క్యాన్సర్ కీ ఇన్సూరెన్స్ పాలసీ

Healthy Life Insurance Latest Posts Trending Now

Cancer Insurance Policy : క్యాన్సర్… అంటే చాలా మందికి భయం. మధ్యతరగతి వర్గాల్లో అయితే పెద్ద అలజడి. ఇది హెల్త్ ప్రాబ్లెమ్ మాత్రమే కాదు… ఆర్థికంగా కూడా పెద్ద సమస్య. ఒక్కసారి ఎటాక్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కుటుంబ బడ్జెట్ మొత్తం తలకిందులవుతుంది. ప్రతి యేటా 12 నుంచి 14 లక్షల మంది దాకా మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాంతో ఇప్పుడు క్యాన్సర్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సూరెన్స్ పాలసీల అవసరం పెరుగుతోంది.

Cancer

క్యాన్సర్ తో ఫ్యామిలీ తలకిందులు

కుటుంబంలో ఓ వ్యక్తికి క్యాన్సర్ సోకిందంటే చికిత్సకు లక్షల రూపాయలు కావాల్సిందే. స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అయితే 10 లక్షల నుంచి 50, 60 లక్షల దాకా ఖర్చవుతున్నాయి. కీమోథెరపీతో పాటు… మోడర్న్ సర్జరీలు, ఇమ్యూనోథెరపీ.. టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ ఇలా ఎన్నో రకాల చికిత్సలు జరుగుతాయి. ట్రీట్మెంట్ పూర్తయ్యాక కూడా చాలా కాలం పాటు మెడిసన్స్ వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని తలకిందులు చేస్తాయి. అందుకే… Health Insuranceతోపాటు… Cancer Treatment కోసం ప్రత్యేకంగా ఉన్న Insurance Policy లు తీసుకోవడం బెటర్.

ఈ పాలసీలో ప్రత్యేకతలు

* క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తర్వాత ఒకేసారి పాలసీ విలువను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

* కొన్ని పాలసీల్లో క్యాన్సర్ దశలను బట్టి… పరిహారం ఇస్తారు. ఆ ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి ఆ Insurance company పేమెంట్ చేస్తుంది.

* ట్రీట్మెంట్ ఖర్చులను మొత్తం చెల్లించేలా పాలసీలో Special packages ఎంచుకోవచ్చు.

* పాలసీని క్లెయిం చేయకపోతే No Claim Bonus సౌకర్యం కూడా కొన్ని కంపెనీల పాలసీల్లో ఉంది.

* క్యాన్సర్ వ్యాధిని గుర్తించాక కొన్నాళ్లపాటు జీవించి ఉంటే.. అదనంగా కొన్ని cash benefits కూడా అందిస్తారు.

Cancer

Read this also : Health Policy : హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా ? ఈ కొత్త పాలసీ తెలుసుకోండి !!

క్యాన్సర్ పాలసీల్లో రకాలు

క్యాన్సర్ వచ్చినప్పుడే పరిహారం అందించే పాలసీ ఒకటి ఉంది. అలాగే క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లెమ్స్, ఇతర తీవ్రమైన వ్యాధులకు వర్తించే పాలసీలు కూడా తీసుకోడానికి అవకాశం ఉంది.
ఇప్పటికే మీకు Health Insurance, Life Insurance పాలసీలు ఉన్నాయనుకోండి. వాటికి అనుబంధ రైడర్ గా కూడా ఈ Cancer Policy/Critical Illness పాలసీని యాడ్ చేసుకోవచ్చు.

పాలసీ తీసుకునే ముందు

* Insurance Policy అనేది మొత్తం క్యాన్సర్ కు అయ్యే చికిత్స ఖర్చులను తట్టుకునేలా ఉండాలి.

* క్యాన్సర్ కి అన్ని దశల్లో కూడా పాలసీ అనేది రక్షణ కల్పించాలి. అంటే పేషెంట్ అడ్వాన్సుడ్ స్టేజ్ లో పాలసీ వర్తించదు లాంటి క్లాజులు ఏవీ లేకుండా చూసుకోవాలి.

* పాలసీ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి అప్లయ్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా Insurance Policy అనేది 90 రోజుల తర్వాత నుంచి వర్తించేలాగా ఉంటుంది. కొన్ని పాలసీలకు 180 రోజుల వరకూ Waiting periodగా చెబుతారు. అందుకే తక్కువ waiting period ఉన్న పాలసీలు ఎంచుకోవడం బెటర్.

క్యాన్సర్ వ్యాధిని గుర్తించాక కొన్ని రోజులు జీవించి ఉండాలి అనే రూల్ కూడా ఉంటుంది. Insurance పాలసీ తీసుకునేటప్పుడు వాటి సంగతి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా ఇది నెల (30 రోజులు) నుంచి 180 రోజుల వరకూ ఉంటుంది.

* క్యాన్సరీ పాలసీల్లో కొన్ని exemptions (మినహాయింపులు) కూడా ఉంటాయి. వాటి గురించి అడిగి తెలుసుకోండి.

* మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఇంకోకటి గుర్తుంచుకోండి. మనం తీసుకునే పాలసీ అన్నిరకాల క్యాన్సర్లకూ వర్తించేలా ఉండాలి. ఏవో కొన్నింటికి మాత్రమే అంటే… వాటిని prefer చేయకపోవడమే బెటర్.

మనం చికిత్స ఎలా తీసుకుంటున్నామనే విషయంలో Insurance Companies ఎలాంటి పరిమితులు విధించకూడదు. ఏదో ఒక కాజ్ చెప్పి… పేమెంట్ ఇవ్వకుండా కంపెనీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. ముందే తెలుసుకుంటే బెటర్.

Cancer

ఈ పాలసీని యాడ్ చేయండి

మీకు Health Insurance పాలసీ ఉన్నా …. వాటికి తోడుగా Cancer Policy లేదా Critical Illness Policy తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. కానీ పాలసీ తీసుకునేటప్పుడు మాత్రం ఎలాంటి షరతులు, రూల్స్ ఉన్నాయో పూర్తిగా తెలుసుకోండి. బెస్ట్ ఆప్షన్స్, కవరేజీ మంచిగా ఉన్న Insurance companyల నుంచి పాలసీలు తీసుకోండి. ఈ విషయంలో తొందరపడొద్దు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. నిపుణుల సలహా తీసుకున్నా తప్పులేదు.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Affiliate recommendation :

మీకు క్రెడిట్ కార్డు కావాలా ? వెంటనే RBL బ్యాంక్ కార్డు కోసం అప్లయ్ చేయండి

CLICK HERE FOR RBL CARD

Tagged