జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?

ET World Latest Posts Top Stories

జైలర్-2 సినిమాపై రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. మొదటి పార్టులో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెండో భాగంలోనూ ఉండనున్నారు.

Balakrishna roped in for a crucial role in Rajinikanth-Nelson Dilipkumar's Jailer 2; everything we know - Hindustan Times

తాజాగా సమాచారం ప్రకారం, నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘లక్ష్మీ నరసింహా’ వంటి చిత్రాల్లో చూపిన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రల తరహాలోనే, ఈ సినిమాలోనూ బాలయ్య అటువంటి పాత్రలో సందడి చేయనున్నారు. అంతేకాక, ఫ్లాష్‌బ్యాక్‌లో రజినీకాంత్ – బాలకృష్ణల మధ్య కొన్ని మాస్ యాక్షన్ సీన్లు కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Balakrishna in Jailer 2? - TrackTollywood

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమా ప్రత్యేకంగా కలుపుకోనుందని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్లు రానున్నాయి. రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్‌ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

 

Read This Also : “ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?” రాజమౌళి సమాధానం ఏమిటి?

Read This Also : సరస్వతీ పుష్కరాల మహిమ తెలుసుకోండి!

Read This Also : అమెజాన్ ప్రైమ్ వీడియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్

Tagged