తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల కోసం ల‌డ్డూ కౌంట‌ర్ల దగ్గర సెల్ఫ్ స‌ర్వీస్ కియాస్క్‌ల‌ను ఏర్పాటు చేసింది. ట‌చ్ స్క్రీన్ ఉండే ఆ మెషీన్ దగ్గర, ఎవరికైనా అద‌న‌పు ల‌డ్డూలు కావాలంటే టోకెన్లు తీసుకోవ‌చ్చు. యూపీఐ పేమెంట్ ద్వారా ల‌డ్డూ టోకెన్లు జారీ అవుతాయి. కౌంట‌ర్ల దగ్గర ర‌ద్దీని తగ్గించేందుకు టీటీడీ ఈ ప్రయత్నం చేస్తోంది. తిరుమ‌ల‌లో వేర్వేరు ల‌డ్డూ కౌంట‌ర్ల దగ్గర ఈ కొత్త కియాస్క్ మెషీన్లను ఏర్పాటు చేశారు. పేమెంట్ స‌క్సెస్ అయ్యాక […]

Continue Reading

పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య

పితృదేవతలను స్మరించుకోడానికి… జ్యేష్ఠ అమావాస్య అనకులమైన రోజు. ఈనెల అంటే 2025 జూన్ 25 నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది. ఆరోజు పూజలు, దానధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారనీ, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఏం చేయాలి జూన్ 25 న జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించారు. అలా చేయడం […]

Continue Reading

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం (జూన్ 2న) ఉదయం 7:02 నుండి 7:20 గంటల మధ్య మిథున లగ్నంలో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. తర్వాత స్వామి వారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారు ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలతో కలిసి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఇది […]

Continue Reading

🛕 మే 26-27 శని జయంతి: ఈ రెండు రోజులు ఎందుకు ప్రత్యేకం?

  వైశాఖ అమావాస్య రోజున శని భగవానుడు జన్మించారు. అతను సూర్య భగవానుడికి, ఛాయాదేవికి పుత్రుడు. ఈ కారణంగా ఈ అమావాస్యను శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ధర్మమార్గాన్ని అనుసరించేవారికి శనిదేవుడు ఆశీర్వాదం అందిస్తారు, అపనీత మార్గం వెళ్ళేవారికి శిక్షిస్తారు. 🙏 శని జయంతి రోజున ఏం చేయాలి? 🏠 ఇంట్లో పూజ విధానం: పూజాస్థలాన్ని శుభ్రంగా ఉంచాలి శనిదేవుని చిత్రపటం లేదా విగ్రహం పెట్టాలి ఆవ నూనెతో దీపం వెలిగించాలి “ఓం శనైశ్చరాయ నమః” […]

Continue Reading

ఈ రోజు హనుమజయంతి – భక్తి, బలము, బుద్ధి తేజస్సు ప్రతీక!

  హనుమంతుడు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దైవం. ఆయన కేవలం రాముని భక్తుడే కాదు, సీతారాములకు కూడా ఆరాధ్య దేవుడు. రుద్రాంశ సంభూతుడైన అంజనేయుడు, వాయుపుత్రుడిగా పవిత్రమైన వానర తత్వాన్ని ధరించి భూమిపై అవతరించాడు. హనుమజయంతి (2025 మే 22) అనేది ఆయన అవతారానికి గౌరవంగా జరుపుకునే పవిత్ర రోజుగా భావించబడుతుంది. పంచముఖ హనుమంతుడు – ఐదు ముఖాల్లో ఐదు తత్వాలు వానర రూపంలో మనకు ఎక్కువగా తెలిసిన హనుమంతుడు నిజానికి పంచముఖ స్వరూపుడు. ఈ […]

Continue Reading

సరస్వతీ పుష్కరాల మహిమ తెలుసుకోండి!

  సప్తసింధువుల్లో ఒకటి అయిన పరమ పవిత్ర సరస్వతీ నది, భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. బ్రహ్మదేవుడి అర్ధాంగిగా చెప్పబడే వాగ్దేవి ఈ నదిగా అవతరించిందని పురాణాల పర్యాయంగా భావించబడుతుంది. వేదాలలో విశేషంగా కీర్తించబడిన ఈ నది నేడు చాలాచోట్ల అంతర్వాహినిగా ఉన్నా, దాని పవిత్రత మాత్రం అచంచలంగా కొనసాగుతోంది. వ్యాసుడు–భాగవత సృజనకు ప్రేరణ ఒక రోజు వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరాన బదరికాశ్రమంలో ధ్యానంలో లీనమయ్యాడు. వేదాల విభజన, భారత రచన చేసినా […]

Continue Reading

వైశాఖ మాసం విశిష్టత – పర్వదినాల మహాత్మ్యం

వైశాఖ మాసం విశిష్టత – పర్వదినాల మహాత్మ్యం భారతీయ సంస్కృతిలో సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక విశిష్టత ఉంది. వాటిలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైనదిగా, శుభఫలదాయకమైనదిగా పూరాణాలలో విశేషంగా వివరించబడింది. ఈ మాసంలో స్నానం, దానం, ఉపవాసం, పూజలు చేసిన వారికి అనేక రకాల పుణ్యఫలాలు లభిస్తాయని వైశాఖ మహాత్మ్యంలో చెప్పబడింది. స్నానం – పాప విమోచనం: వైశాఖమాసం పొడవునా పవిత్ర నదులలో స్నానం చేయడం విశేష ఫలదాయకం. కానీ అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. కనుక […]

Continue Reading

హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం

హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు వాల్మికి మహర్షి. శ్రీరామదూత, నమ్మినబంటు హనుమాన్ ను స్మరిస్తే చాలు… భయం, ఆందోళన తొలగిపోతాయి. భూత ప్రేతాలు దగ్గరకు కూడా రావు అంటారు. రామ నామం పలికే ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడు. అందుకే రామాయణం ప్రవచనం జరిగే ప్రతి చోటా, ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. హనుమాన్ అక్కడ కూర్చుని… […]

Continue Reading

ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?

కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు -ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు -చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). ఎలా తయారీ చేయాలి ? • బెల్లాన్ని తురమాలి. అందులో కొద్దిగా నీటిని చల్లి పక్కన పెట్టాలి. వేప పువ్వులో కాడలు తీసేసి…పువ్వు రెక్కలను సేకరించాలి. • మామిడి కాయను నిలువుగా […]

Continue Reading

ఉగాది నాడు ఏం చేయాలంటే…!

Ugadi 2025 : కాలాన్ని లెక్కపెట్టడంలో  రెండు ప్రధాన పద్ధతులున్నాయి. ఒకటి చాంద్రమానం (Chandramana Calendar), రెండోది సౌరమానం (Souramana Calendar). భారతీయులు ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చారు. అధికమాసాలు ద్వారా సమన్వయపరుస్తారు. చంద్రుని కళలను బట్టి తిథులు (Tithulu), నక్షత్రాలను బట్టి మాసాలు తెలుసుకోవచ్చు. ఈ తారల గమనం ఆధారంగానే ఉగాది వచ్చింది. ఉగాది (Ugadi) అంటే నక్షత్రాల గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది లేదా సంవత్సరాది. యుగాది […]

Continue Reading