లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ రిలీజ్ వాయిదా పడింది. మునుపు మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 4న థియేటర్లకు రానుంది. అయితే సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా ఓ కీలక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమా ఫైనల్‌గా లాక్ చేశామంటూ తెలియజేశాడు. […]

Continue Reading

జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?

జైలర్-2 సినిమాపై రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. మొదటి పార్టులో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెండో భాగంలోనూ ఉండనున్నారు. తాజాగా సమాచారం ప్రకారం, నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు […]

Continue Reading

“ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?” రాజమౌళి సమాధానం ఏమిటి?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించడం అన్నీ చిరస్మరణీయ ఘట్టాలే. తాజాగా ఈ చిత్రం లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై లైవ్ కాన్సర్ట్‌, ప్రీమియర్‌తో మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్ దంపతులు హాజరయ్యారు. వారితో కలిసి ఉన్న ఒక […]

Continue Reading

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే … ఇక వరుస సినిమాలు!

అభిమానులను ప్రతి ఏడాది ఓ సినిమాతో అలరించేందుకు ఎన్టీఆర్‌ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న బాలీవుడ్‌ పాన్‌ఇండియా మల్టీస్టారర్‌ ‘వార్‌ 2’ ఈ ఏడాది ఆగస్ట్‌ 14న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు 90 శాతం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. తారక్‌ కేరక్టర్ పై బాలీవుడ్‌లో వేర్వేరు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపిస్తారనీ, హృత్రిక్‌ పాత్రకు గట్టి పోటీగా ఉంటుందని సమాచారం. […]

Continue Reading

భద్ర మూవీకి 20యేళ్ళు – రవితేజ కెరీర్‌ లో బ్లాక్ బస్టర్

మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో మర్చిపోలేని బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘భద్ర’ ఒకటి. 2005 మే 12న విడుదలైన ఈ సినిమా, సోమవారంతో 20 యేళ్ళు పూర్తిచేసుకుంది. రవితేజ కెరీర్‌కు ఇది కీలక మైలురాయి. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజకు జోడీగా మీరా జాస్మిన్ నటించగా, ప్రకాశ్ రాజ్, సునీల్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో మెరిశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం […]

Continue Reading

విక్టరీ వెంకటేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో సినిమా..!

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విజయవంతమవుతూ, విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా సుమారుగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘన విజయం తర్వాత వెంకటేశ్ తన తదుపరి సినిమా ఎంపికలో చాలాచొప్పిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై పలు రోజులుగా చర్చలు సాగుతుండగా, […]

Continue Reading

“మెట్ గాలా అంటే మొదట భయమే వేసింది”:షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారిగా మెట్ గాలా 2025 వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్న మొదటి భారతీయ నటుడిగా శ్రేణిలో చేరారు. ఈ సందర్భంగా షారుఖ్ తన అనుభవాలను పంచుకుంటూ మాట్లాడుతూ, “మెట్ గాలా పేరు వినగానే మొదటిసారి భయమే వేసింది. నిజంగా ఈ ఈవెంట్‌కు ముందురోజు చాలా నర్వస్‌గా అనిపించింది. అసలు అక్కడ నుంచి తక్షణమే వెళ్లిపోవాలనిపించింది కూడా!” […]

Continue Reading

పెద్దిలో రామ్ చరణ్ షాట్‌ రీక్రియేట్ చేసిన డీసీ.. అదిరిందిగా!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే అందరినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క షాట్ చూస్తేనే డైరెక్టర్ బుచ్చిబాబు వేసుకున్న విజన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ఆ క్రికెట్ […]

Continue Reading

ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు: విజయ్ దేవరకొండ క్షమాపణ

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళ నటుడు సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఆయన “ట్రైబల్” అనే పదాన్ని ఉపయోగించారు. అయితే, ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయంటూ బాపూనగర్‌ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Continue Reading

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: త్వరలో ‘స్పిరిట్’ షూటింగ్

ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “రాజాసాబ్” చిత్రీకరణ దశలో ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ రాబోయే 2–3 నెలల్లో ప్రారంభమవుతుందని, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు “యానిమల్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, “యానిమల్ పార్క్” తరువాత ప్రభాస్‌తో కలిసి “స్పిరిట్” అనే పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ […]

Continue Reading