ఆ 30 సెకన్లలో ఏం జరిగింది ?

Latest Posts Top Stories

Air India Plane Accident Exclusive details

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం కేవలం 30 సెకన్లలోనే కుప్పకూలంది. టేకాఫ్ అయిన వెంటనే మళ్ళీ భూమ్మీదకు వస్తూ కూలిపోయింది… ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది విచారణ తర్వాతే తేలుతుంది. ఇప్పటికే ఆ ఫ్లయిట్ నుంచి బ్లాక్ బాక్స్, DVR లాంటి కీలక పరికరాలు దొరికాయి… సో DGCA దర్యాప్తులో యాక్సిడెంట్ కి కారణాలు బయటపడే ఛాన్సుంది.
ఏ విమానం అయినా టేకాఫ్ అయ్యాక కొద్ది క్షణాలు అనేవి చాలా కీలకం. ఈ టైమ్ లో ప్రమాదం జరిగితే … దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విషయం. ప్రస్తుతం భారత నిపుణులు అమెరికా, బ్రిటన్ ఎక్స్ పర్ట్స్ కలిసి బోయింగ్ 787 డ్రీమ్ లైన్ విమానం ప్రమాదానికి కారణాలపై రాబోయే రోజుల్లో దర్యాప్తు చేయబోతున్నారు.

2011లో కమర్షియల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టిన తర్వాత 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానానికి ఇంత తీవ్ర ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 241మంది చనిపోయారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోవడానికి కారణాలేంటి అనేదానిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

ఎత్తులోకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ విమానం

ప్రమాదానికి గురైన 787-8 డ్రీమ్‌లైనర్‌ను కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్‌ నడుపుతున్నారు. వీళ్ళకి ఫ్లయిట్ నడపడంలో చాలా అనుభవం ఉంది. ఇద్దరూ కలిసి 9,000 గంటలపాటు విమానం నడిపారు. కమర్షియల్ ఎయిర్‌లైన్ పైలట్‌గా సభర్వాల్‌కు 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
విమానం బయలుదేరేటప్పుడు వంద టన్నుల ఇంధనం అందులో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విమానం సామర్థ్యానికి తగ్గట్టుగా అందులో ఇంధనం ఉంది. టేకాఫ్ అయిన వెంటనే కాక్‌పిట్ నుంచి మేడే కాల్ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి స్పందనా లేదని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది. మేడే కాల్ తర్వాత ఏం జరిగిందనేది తెలియడం లేదు. అయితే ఎయిర్ పోర్టులోని సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు కొందరు స్థానికులు మొబైల్స్ లో షూట్ చేసిన విజువల్స్ చూస్తే… విమానం ఎత్తులోకి వెళ్లేందుకు ఇబ్బందిపడినట్టు అర్థమవుతోంది. పక్కనే ఉన్న నివాసిత ప్రాంతాల మీదగా విమానం తక్కువ ఎత్తులో ఎగురింది. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరిన తరువాత… వెంటనే కిందకు దిగుతూ చెట్లు, భవనాలను ఢీకొట్టి పేలిపోయింది. ఎయిర్ పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే విమానం 30 సెకండ్లపాటు గాలిలో ఉన్నట్టు చూపిస్తోంది. అంటే ఘోరమంతా 30 సెకన్లలోనే జరిగింది.

విమాన ప్రమాదానికి కారణాల్లో

మొదటిది వాదన : రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయా ?

సీసీ ఫుటేజ్ పరిశీలించి… విమాన ప్రమాదానికి కారణం ఇది అని చెప్పడం కష్టం. కానీ కొన్ని కారణాలను ఊహించవచ్చు. ఫ్లయిట్ కి ఒత్తిడి లేదా పవర్ అందకపోవడం వల్ల పైకి ఎగరడానికి ఇబ్బంది పడినట్టు వీడియోల్లో స్ఫష్టంగా అర్థమవుతుంది. ‘రెండు ఇంజిన్లు ఫెయిల్ తో ప్రమాదం జరగడం అనేది చాలా రేర్ అంటున్నారు కొందరు నిపుణులు. మెయిన్ ఇంజిన్ ఫెయిల్ అయితే, అత్యవసర సమయంలో విమానం నడిచేందుకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయగల రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) ఈ విమానంలో ఉందా… లేదా అన్నది తెలియాల్సి ఉంది.
గతంలో అంటే 2009లో రెండు ఇంజిన్లు ఫెయిల్ అయిన యూఎస్ ఎయిర్‌వేస్ ఎయిర్ బస్ ఏ320ని పైలట్లు సేఫ్ గా కిందకు దించారు.
న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకు పక్షులు ఢీకొట్టి, రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. అయితే ఇంధనంలో ప్రాబ్లెమ్స్ వల్ల కూడా రెండు ఇంజన్లు ఫెయిల్ అవుతుంటాయి. అయితే విమానం ఇంజిన్లకు ప్రత్యేకమైన ఇంధనం సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ బ్లాకయిపోతే, ఇంధనం అందదు. ఇంజిన్ ఆగిపోతుంది. కానీ ఎయిరిండియా విమానానికి అలాంటి పరిస్థితులు ఏవీ లేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

రెండో వాదన : పక్షులు ఢీకొట్టాయా?

విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం ఒక కారణమని నిపుణులు అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఇంజిన్లలో పక్షి చిక్కుకుపోతే వాటికి పవర్ అందదు. గత ఏడాది దక్షిణ కొరియా జెజు ఎయిర్ విమానం పక్షి వల్లే కూలిపోయింది. అయితే అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా పక్షులు ఉంటాయని మాజీ పైలట్లు చెబుతున్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత ఐదేళ్ల కాలంలో పక్షి ఢీకొన్న సంఘటనలు 462 దాకా జరిగాయి. వీటిల్లో ఎక్కువ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గరే జరిగాయి. 2009లో అయితే ఎయిర్ ఇండియా విమానం కన్నా 4 రెట్లకు పైగా ఎక్కువ ఎత్తులో అంటే దాదాపు 2,700 అడుగుల హైట్ లో సీగల్స్ పక్షుల గుంపు ఎదురుపడింది. ఆ సమయంలో భారత పైలట్లకు విమానాన్ని మరింత ఎక్కువ ఎత్తులోకి తీసుకెళ్లడానికి లేదా కిందకు దించడానికి అవకాశం ఉండదు. అయితే పక్షులు ఢీకొట్టినప్పుడు 2 ఇంజిన్లపై ప్రభావం పడితే తప్ప ప్రమాదం జరిగే అవకాశం తక్కువే అంటున్నారు నిపుణులు.

మూడో వాదన…. వింగ్ ఫ్లాప్‌ల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందా?

టేకాఫ్ అయ్యేటప్పుడు… విమానం ఫ్లాప్‌లు విచ్చుకోకపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. టేకాఫ్ సమయంలో ఫ్లాప్‌లది కీలక పాత్ర. తక్కువ స్పీడ్ లో కూడా విమానం పూర్తిగా పైకి ఎగిరేందుకు ఇవి హెల్ప్ అవుతాయి. అవి సరిగ్గా విచ్చుకోకపోతే, ప్రయాణికులు, ఇంధనంతో భారీగా ఉండే విమానాలు వేడిగా ఉండే వాతావరణం మధ్య పైకి ఎగరడానికి ఇబ్బంది పడే అవకాశముంది. అహ్మదాబాద్‌లో గురువారం నాడు దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంది. గాలి తక్కువగా ఉంది. అందువల్ల ఫ్లాప్‌లు బాగా విచ్చుకుంటాయి… ఇంజన్ బలంగా పని చేసే ఉంటుందని పైలెట్లు చెబుతున్నారు. ఇకవేళ ఫ్లాప్‌లు విచ్చుకోకుండా టేకాఫ్ అయి ఉంటే… విమాన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ 787 టేకాఫ్ కన్ఫిగరేషన్ వార్నింగ్ సిస్టమ్ నుంచి హెచ్చరికలు వచ్చే అవకాశముంటుంది. కానీ నిజంగా ఫ్లాప్‌లు సరిగ్గా విచ్చుకున్నాయా లేదా అన్నది చెప్పలేకపోతున్నారు.

Read also : 3 గంట‌ల పాటు గాల్లోనే చ‌క్క‌ర్లు.. త‌ప్పిన మరో ముప్పు

Read also : మంగ్లీ మీద ఎందుకంత కోపం !

Tagged