Rs.500, Rs.100 నకిలీ నోట్లు ఇలా గుర్తించండి – మీ డబ్బును రక్షించుకోండి!
నకిలీ రూ.500, రూ.100 నోట్లు (Fake Currenncy Notes) గుర్తించే టిప్స్, వాటర్‌మార్క్, మెరిసే గీత, కాగితం రకం ఆధారంగా గుర్తించండి.
నకిలీ కరెన్సీ నోట్లు 2025: మార్కెట్లో పెరుగుతున్న మోసాలను ఎలా గుర్తించాలి?
ఈ రోజుల్లో ప్రతి రూపాయి విలువైనదే. డబ్బులు ఊరికే రావు. కానీ మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.17 లక్షల నకిలీ నోట్లు RBI గుర్తించింది. వీటిలో రూ.500 డినామినేషన్ నోట్లు 1.17 లక్షలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
నిజమైన నోటు, నకిలీ నోటు మధ్య తేడా తెలుసుకోవడం ఇప్పుడు అత్యవసరం. పెరిగిన నకిలీ నోట్లు (Fake Currency Notes), మెరిసే గీతలు, వాటర్‌మార్క్‌లు (Water Marks), కాటన్ పేపర్ రకం వంటి అంశాల ఆధారంగా మనం నకిలీ నోట్లను గుర్తించవచ్చు.
నకిలీ నోట్లు (Fake Notes ) ఎలా చలామణి అవుతున్నాయి?
- ATMల ద్వారా నకిలీ నోట్లు రావు.
- ఇవి సాధారణంగా చిన్న వ్యాపారులు, Shopsల నుంచి Change రూపంలో వస్తాయి.
- 90 గ్రాముల లినెన్ కాటన్ పేపర్ తో తయారు చేసిన నకిలీ నోట్లు, ఒక్కో నోటుకు ₹2–₹3 ఖర్చుతో తయారవుతున్నాయి.
- 98% కాటన్‌తో తయారయ్యే అసలైన నోట్లతో పోలిస్తే, నకిలీ నోట్ల (Fake currency Notes) Quality తక్కువగా ఉంటుంది.

నకిలీ నోట్లు (Fake Notes) గుర్తించే ముఖ్యమైన లక్షణాలు
- మెరిసే గీత (Security Thread)
ఇప్పటివరకు నకిలీ నోట్లలో మెరిసే గీత ఉండేది కాదు. కానీ ఇప్పుడు నకిలీ నోట్లలో కూడా గీతను ముద్రిస్తున్నారు, దాంతో ఏది Real Currency Note, ఏది Fake Note అన్నది గుర్తు పట్టడం కష్టమవుతోంది. - వాటర్‌మార్క్ (Water Mark)
ప్రతి నోటులో గాంధీ చిత్రం, నోటు విలువ (₹500 లేదా ₹100) వాటర్‌మార్క్‌గా వెలుగులో కనిపించాలి. ఇది నకిలీ నోట్లలో ముద్రించడం చాలా కష్టం. - కాగితం నాణ్యత (Paper Quality)
నిజమైన నోట్లు 98% కాటన్ తో తయారవుతాయి. నకిలీ నోట్లు లినెన్ కాటన్ మిశ్రమంతో తయారవుతాయి, ఇది తక్కువ నాణ్యత కలిగినది. - ముద్రణ స్పష్టత (Print Quality)
నిజమైన నోట్లపై అక్షరాలు, రంగులు, డిజైన్ స్పష్టంగా ఉంటాయి. నకిలీ నోట్లలో ఇవి కొద్దిగా మసకబారినట్లు కనిపిస్తాయి. - డిజిటల్ చెల్లింపులు (Digital Payments)
నకిలీ నోట్లు తీసుకోవడం నివారించాలంటే Bharat UPI, PhonePe, PayTM, Google Pay వంటి డిజిటల్ చెల్లింపులు ఉపయోగించడం ఉత్తమం.
Read also : OG Box Office Collection: పవన్ కళ్యాణ్ మూవీ ₹193 Crores (Click here for know more)
❓FAQs: నకిలీ నోట్లు ఎలా గుర్తించాలి?
- నకిలీ నోటులో వాటర్‌మార్క్ ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలి?
వెలుగులో నోటును పట్టుకుని గాంధీ pic, నోటు విలువ చూడండి. - మెరిసే గీత నకిలీ నోటులో ఉంటుందా?
కొన్ని నకిలీ నోట్లలో Theread (గీత)ను ముద్రిస్తున్నారు, కానీ అది అసలైన దానిలా ఉండదు. - నకిలీ నోట్లు ATMల ద్వారా వస్తాయా?
లేదు. బ్యాంకులు నకిలీ నోట్లు ATMలో పెట్టవు. చిన్న చిన్న షాపుల దగ్గర మీరు ఏవైనా కొనుగోలు చేసి చిల్లర తీసుకునేటప్పుడు ఇవి exchange అవుతున్నాయి. - నకిలీ నోటు తీసుకున్నప్పుడు ఏమి చేయాలి?
బ్యాంక్‌కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానిని తిరిగి చలామణి చేయవద్దు. - నకిలీ నోట్లు నివారించడానికి ఏ మార్గం ఉత్తమం?
డిజిటల్ చెల్లింపులు (UPI, Google Pay) ఉపయోగించండి.
🔗 External Reference
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/