ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం తప్పించబోతున్నట్టు తెలిసింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత పదేళ్ళుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. దాంతో వైఎస్సార్ కూతురుగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ ను నిలబెడతారని ఏఐసీసీ భావించింది. 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ నో యూజ్ అని తేలిపోయింది. పైగా ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైనా షర్మిల ఆశించిన స్థాయిలో పోరాడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నేతలకు ఏర్పడింది. మాజీ సీఎం, తన అన్న జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణులకు ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా… షర్మిల ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడంపైనా పెద్ద సంఖ్యలో ఢిల్లీ అధిష్తానానికి కంప్లయింట్స్ వెళ్తున్నాయి. దీంతో.. షర్మిలను తప్పించి మరో మహిళా లీడర్ కు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారనే టాక్ ఏపీలో నడుస్తోంది.
జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే 2024 ఎన్నికలను షర్మిల ఉపయోగించుకున్నారు. కానీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని విజయవాడకు చెందిన కొందరు నేతలు ఈమధ్యే రాహుల్ గాంధీ ఆఫీసులో కంప్లయింట్ చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్లను సమన్వయం చేయడంలోనూ షర్మిల విఫలమయ్యారన్న విమర్శ ఉంది. సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం, ఛాలెంజ్ లు విసరడం తప్ప పార్టీని బతికించడానికి ఓ ప్లాన్ లేకుండా షర్మిల నిచేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై పైపైనే విమర్శలు చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని లీడర్లు ఆందోళనగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైతే షర్మిల విధానాలపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం ఏఐసీసీ పెద్దలకు చేరడంతో, షర్మిలను పక్కనబెట్టి వేరే వాళ్ళకి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
కిల్లి కృపారాణికి ఛాన్స్ ?
ఏపీ పీసీసీ చీఫ్ గా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది. ఢిల్లీలో కొన్ని రోజుల క్రితం ఆమె రాహుల్, ఖర్గేను కలిసి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె డాక్టర్. 2009లో ఎంపీగా గెలిచిన ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిపదవి దక్కింది. ఇప్పుడు పీసీసీ కొత్త చీఫ్ గా అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే రష్మిలకు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఇస్తారని చెబుతున్నారు.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : క్రియాటిన్ స్థాయులు పెరిగితే ఏం తినాలి?
Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE
Read also : పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత