Personal Loans, Home Loans ఇతరత్రా రుణాల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అప్లయ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడుగుతారు. క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉంటే లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. మనకు గుడ్ స్కోర్ ఉందని తెలిస్తే… కొన్ని బ్యాంకుల కస్టమర్ కేర్ నుంచి తెగ కాల్స్ వస్తుంటాయి. కానీ కొందరు తమకు లోన్ వస్తుందో రాదో తెలుసుకోడానికి తరుచుగా తమ Cibil Score ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సొంతగా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే అది తగ్గిపోతుందా… ఇలాంటి డౌట్స్ కి సమాధానమే ఈ ఆర్టికల్
మన మొబైల్ లో ఉన్న కొన్ని యాప్స్…. మా యాప్ లో సిబిల్ స్కోర్ ఫ్రీగా చూసుకోవచ్చు అంటూ తరుచుగా మెస్సేజ్ లు పంపుతుంటాయి. ఇంకా కొందరికి నెలకు ఒకసారైనా Cibil Score చూసుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల స్కోరు తగ్గుతుందా?
ఎవరికైనా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పేదే క్రెడిట్ రిపోర్ట్. సిబిల్ లో క్రెడిట్ స్కోరు 750కి మించి ఉంటే మంచి స్కోరున్నట్టు. కానీ ఒక్కోసారి ఈ స్కోరు తగ్గిపోయే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యంగా కడుతుండటం, EMIలు కట్టకుండా బౌన్స్ చేయడం లాంటివి జరిగినా లేదంటే మనం క్రెడిట్ కార్డుల బిల్లులు సెటిల్ మెంట్ చేసుకున్నా… మన సిబిల్ క్రమంగా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టమవుతుంది.
సాఫ్ట్ ఎంక్వైరీ అంటే
జనరల్ గా మనం లోన్ కోసం బ్యాంకులను సంప్రదిస్తే… మన అప్లికేషన్ ఆమోదించాలా వద్దా అని నిర్ణయం తీసుకునే ముందు మన క్రెడిట్ స్కోర్ హిస్టరీని ఆ బ్యాంకులు చెక్ చేస్తాయి. మనం బ్యాంకులను సంప్రదించిన ప్రతీ సారీ … లోన్ కోసం ఎదురు చూస్తున్నట్టు అర్థమవుతుంది. దాంతో ఆ వివరాలన్నీ సిబిల్ లో నమోదు అవుతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.కానీ వ్యక్తిగతంగా మన స్కోర్ ను చెక్ చేసుకుంటే క్రెడిట్ బ్యూరోలు దాన్ని Soft enquiry గా గుర్తిస్తాయి. అలాంటి సమయంలో మన స్కోరుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తగ్గిపోయే అవకాశం ఉండదు అని అంటున్నారు ఆర్థిక నిపుణులు.
ముందే చెక్ చేస్తే బెటర్
మన క్రెడిట్ స్కోరును ఇష్టమొచ్చినప్పుడు చెక్ చేయొచ్చు. కొత్తగా లోన్ కి అప్లయ్ చేసే ముందు… ముందే సిబిల్ స్కోర్ చూసుకొని ఆ తర్వాతే బ్యాంకును సంప్రదించాలి. సిబిల్ స్కోర్ ను కనీసం 6 నెలలకు ఒకసారైనా చెక్ చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఏడాదికోసారి ఒక్కో సంస్థ నుంచి ఉచితంగా క్రెడిట్ స్కోరును తీసుకునే వీలుంది. దానివల్ల కూడా ఇబ్బందేమీ లేదు. కొన్ని సంస్థలు నెల నెలా స్కోరును ఉచితంగా అందిస్తున్నాయి. యాప్స్ కూడా Check your CIBIL Score FREE అని నోటిఫికేషన్లు పంపుతాయి. వాటిల్లో నమ్మకమైన, పేరున్న పెద్ద బ్యాంకుల యాప్స్ లో రిపోర్ట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనకు తెలియకుండానే మన పేరుతో ఏవైనా లోన్స్ ఉన్నా బయటపడే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోరు చూడటం వల్లే అలాంటివి బయటపడతాయి.
మనకు సంబంధం లేని లోన్స్ మన క్రెడిట్ హిస్టరీలో కనిపిస్తే వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయడం బెటర్. దాంతో మనకు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు చూసుకోవచ్చు. మొత్తమ్మీద మనంతట మనం సిబిల్ స్కోరును చూసుకుంటే ఫర్వాలేదు. కానీ మీరు ఒకేసారి నాలుగైదు బ్యాంకులను లోన్స్ కోసం అప్రోచ్ అయితే… వాళ్ళు ప్రతి సారీ మన స్కోర్ చెక్ చేస్తే ఇబ్బందుల్లో పడతాం.