మేము.” ఇజ్రాయెల్-అమెరికా దాడులపై ఇరాన్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది. చెప్పినట్టుగానే, దాడులు జరిగిన గంటల్లోనే ఇరాన్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), తమ బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో… మొదటి దశ దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ ఆకాశం దద్దరిల్లింది. జెరూసలేంతో సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్ లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. తమ వైపు దూసుకొస్తున్న చాలా క్షిపణులను గాల్లోనే పేల్చివేస్తున్నామని IDF ప్రకటించింది. అయినా, ఇరాన్ సెకండ్ స్టేజ్ ఎటాక్స్ కూడా ప్రారంభించడంతో ఇజ్రాయెల్‌లో తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. ఇరాన్ ప్రతీకారం ఇజ్రాయెల్‌కే పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపైనా క్షిపణుల వర్షం కురిపించింది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే, ఖతార్‌లోని అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్, UAEలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌లను కూడా టార్గెట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ దాడుల భయంతో UAE, ఖతార్, కువైట్ తమ ఆకాశ మార్గాలను మూసివేశాయి, దీంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం హెచ్చరికలు
ఈ దాడి కేవలం ఇజ్రాయెల్ చర్య కాదు, అమెరికాతో కలిసి పక్కా సమన్వయంతో చేసిన వ్యూహాత్మక దాడి. ఎటాక్ జరిగిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్లో “మేజర్ కంబాట్ ఆపరేషన్స్” జరుగుతున్నాయని ఆయన ధృవీకరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా చూడటమే తమ లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు. ఇరాన్ ప్రజలను, సైన్యాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు ఒక కీలకమైన పిలుపునిచ్చారు. “ఇరాన్ సైనికులు వెంటనే ఆయుధాలు వదిలి లొంగిపోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ ప్రజలారా, మీ స్వేచ్ఛకు సమయం వచ్చింది. ఈ క్రూరమైన పాలన నుంచి విముక్తి పొంది, మీ ప్రభుత్వాన్ని మీరే ఏర్పాటు చేసుకోండి” అని ట్రంప్ పిలుపునిచ్చారు. దీన్నిబట్టి, ఈ దాడి వెనుక కేవలం ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఆ దేశంలో పాలన మార్పును ప్రోత్సహించే ఉద్దేశం కూడా ఉందని అర్థమవుతోంది. మరోవైపు, ఇజ్రాయెల్ తన దేశ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించింది. స్కూళ్లు, ఆఫీసులను మూసివేశారు. ప్రజలందరినీ బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మా పౌరుల భద్రతే మాకు ఫస్ట్ ప్రియారిటీ అని, ఇరాన్ నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు.
ఇంత హఠాత్తుగా ఎందుకు యుద్ధం మొదలైంది..? దాడి వెనుక కారణాలు
అసలు ఇంత పెద్ద దాడి జరగడానికి ఇప్పుడే జరగానికి కారణం ఏమిటి అంటే… గత కొన్ని నెలలుగా ఇరాన్ అణు ఒప్పందంపై స్విట్జర్లాండ్, ఒమాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆ చర్చలు విఫలమయ్యాయని, ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని ఆపడానికి ఒప్పుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దాడికి ముందు, అమెరికా అధ్యక్షుడు ఈ చర్చపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మాటలతో ఇరాన్‌ను కట్టడి చేయలేం… ఆ దేశంపై ఎటాక్ చేస్తేనే దారికి వస్తుందని అమెరికా డిసైడ్ అయింది. ఇరాన్ పాలన గత 47 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానాలను, ఈమధ్య కాలంలో దేశంలో చెలరేగిన నిరసనలను క్రూరంగా అణచివేయడంపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఒక shadow war మాత్రమే నడిచింది. అంటే, సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, ప్రాక్సీ గ్రూపులతో పోరాటం చేసేవారు. కానీ ఈ దాడితో, ఆ shadow war ముగిసి, ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఈసారి రెండు పక్షాలు తమ పూర్తి సైనిక శక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?
ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగానే ఆగిపోతుందా, లేక మొత్తం ప్రాంతానికి వ్యాపించి, మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. ఇరాన్ యొక్క “ప్రాంతీయ ప్రతీకార సిద్ధాంతం” ప్రకారం, తమపై దాడి జరిగితే దానికి కారణమైన దేశాలనే కాకుండా, వారికి సాయం చేస్తున్న చుట్టుపక్కల దేశాలపై కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే సౌదీ అరేబియా, UAE, ఖతార్, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ దేశాలు ఇరాన్ టార్గెట్ లిస్టులో ఉన్నాయి. ఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే ఛాన్సుంది. అలా జరిగితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటవచ్చు, ప్రపంచ వాణిజ్యం స్తంభించి, ఆర్థిక మాంద్యం రావచ్చు. ఇప్పటికే బంగారం ధరలు భగ్గుమన్నాయి.
ఈ దాడి అసలు లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే అయినా, ఇది ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ఈ దాడి వల్ల ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడవచ్చు. లేదంటే… దానికి విరుద్ధంగా, ప్రజలలో జాతీయవాదం పెరిగే ఛాన్సుంది. ఒకవేళ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హిజ్బుల్లా, హౌతీలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించితే, ఈ యుద్ధం మిడిలీస్ట్ మొత్తం EXPAND అయ్యే ప్రమాదం ఉంది.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ యుధ్ధం ఒక సాధారణ సైనిక దాడి కాదు. ఇది మిడిలీస్ట్ ఫ్యూచర్ ను శాశ్వతంగా మార్చేయగలదు. ఇజ్రాయెల్-అమెరికా కలిసి ఇరాన్ గుండెకాయపైనే దెబ్బకొట్టాయి. సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షితంగా ఉన్నప్పటికీ, ఆయన అధికారాన్ని సవాల్ చేశాయి. ఇరాన్ తన పూర్తి శక్తితో ప్రతీకారం తీర్చుకుంటోంది, ఈ వార్ ఎక్కడికి దారితీస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. పరిస్థితి నిమిష నిమిషానికి మారుతోంది.
ఈ భీకర దాడిపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ వార్ తర్వాత ఇరాన్లో పాలన మారే అవకాశం ఉందా ? లేక ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టే పెద్ద యుద్ధానికి కారణమవుతుందా? మీ ఆలోచనలను కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఈ అంశంపై మరిన్ని తాజా అప్డేట్స్ కోసం, మా ఛానెల్‌కు సబ్స్క్రయిబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేము మీకు ఎప్పటికప్పుడు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం.
READ ALSO : పెళ్లికి ముందు ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దు! యువతకు Supreme Court క్లాస్