* పార్టీని నమ్ముకున్న వారికే ప్రియారిటీ
* ఆర్ఎస్ఎస్ సూచించిన వ్యక్తికే పదవి
* బీసీలకు బీజేపీ అధిష్టానం మొండిచెయ్యి
* పదవి కోసం పోటీపడ్డ ఐదుగురు బీసీ లీడర్లు
* ఈటల రాజేందర్ పై నో ఇంట్రెస్ట్
(యువ తెలంగాణ, హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నిక కాబోతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దాంతో మంగళవారం నాడు రామచందర్ రావును అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఈ పదవి కోసం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ వేద్దామనుకున్నారు. కానీ ఆయనకు పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యుల నుంచి మద్దతు రాలేదు. దాంతో రాజాసింగ్ బీజేపీకి రిజైన్ చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈసారి బీసీ నేతలకు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకే అధికారం దక్కాలన్న నినాదం నడుస్తోంది. దాంతో ఐదుగురు బీసీ నేతలు ఈ పదవి కోసం పోటీ పడ్డారు.
వీళ్ళల్లో ఈటల రాజేందర్ పేరు రేసులో మొదట వినపడగా, కె.లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, పాయల్ శంకర్ పేర్లు వినిపించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే బండి సంజయ్ లేదంటే ఈటలను నియమిస్తారని టాక్ బాగా నడిచింది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు అర్థంతరంగా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించడంపై బీసీల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం పార్టీ విధేయతకు ప్రియారిటీ ఇచ్చింది. దానికి తోడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశీస్సులు కూడా ఉన్నందున నారపరాజు రామచందర్ రావు ఒక్కరే నామినేషన్ వేశారు. బీజేపీ ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. దాంతో రామచందర్ రావు ఏకగ్రీవంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారు.
Also read: బీజీపీ అధ్యక్షుడి ఎంపికలో నారా చక్రం
Also read: షెఫాలీ మృతికి ఆ మందులే కారణం
Also read: హరిహర వీరమల్లు కొత్త పోస్టర్