పరోటాలు మైదా పిండితో చేసినవి కాకుండా… ఆరోగ్యానికి పనికొచ్చే Multigrain Paratha లు అయితే ఆరోగ్యానికి చాలా మంచివి. ఉత్తర భారత దేశంలో పరాఠాలను ఎక్కువగా లైక్ చేస్తారు. మల్టీ గ్రెయిన్ పరాటాతో తక్కువ కేలరీలతో ఎక్కువ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
మల్టీ గ్రెయిన్ పరోటాకి ఏం కావాలంటే !
గోధుమపిండి – కప్పు, మొక్కజొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, ఓట్స్ పౌడర్ ఇలా మిల్లెట్ పిండిలు అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర చెంచాల నెయ్యి, – తగినంత నూనె తీసుకోవాలి.
తయారీ విధానం :
వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మొక్కజొన్న, రాగిపిండి, శనగ పిండి, ఓట్స్ పిండి ఇలా అన్నింటినీ వేసుకొని… అందులో నెయ్యి, ఉప్పు వేసి… కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి పిండిని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ మెత్తటి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని… ఒక్కో దాంతో రొట్టె చేసి.. దాని మీద కాస్త నూనె రాసి, మడిచి, మళ్లీ రొట్టె చేసి, ఇంకోసారి నూనె రాసి, మడిచి మరోసారి రొట్టె చేయాలి. ఇన్నిసార్లుగా చేయడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది. రొట్టెలన్నీ అయ్యాక.. రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరాటా తయారవుతుంది. దీన్ని చట్నీ లేదా రైతాలో తింటే సూపర్ గా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్. వేడి వేడిగా ఉన్నప్పుడే వీటిని తినాలి. లేకపోతే తర్వాత గట్టిగా తయారవుతుంది. తినలేరు.