Chat GPT తెగ వాడుతున్నారా? ఇకపై చార్జీల మోతే !

Latest Posts Top Stories Trending Now

విద్యార్థులు, యూత్, ఉద్యోగాలు చేసేవాళ్ళు…వీళ్ళల్లో చాలా మంది చాట్ జీపీటీని అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ తెగవాడుతున్నారు. ఎలాంటి సమాచారం అయినా క్షణాల్లో రెడీ చేసి ఇస్తోంది. ఇక ఫోటోలో కావాలన్న సరైన ప్రాంప్టింగ్ ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది…ఇప్పుడీ Chat GPT సబ్‌స్క్రిప్షన్ పేరుతో చార్జెస్ వసూలు చేందుకు రెడీ అయింది. OpenAI ఇండియాలో ChatGPT Go అనే కొత్త ప్లాన్ అంటే ChatGPT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  దీని ధర నెలకు రూ. 399. దీన్ని UPI ద్వారా ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

The ChatGPT Millionaire: Making Money Online has never been this EASY (Buy this link)

 

ChatGPT Go కొత్త ప్లాన్‌లో ఏమున్నాయి అంటే… ChatGPT Goలో GPT-5కి యాక్సెస్ ఉంటుంది. అంటే ఫ్రీ ప్లాన్ OpenAI ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ కంటే 10 రెట్లు ఎక్కువ ఫీచర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. మెసేజెస్ లిమిట్ 10 రెట్లు ఎక్కువ ఉంటాయి… 10 రెట్లు ఎక్కువగా ఇమేజ్ జనరేషన్ చేస్తుంది… 10 రెట్లు ఎక్కువగా ఫైల్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లు చేసుకోవచ్చు. ChatGPT కి ఇప్పటికే ఉన్న రెండు ప్లాన్స్ వివరాలు చూస్తే… ChatGPT ప్లస్ plan: నెలకు రూ. 1,999, ChatGPT ప్రో ప్లాన్: నెలకు రూ. 19,900. ChatGPT Go ఫీచర్లు కోరుకునే కస్టమర్లకు తక్కువ ధరతో బడ్జెట్ ప్లాన్ కూడా ఉంది.

READ ALSO  Rice vs Chapati : అన్నం తినాలా... చపాతీ తినాలా ?

OPEN AI వైస్ ప్రెసిడెంట్ నిక్ టర్లీ ఏమంటాడంటే …చాట్‌జిపిటికి ఇండియా రెండో అతిపెద్ద, స్పీగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్, ప్రతి రోజూ లక్షల మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు CHAT GPT GOని తక్కువ ధరతో ఎక్కువ మంది AI టూల్స్ వాడుకునే సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. రిపోర్టుల ప్రకారం ChatGPT యాప్ ఆదాయంలో మిగతా వాటిని అధిగమించింది.ChatGPT యావరేజ్ ఒక్కో ఇన్‌స్టాల్‌కు రూ.253లు ఉంది. అదే ఎలోన్ మస్క్ గ్రోక్ ఆదాయం కేవలం రూ.65లు మాత్రమే ఉంది. మీలో ఎవరైనా చాట్ జీపీటీ ని ఉపయోగిస్తుంటే… మీకు అవసరం ఎక్కువే ఉంటుంది అనుకుంటే మాత్రం… కేవలం రూ. 399 తో ఇండియాలో AVAILABLE గా ఉన్న CHAT GPT GOను SUBSCRIBE చేసుకోండి.

READ ALSO  మార్వాడీ గో బ్యాక్ - ఎందుకీ వివాదం ?
Tagged

Leave a Reply