ENGLISH VERSION : CLICK HERE
ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం కొందరకు ఫ్యాషన్ అయింది. మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు, ఆయన భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారన్న సోయి లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్న సందర్భంలో కూడా ఇలాంటి విమర్శలు వినిపించాయి. ఈ సమ్మిట్ టియాంజిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగింది, ఇది మోడీ చైనాకు 7 సంవత్సరాల తర్వాత చేసిన మొదటి పర్యటన. ఈ పర్యటన భారత్‌కు అత్యంత కీలకమైంది, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో. మిత్రపక్షంగా ఇంతకాలం నమ్మిన అమెరికా వ్యక్తిగత ఈగోలతో భారత్‌ను నట్టేట ముంచుతున్న సమయంలో, ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారింది.
ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన భారత్ వణికిపోదని, కానీ అమెరికాను వణికించే ఫార్ములాను తాము సిద్ధం చేసుకున్నామని సంకేతాలు పంపారు. సమ్మిట్‌లో మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. అలాగే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా సమావేశమై, ఉక్రెయిన్ సంఘర్షణపై శాంతియుత పరిష్కారాన్ని ప్రోత్సహించారు. అయితే, అనూహ్యంగా దేశంలో కొంతమంది ప్రధానిపై ఉన్న వ్యతిరేకతతో భారత్‌ను అవమానిస్తున్నారు.
ప్రధాని మోడీ ఏం చేసినా తప్పు పట్టడమేనా?
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దగ్గర మోడీ బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని కొంతమంది విమర్శలు ప్రారంభించారు. నిజానికి, అక్కడ ఉన్నది భారత ప్రధాని మోడీ. వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ కాదు. వ్యక్తిగత పర్యటనలో ఆయన ఏం చేసినా పరువు తీసుకున్నారని విమర్శలు చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆయన భారత ప్రధానిగా దేశ గౌరవాన్ని తీసుకెళ్లారు. ఎలా గౌరవం కాపాడాలో ఆయనకు తెలుసు. సమ్మిట్‌లో మోడీ, జీ, పుతిన్ మధ్య వైరల్ అయిన ఫోటోలు బలమైన సంబంధాలను సూచిస్తున్నాయి, అయితే కొందరు దాన్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతీ దాన్ని బూతద్ధంలో చూపిస్తూ… బాడీ లాంగ్వేజ్ పేరుతో దేశాన్ని కించపరిచే పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు. అయితే, బాడీ లాంగ్వేజ్ విశ్లేషణలు మోడీ ఆత్మవిశ్వాసాన్ని, నిగ్రహాన్ని సూచిస్తున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.
రాజకీయంగా మోడీని వ్యతిరేకించవచ్చు కానీ…
దేశంలో ఉన్న ప్రజలంతా ప్రధాని మోడీని బలపరచాలని ఏమీ లేదు. ఆయనను బలంగా వ్యతిరేకించవచ్చు. విధానాలను ప్రశ్నించవచ్చు. కానీ ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఈ గుడ్డి వ్యతిరేకతను చూపించకూడదు. ఆయన భారత గౌరవం. చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్‌లో భారత్‌కు మిగతా అన్ని దేశాల నుంచి ప్రాధాన్యత లభించింది. పుతిన్, చైనా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నించారు. భారత్ కూడా అంతే. చైనా, రష్యాలు అమెరికా మిత్రుల్ని దూరం చేయడానికి ఏమైనా చేస్తాయి. ఇప్పుడు భారత్‌కు అందుకే గౌరవం పెంచుతున్నాయి. దానికి తగ్గట్లుగా దేశ వ్యూహాలు కూడా ఉంటాయి. టియాంజిన్ డిక్లరేషన్‌లో ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గామ్ దాడిని ప్రస్తావించడం భారత్ విజయమే. ఈ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టి మోడీని అవమానించాలని అనుకోవడం దేశాన్ని అవమానించడమే. విపక్షాలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి కొన్ని నివేదికలు.
నేషన్ ఫస్ట్…
మన దేశంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య సైద్ధాంతిక విబేధాలు సహజం. అయితే ఈ విబేధాలు దేశాన్ని వ్యతిరేకించే వరకూ వెళ్లకూడదు. రాహుల్ గాంధీ గతంలో విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడ భారత ప్రజాస్వామ్యం గురించి చులకనగా మాట్లాడేవారు. ఇండియాలో ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇలా బయట దేశాల ముందు భారత్ పై వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశంపైనే చెడు ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారన్న భావన తీసుకువచ్చారు. ఇది ఆయనకు చెడ్డపేరు తెచ్చింది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తున్నారు. రాజకీయాలకు దేశ ఇమేజ్, ప్రయోజనాలకు ముడిపెట్టకూడదని ఈ రాజకీయ నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో? ఈ సమ్మిట్‌లో మోడీ భారత్‌ను బలమైన స్థానంలో నిలబెట్టారు, ఇది దేశ ప్రయోజనాలకు అనుకూలమైంది.
సీబీఐకి ఇస్తే.. ఏమైతది?: బీఆర్ ఎస్ లో చర్చ
READ ALSO : బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ – క్లైమాక్స్ ఎప్పుడు ?



