తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన అమరన్ (Amaran) చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. 2014లో కశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొందారు వరదరాజన్. భారతదేశపు అత్యున్నత అవార్డు అశోక చక్రతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. అలాంటి నిజ జీవిత కథతో వచ్చిన ఈ సినిమాలో హీరో శివ కార్తీయన్ కంటే సాయి పల్లవి నటన అద్ఢుతంగా ఉందని అంటున్నారు.
హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో తీసిన సినిమా అమరన్. చెన్నైకు చెందిన ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి)తో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ ముకుంద్ ఆర్మీలో చేరటాన్ని వర్గీస్ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. సైన్యంలో పనిచేసే వ్యక్తికి తమ అమ్మాయిని ఇవ్వబోమని చెబుతారు. పైగా మతాలు కూడా వేరు కావడంతో వారి పెళ్లికి బ్రేకులు పడతాయి. ముకుంద్ తల్లి కూడా ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పిస్తాడు. ఆర్మీలో చేరి మంచి పొజిషన్ కు ఎదుగుతాడు ముకుంద్. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులపై ప్రాణాలకు తెగించి పోరాతాడు. జమ్ము కశ్మీర్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తాడు. అక్కడే వీర మరణం పొందుతాడు.
కుల మతాలను వేరు కావడంతో ముకుంద్, ఇందుకు ఎలా పెళ్ళయింది. ఇందు తల్లిదండ్రులను ఎలా ఒప్పిస్తాడు. జమ్ములో మిలిటెంట్లకు ఎలా చెక్ పెడతాడు. అన్నది సినిమా కథాంశం. ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పాయింటాఫ్ వ్యూలో నడిచే మూవీ ఇది. ఏడు నెలల కూతురుతో ముకుంద్ ఎమోషన్ జర్నీతో పాటు హీరోయిన్ ని ఎలివేట్ చేస్తూ తీసిని సినిమా ఇది. ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలటరీ హీరోస్ అనే పుస్తకం ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ ఈ అమరన్ మూవీని తీశారు. ఈ మూవీ కోసం ముకుంద్ వరదరాజన్ తో పాటు జవాన్ల జీవితంపై ఆయన చేసిన రీసెర్చ్ సినిమాను అద్భుతంగా నడిపించింది. సినిమాలో సెంటిమెంట్ ఉద్వేగాన్ని కలిగిస్తే, సైనికుడిగా శివ కార్తికేయన్ ఆవేశం, ఆవేదన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఆర్మీ సాహసాలు, దేశానికి వాళ్ళ చేస్తున్న సేవలను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడు.
దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమాలు హిట్ అయినవి… వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రోజా మూవీ తరువాత పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు. అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాలు తప్ప. అయినా ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని దర్శకుడు రాజ్ కుమార్ ఎంతో సాహసంగా అద్భుతంగా చిత్రీకరించాడు.
సాయిపల్లవి సినిమాకి ఎసెట్
సినిమాల్లో సాయి పల్లవి నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్ సీన్లతో పాటు, రొమాంటిక్ సీన్లలోనూ అద్భుతంగా నటించింది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో, ఎమోషన్ పండించడంలో పల్లవి మరోసారి తన నటనను ప్రదర్శించింది. ఇది పూర్తిగా సాయి పల్లవి చిత్రమనే చెప్పాలి. తెరపై శివకార్తికేయన్ సీన్స్ ఎక్కువ కనిపించినా, క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కింది. తన నటనతో రెబెక్కా వర్గీస్ పాత్రలో జీవించింది. ఈ రోల్ కి సాయి పల్లవి మాత్రమే న్యాయం చేయగలదు… ఆమె తప్ప మరెవరూ నటించలేరు అనేంతగా నటన కనిపించింది.
ఇన్నాళ్ళూ కామెడీ సినిమాల్లో మాత్రమే ఎక్కువగా నటించిన శివ కార్తికేయన్… ఇప్పుడు తనలోని మరో కొత్త నటుడిని పరిచయం చేశాడు. ఎమోషనల్ కంటెంట్ తో మాత్రమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్ కూడా అమరన్ మూవీలో ఉంది. థియేటర్లో సినిమా చూసినంత సేపూ ప్రేక్షకులు దేశభక్తితో రగిలిపోతుంటారు. అలాగే జమ్ము కశ్మీర్ ని ఇప్పటిదాకా ఎవరూ చూపించని విధంగా కొత్తగా ప్రజెంట్ చేసినట్టు అర్థమవుతోంది. టెక్నకిల్ వర్క్, ఎడిటింగ్ సూపర్భ్. సినిమాను రియల్ లొకేషన్స్ లో తీయడంతో నిండుదనం వచ్చింది. ఫ్యామిలీతో కలసి చూడాల్సిన మూవీ. అందరికీ నచ్చుతుందని సినిమా క్రిటిక్స్ కూడా అంటున్నారు.