బాబు గారి చాణక్యం
రేవంత్ ను ఇబ్బంది పెట్టనోళ్లకే పదవి
కాంగ్రెస్ ను గెలిపించడమే అంతర్గత వ్యూహం
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో.. చంద్రబాబు తన చాణక్యం చూపించారా. ఈటెల, డి.కె అరుణ, అరవింద్, బండి సంజయ్ లను కాదని.. తనకు అనుకూలుడైన రామచందర్ రావును తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా బీజేపీ పార్టీపై ఒత్తిడి తెచ్చారా..? ఈటెల రాజేందర్ లాంటి వాళ్లు అధ్యక్షుడిగా ఉంటే.. తన శిష్యుడు రేవంత్ కు అడుగడుగునా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. వాళ్లందరినీ రేసులోనుంచి తప్పించారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అవుతోంది.
సోషల్ మీడియా, బీజేపీ నేతలదీ ఇదే మాట
రాంచందర్‌రావు ఎంపికలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీయే కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తుండటంతో ఆయన చెప్పిన వారికి ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో చంద్రబాబు చక్రం తిప్పారని.. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును బీజేపీ అధిష్టానం అధ్యకుడిగా ఖరారు చేసిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు.. రాజా సింగ్.. బహిరంగంగానే పార్టీ నిర్ణయాన్ని విమర్శించారు. చివరకు బండి సంజయ్ సైతం.. తమ పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు పాత్ర లేదంటూ.. క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన దుస్థితి.
కాంగ్రెస్ ను గెలిపించడమే వ్యూహమా..?
తెలంగాణాలో రాబోయే.. ఆరు నెలలు చాలా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇవన్నీ చాలవన్నట్లు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం చంద్రబాబుకు చాలా ముఖ్యం. గ్రామాల్లో, పట్టణాల్లో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుందన్న వార్తల నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలుపు చాలా కీలకంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ చతికిల పడితే.. రేవంత్ ను కుర్చి నుంచి దింపేందుకు సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లే గట్టిగా ప్రయత్నిస్తారు. కాబట్టి.. ఇటు బీజేపీ బలపడకుండా.. కమలం ఓట్లు.. బీఆర్ఎస్ వైపు మళ్లకుండా.. చిన్నగా ఇటు టీడీపీ, బీజేపీ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించడమే ధ్యేయంగా తనకు అనుకూలుడైన రామచందర్ రావునే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు చక్రం తిప్పారని.. కమలం పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించడం విశేషం.
Also read: షెఫాలీ మృతికి ఆ మందులే కారణం
Also read: హరిహర వీరమల్లు కొత్త పోస్టర్
Also read: రెమ్యూనరేషన్ డబుల్ శ్రీలీలా
Also read: https://www.sakshi.com/telugu-news/national/bjp-begins-process-pick-new-national-president-2491555