మాఘ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో చేసే పవిత్ర స్నానాలు, పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆ రోజున భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంతర్వేది ఏకాదశి అని పిలుస్తారు.
ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి
ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచారుని ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అందుకే అది భీష్మాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుధ్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని పిలుస్తారు.
కురుక్షేత్ర యుద్దంలో తీవ్రంగా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు… ధర్మరాజు విష్ణు సహస్రనామాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత స్వచ్ఛంద మరణంతో విష్ణువును చేరతాడు భీష్మ పితామహుడు. ఆయన భక్తిని మెచ్చుకున్న కృష్ణ భగవానుడు… అష్టమి నుంచి ద్వాదశి వరకూ గల రోజులను భీష్మ పంచకంగా ప్రసిద్ధి పొందుతాయని చెబుతాడు. అంతే కాదు… భీష్ముడు పరమపదించిన తర్వాత వచ్చే ఏకాదశని భీష్మ ఏకాదశిగా … ఎంతో పవిత్రమైన రోజుగా చెబతాడు. ఆ రోజు ఎలాంటి కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయం అవుతుందని నమ్ముతారు. ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ పారాయణం చాలా మంచిది. అనేక శుభాలు కలుగుతాయి. ఈ భీష్మ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ లోకాన్ని చేరుకుంటారని భక్తులు నమ్ముతారు.
ఆ రోజు ఏం చేయాలి ?
భీష్మ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. స్నానం చేసి. పసుపు రంగు బట్టలు వేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు పాటించాల్సి ఉంటుంది.
ఇక పూజ ఎలా అంటే ?
విష్ణుమూర్తి లేదా ఆయన అవతారానికి సంబంధించిన పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసీ దళాలతో అలంకరణ చేయాలి. తర్వాత విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. ఇవన్నీ చేయడానికి శక్తి లేనివారు… కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని అయినా సరే… 108 సార్లు జపించాలి. తర్వాత ఆవు నేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం. సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసి లాంటి పూజలు నిర్వహింస్తుంటారు. వీటికి హాజరవడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
భీష్మ ఏకాదశి రోజు ఇవి నిషేధం
🙏 మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు లాంటివి తినరాదు.
🙏 రోజంతా ఉపవాసం పాటిస్తే మంచిది
🙏 ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.
🙏 ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు… చీమలు, పురుగులు లాంటివి చనిపోయే అవకాశం ఉంటుంది.
🙏 తెల్లవారు జామునే నిద్ర లేవాలి… మధ్యాహ్నం నిద్ర పోవద్దు.
🙏 ఉపవాసం ఉండే వారు… రోజంతా శ్రీమహా విష్ణువు గురించి కీర్తనలు చేస్తూ…. రాత్రంతా
జాగారం చేయాలి.
🙏 భీష్మ ఏకాదశి రోజున… విష్ణు సహస్రనామాలు భగవద్గీతమ పఠించడం మంచిది.
🙏పేద వాళ్ళకీ… ఆకలి అయ్యే వారికి అన్నం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read this also : క్యాన్సర్ కీ ఇన్సూరెన్స్ పాలసీ
Read this also : అమ్మాయిలూ… మృగాళ్ళున్నారు జాగ్రత్త !