నటి కస్తూరీకి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు…… బీజేపీలో ఉన్న ఈమె సనాతన ధర్మం గొప్పదనం చెబుతూ తెలుగువాళ్ళని చులకన చేసేలా మాట్లాడింది. బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్న డీఎంకేపై విమర్శలు చేద్దామనుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. తీరా వివాదం ముదరడంతో నా మాటలు వక్రీకరించారు… నా పుట్టినిల్లు తమిళనాడు అయితే… మెట్టినిల్లు తెలుగు నేల అంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ తమిళ నటి కస్తూరి అన్నదేంటి ? వివాదం ఎందుకైంది చూద్దాం….
కస్తూరి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రోవర్సీలో ఉంటుంది. జనంలో పేరు తెచ్చుకోడానికో… లేదంటే అసలు ఏం మాట్లాడాలో తెలీక నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుందో గానీ… ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని చూస్తుంది. ఇప్పుడు ఏకంగా తెలుగు జాతి మీదే కామెంట్స్ చేయడంతో అది బెడిసి కొట్టింది.
తమిళనాట రాజుల అంత:పురం మహిళలకు సేవ చేయడానికి తెలుగు వాళ్ళు తమిళనాడుకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు తమిళజాతి మాది అంటున్నారు. అధికారం అనుభవిస్తున్నారు… ఇప్పటి డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు కూడా ఉన్నారు. అంటూ కామెంట్ చేసింది నటి కస్తూరి. ఆమె ఎందుకిలా మాట్లాడింది అంటే… డీఎంకేని, కరుణానిధి ఫ్యామిలీనీ టార్గెట్ చేస్తూ… ఏదేదో మాట్లాడేసింది. అది బూమరాంగ్ అయింది.
కస్తూరీ ఏమన్నది అంటే…
రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికొచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులు మాత్రం తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించింది కస్తూరి. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడవాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారు. సనాతన ధర్మాన్ని (sanathana Dharmam) కూడా డీఎంకే అందుకే వ్యతిరేకిస్తోంది. తెలుగు మాట్లాడితే చాలు… తమిళనాడు ప్రభుత్వ కేబినెట్ లో మంత్రులు అవుతున్నారు. డీఎంకే ఐదుగురు తెలుగు మంత్రులను చేర్చుకుంది.
ఇతరుల ఆస్తులు దొంగిలించవద్దు… ఇతరుల భార్యలపై మోజు పడొద్దు… ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్ళి చేసుకోవద్దు అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే తమిళనాడులో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని కస్తూరి అంటోంది. కస్తూరి కూడా బ్రాహ్మిణ్…. అందుకే తమిళనాడులో బ్రాహ్మణులకు అండగా నిలబడటంలో తప్పులేదు. కానీ మొత్తం తెలుగు జాతిని అవమానించడం ఏంటని మండిపడుతున్నారు నెటిజెన్లు, రాజకీయ నేతలు. తమిళనాడు రాజుల అంత:పుర రాణులకు సేవ చేయడానికి తెలుగు వాళ్ళు వెళ్ళడం ఏంటి… చరిత్ర తెలిసి మాట్లాడుతోందా అసలు…
నా కామెంట్స్ వక్రీకరించారు : కస్తూరి
తమిళ పాలకులకు తెలుగు వాళ్ళు సేవకులు… ఇప్పుడు తమిళనాడుని పాలిస్తున్నారని అని అర్థం వచ్చేలా మాట్లాడింది కస్తూరి. తీరా నెటిజెన్లు, తెలుగువాళ్ళు, తెలుగు రాష్ట్రాల లీడర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చుకుంటోంది. ట్విట్టర్ లో వరుసగా పోస్టులు పెడుతోంది. డీఎంకే నా కామెంట్స్ వక్రీకరించింది… నా మీద నెగిటివిటీని పెంచుతోంది… నా మెట్టినిల్లు తెలుగు, నా ఫ్యామిలీ తెలుగు వాళ్ళు అని తెలియక ఇడియట్స్ ఈ కామెడీ ట్రై చేస్తున్నారు… ఈ హిందూ వ్యతిరేకులంతా సడన్ గా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నాయకులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ట్యాగ్ చేస్తున్నారని డీఎంకే లీడర్లపై మండిపడింది కస్తూరి. కానీ ఏదో అనబోయి… ఏదో అంటూ తరుచుగా వివాదాల్లో ఇరుక్కోవడం నటి కస్తూరికి కామన్ అయింది.