వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

Cyber Alerts Latest Posts Top Stories Trending Now

AI Voice Cloning :

A: హలో అన్నయ్యా… నాకు అర్జెంట్ గా పని ఉంది… వెంటనే 20 వేల రూపాయలు పంపు… చాలా అర్జెంట్.

B : ఏంటి అంత అర్జెంట్…

A: అవన్నీ తర్వాత చెబుతా…. చాలా అర్జెంట్ ముందు 20 వేలు పంపు….

ఇలాంటి ఫోన్ … ఓ అన్నకు తమ్ముడి నుంచో… చెల్లి నుంచో… లేదంటే… తండ్రికి కొడుకు లేదా కూతురు… ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ నిజం కాల్స్ కావు. ఫేక్ AI Voice Calls. అచ్చం మన బంధువులులాగే కాల్ చేసి… డబ్బులు అడుగుతూ బురిడీ కొట్టిస్తున్నారు మాయగాళ్ళు.

Cyber crime

AI తో ఏమారుస్తున్నారు !

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఎన్నో అద్భుతాలు జరుగుతాయని సంతోషపడుతున్నాం. కానీ ఇదే AI టెక్నాలజీని మోసాలకు వాడుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. లేటెస్ట్ గా వాయిస్ క్లోనింగ్ తో చీటింగ్ మొదలుపెట్టారు. మనకు తెలిసిన వాళ్ళ గొంతుతో మాట్లాడుతూ మాయ చేస్తున్నారు. ఈ వాయిస్ క్లోనింగ్ తో మన బంధువులు లాగా కాల్ చేసి… కనీసం ఆలోచించుకోడానికి కూడా టైమ్ ఇవ్వకుండా ఏమార్చి డబ్బులు నొక్కేస్తున్నారు. ఇలాంటి వాయిస్ క్లోనింగ్ స్కామ్స్ బారిన పడకుండా అలెర్ట్ గా ఉండాలంటున్నారు సైబర్ భద్రత నిపుణులు, పోలీసులు.
AI టూల్స్ తో రిట్రీవల్ బేస్డ్ వాయిస్ కన్వర్షన్ టెక్నిక్ ని వాడుతూ…. మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ గొంతును తయారు చేస్తున్నారు. ఎమర్జన్సీలో ఉన్నాం… డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తే… తొందరపడి మనీ సెండ్ చేయొద్దుని చెబుతున్నారు.

Fake calls

ఎలా మోసం చేస్తారు ?

ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ గొంతుతో తెలిసిన వాళ్ళలాగా కాల్ చేస్తారు.

అత్యవసరంగా డబ్బులు కావాలని కంగారు పెడతారు.

ఆపదలో ఉన్నాం…. నా ఫోన్ స్విచ్ఛాప్ అయింది. అందుకే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెబుతారు. వెంటనే డబ్బులు పంపాలని కంగారు పెడతారు.
ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వకుండా పదే పదే కాల్స్ చేస్తుంటారు.

మనం నిజంగానే ఆపదలో ఉన్నాడేమో అని డబ్బులు పంపడానికి ఒప్పుకుంటే… అప్పుడు ఎవరికి పంపాలి… ఎంత పంపాలో చెబుతున్నారు.

మన డిటైల్స్ ఎలా తెలుస్తున్నాయి ?

ఈ వాయిస్ క్లోనింగ్ మోసాల్లో ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. Face Book, X, Instagramలో మన వీడియోలు, మనల్ని ఫాలో అవుతున్న వారిని గుర్తించి మోసాలకు దిగుతున్నారు.

మనలాంటి మామూలు వ్యక్తులైతే …. You tube, Tik-Tok, Face Bookలో మనం పెట్టే వీడియోల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరిస్తారు.

Face Book, X, Instagram అకౌంట్స్ లో ఫ్రెండ్స్ లిస్ట్…. మనం పెట్టే ఫొటోలు, వీడియోల నుంచి… మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లు సేకరించి ఈ మోసాలు చేస్తున్నారు.
ఆఫీసుల్లో అయితే ఉన్నతాధికారులు, కొలీగ్స్ వాయిస్ లను క్లోనింగ్ చేస్తున్నారు.

ఎలా తెలుసుకోవాలి ?

వాయిస్ క్లోనింగ్ తో జరుగుతున్న మోసాల్లో ఎక్కువగా ఆ వాయిస్ మనకు తెలిసిన వాళ్ళదే ఉంటోంది. అయితే మనకు వచ్చిన కాల్ మాత్రం వేరే ఫోన్ నంబర్ నుంచి వస్తోంది. అంటే మోసం జరుగుతుందన్నది మీరు గ్రహించాలి.  మనల్ని కంగారు పెడుతూ డబ్బులు అడుగుతున్నారంటే.. అసలు అవతలి వ్యక్తి గొంతు ఎలా ఉందో జాగ్రత్తగా గమనించాలి.   వాళ్ళు ఎంత కంగారు పెట్టినా… మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి డబ్బులు పంపవద్దు. మీకు ఎవరి పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నారో…. వాళ్ళ personal number కి కాల్ చేయండి. అప్పుడే ఈ కేటగాళ్ళ బండారం బయటపడుతుంది. లేదంటే ఆ వ్యక్తి భార్య/భర్త లేదా, అన్నదమ్ములు, పిల్లలకు కాల్ చేసి అసలు సంగతి తెలుసుకోండి.  అవతలి వ్యక్తి నుంచి పదే పదే కాల్ చేస్తుంటే అనుమానించండి. తప్పకుండా అది సైబర్ క్రిమినల్స్ పనే అని గ్రహించండి.

Fake calls

కొత్త నంబర్ల నుంచి ఫోన్లు ఎత్తవద్దు. మనకు తెలియని మొబైల్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. ఫోన్ నంబర్ ఇండియాది కాకుండా… Foreign Country Codes నుంచి కాల్స్ వస్తే అప్రమత్తం అవ్వండి. True Caller, Google apps లాంటివి వాడితే… ఆ కాల్ ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుందో మనకి కనిపిస్తుంది.

ప్రతి ఫోన్ కాల్ కి ఆ వ్యక్తి పేరు కనిపించేలా చర్యలు తీసుకోవాలి ఈమధ్యే TRAI మొబైల్ ఆపరేటర్స్ ను ఆదేశించింది. అది కూడా అమల్లోకి వస్తే… అవతలి వ్యక్తి ఎవరు అన్నది ఈజీగా తెలిసిపోతుంది.

మీరు మోసపోతే వెంటనే Sanchar Saathi యాప్ లో గానీ… 1930 నెంబర్ ద్వారా Cyber Crime కి గానీ కంప్లయింట్ చేయండి.

Be Alert on Voice Cloning ….

ఇది కూడా చదవండి : జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !

ఇది కూడా చదవండి : ఒబెసిటీతో గజినీలు అవుతారు !

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged

Leave a Reply