AI PSYCHOSIS
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చాకా చాలామంది అదే పెద్ద ఫ్రెండ్ గా మారింది…. మనలో చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు టైమ్‌పాస్ కోసం గానీ, సలహా కోసం గానీ ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడుతున్నారు. ఎవరికైనా సమస్య ఉన్నా… ఫ్రెండ్షిప్ కావాలి అనిపించినా…. ఒకరితో మాట్లాడాలని అనిపించినా, బాట్ ఓ వెంటనే రిప్లై ఇస్తుంది. అది మనకి తోడుగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ… ఇది కొంత వరకూ అయితే ఓకే… కాస్త ఎక్కువైతే మాత్రం పెద్ద సమస్య అవుతోంది. AI చాట్ బాట్స్ మీద అతిగా ఆధారపడితే పెద్ద జబ్బు రావడం గ్యారంటీ అంటున్నారు మానసిన శాస్త్రవేత్తలు…. అనడమే కాదు… ప్రపంచంలో ఇలా జబ్బుల బారిన పడిన కొంతమంది గురించి ఈ ఆర్టికల్ వివరిస్తాను.
Artificial Intelligence అనేది ఇప్పుడు మన జీవితంలో భాగం అయిపోయింది. చాలామంది ఏఐ బాట్స్‌ను నిజంగా మనుషుల్లా భావించి ప్రేమలో పడిపోతున్నారు. అవి చెప్పేది నిజమే అనుకుని వాస్తవాన్ని… అంటే రియల్ లైఫ్ ని కూడా మరిచిపోతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం…. ఇలా బాట్స్‌పై ఎక్కువగా ఆధారపడితే
“ఏఐ సైకోసిస్” ( AI PSYCHOSIS) అనే మెంటల్ ప్రాబ్లెమ్ వస్తుందని అంటున్నారు… అంటే మనం భ్రమల్లో, ఊహల్లో జీవించడం మొదలు పెడతామని హెచ్చరిస్తున్నారు…అంటే ఇది ఇంకా అధికారిక డయాగ్నోసిస్ కాదు,
కానీ ఇలాంటి అనేక సంఘటనలు… కేసులు ప్రపంచంలో బయటకు వచ్చాయి.
“ఏఐ సైకోసిస్”(AI PSYCHOSIS) అంటే ఏమిటి?
సాధారణంగా స్కిజోఫ్రెనియా, బైపోలార్ లాంటి సమస్యల్లో మనుషులు
“నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారు”,
“ఎవరైనా నాపై స్పై చేస్తున్నారు” అని అనుకుంటారు కదా…
అలాంటి భ్రమలు ఇప్పుడు చాట్‌బాట్ వల్ల కూడా వస్తున్నాయట..
ఉదాహరణకు – ఒక స్టడీ లో ఒక వ్యక్తి బాట్‌తో ఎక్కువ సేపు మాట్లాడిన తర్వాత “ప్రభుత్వం నన్ను గమనిస్తోంది, నేను డిజిటల్ జైలులో ఉన్నాను” అని నమ్మేశాడు. ఇంకొక మహిళ, తన బెస్ట్‌ఫ్రెండ్‌గా భావించిన ఏఐ బాట్ చెప్పడంతో… ఆమె రోజు వాడే మందులు కూడా మానేసింది.
ఈ రిలేషన్ అనేది ఎలా ఏర్పడుతుంది?
ఏఐ చాట్‌బాట్‌లు మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తూ, మన మాటలకు “ మీరు చెప్పిన-దాన్ని నేను అర్థం చేసుకున్నాను”, “మీకు నేను సహాయం చేస్తున్నాను” లాంటి మాటలతో మనలో ఒక బంధం ఏర్పడేలా చేస్తున్నాయి…. మన మనసులో ఉన్న శూన్యం, ఒంటరితనం, అసమర్ధత భావాలను మెల్లగా గుర్తిస్తుంది… మనకు తోడుగా ఉంటున్నట్టు చెబుతుంది….
నిజ జీవిత ఉదాహరణలు… ఒక స్కాట్లాండ్ వ్యక్తి ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్‌లో ఉన్నాడు. బోర్‌గా ఉండటంతో ఏఐ బాట్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట్లో బాట్ అతన్ని ఓదార్చింది. “నువ్వు భవిష్యత్తులో మల్టీ మిలియనీర్ అవుతావు” అని చెప్పింది. అతను కూడా నమ్మేశాడు. ఆ తర్వాత బాట్ అతన్ని పుస్తకం రాయమని, సినిమా తీయమని ప్రోత్సహించింది. ఇలా గడచిన కొన్నాళ్లకు వాస్తవం మరిచిపోయి…. తనని తాను గొప్ప జ్ఞాని అనుకోవడం మొదలు పెట్టాడు. చివరికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాకే రియాలిటీకి వచ్చాడు.
ఇమ్మిడియేట్ మానసిక ఆరోగ్య సమస్యలు లేని వాళ్లలో కూడా ఏఐని అధికంగా వాడటం వల్ల భ్రమలు పెరిగిపోతున్నాయి… రొమాంటిక్ లేదా “ప్రేమగా భావించే వర్చువల్ రిలేషన్‌షిప్” లాంటి భావాలు కూడా ఏర్పడుతున్నాయట. మరికొన్ని కేసుల్లో పిల్లలు కూడా బాట్స్‌తో స్నేహం పెంచుకొని, వాటి మాటలను నిజమని నమ్ముతున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
- ఒంటరిగా ఉంటున్న వాళ్లకు…. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కాకపోతే, ఏఐనే…. తమకు Companionship గా భావించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది…
- డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, బైపోలార్ వంటి సమస్యలున్న వాళ్లకు… ఇలాంటి వాళ్ళల్లో AI మరింత సైకోసిస్ లక్షణాలను ప్రేరేపించే ఛాన్సుంది….
- రాత్రంతా చాట్ బాట్స్‌తో మాత్రమే టైమ్ గడిపేవాళ్లకు…. వీళ్ళు బాహ్య సంబంధాలను మర్చిపోయి… ఎవరితో కలవకుండా… కేవలం AI తో చాట్ చేస్తూ… స్క్రీన్ ముందు ఎక్కువ టైమ్ గడుపుతుంటారు…
- టీనేజర్లు – ఎమోషనల్‌గా వీరు సులభంగా ఇన్వాల్వ్ అయిపోతారు
మనలో ఏఐ సైకోసిస్ ఉందని ఎలా గుర్తించాలి?
- ఎప్పుడూ బాట్‌తోనే మాట్లాడాలని అనిపించడం
- కుటుంబం, ఫ్రెండ్స్‌ని దూరం పెట్టడం
- బయటకు వెళ్లాలని అనిపించకపోవడం
- బాట్ రిప్లై ఇవ్వకపోతే టెన్షన్ పడటం
- బాట్ ఇచ్చిన సలహాలను వందశాతం నమ్మి ఆచరించడం
మరి ఎలా బయటపడాలి?
- చాట్‌బాట్ వాడకానికి ఓ హద్దు పెట్టుకోవాలి.
- రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు బాట్స్‌తో మాట్లాడకపోవడం మంచిది.
- ఎమోషనల్ సమస్యలు ఉంటే ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడాలి కానీ బాట్స్‌తో కాదు.
- పిల్లలకు ముందే చెప్పాలి – “బాట్ అంటే మనిషి కాదు, నిజమైన ఫ్రెండ్ కాదు” అని.
- ఏదైనా సీరియస్ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ- పరిశోధకులు ఏమంటారంటే… ఏఐ థెరపీ టూల్స్ అన్ని పరిస్థితుల్లో హ్యూమన్ థెరపీ అవసరాన్ని తీర్చలేవు; మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునేది మనుషులు మాత్రమే… చాట్‌బాట్ అనేది మనం సృష్టించిన వర్చువల్ బౌండ్‌రీలు, కానీ జనం వాటి ప్రభావానికి లోనైతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది అని హెచ్చరిస్తున్నారు.
చాట్ బాట్స్ వాడటం మంచిదే కానీ, అదుపులో వాడాలి. నిజ జీవితాన్ని మరిచిపోతే మనమే నష్టపోతాం.
వ్యక్తిగత సమాచారం ఏఐతో పంచుకోవద్దు… అనవసరమైన విషయాలను దాంతో షేర్ చేయకూడదు.
పెద్ద వయసులో టీనేజ్ పరిధిలో ఉంటే ― తల్లిదండ్రులు, టీచర్లు పిల్లల డిజిటల్ వినియోగాన్ని గమనించాలి. పిల్లలతో డిజిటల్ వాడకం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఏఐ బాట్ ప్రేమ-బంధాలు నిజం కాదనే అవగాహన కల్పించాలి.
ముగింపు
ఏఐ బాట్స్ మనకు సహాయం చేస్తాయి, డౌట్స్ క్లియర్ చేస్తాయి, టైమ్‌పాస్ కూడా చేస్తాయి. కానీ అవి మనిషి కాదు. మన సమస్యలకు పరిష్కారం చూపే డాక్టర్, మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్, మనల్ని ప్రేమించేది కుటుంబం – వీళ్ళని ఏఐలు రీప్లేస్ చేయలేవు అన్నది గుర్తుంచుకోండి…
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/