Congress No guarantees : గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్… కర్ణాటకలో ఫ్రీబస్ ఎత్తివేత ?

Latest Posts Top Stories Trending Now

ఉచితం… అనుచితం… ఇది మేథావులు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ కాంగ్రెస్ అధికారంలో రావడమే ధ్యేయంగా ఎక్కడిక్కడ ఉచిత పథకాలకు హామీలు ఇస్తోంది. నువ్వు ఒకటంటే… నేను రెండు అంటా… అన్నట్టుగా కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తే… తెలంగాణలో 6… ఏపీలో ఏడు గ్యారంటీలతో ముందుకెళ్ళారు… ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ ఉచితాలు ఇవ్వడం సాధ్యం కాదని… అధికారంలోకి వచ్చాక గానీ తత్వం బోధపడలేదు. అందుకే ఆ పార్టీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే … బడ్జెట్ పరిమితిలోనే హామీలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీఎంలకు పిలుపు ఇచ్చారు. దీనిపై రెస్పాండ్ అయిన ప్రధాని మోడీ (PM Narendra Modi)… బీజేపీ ముందే చెప్పింది. సాధ్యం కాని హామీలు ఎలా ఇస్తారని మండిపడ్డారు.

ఒక రాష్ట్రంలో ఐదు… ఇంకో రాష్ట్రంలో ఆరు… మరో రాష్ట్రంలో 10… ఇలా అధికారంలోకి రావడమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ తెగ హామీలు ఇస్తోంది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అసలే కేంద్రంలో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టడంతో ప్రస్టేషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి … ఇలాంటి ఉచిత హామీలు గుప్పిస్తోంది. రాష్ట్రాల కాంగ్రెస్ నేతల స్ట్రాటజీని రాహుల్ గాంధీ కూడా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఫాలో అయి బొక్క బొర్లా పడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నమ్మి కాంగ్రెస్ తో పాటు మిత్ర పక్షాలు కొన్ని సీట్లు ఎక్కువ కట్టబెట్టారే తప్ప అధికారంలోకి మాత్రం తీసుకురాలేదు జనం.

ఖర్గేకి ఇప్పుడు తెలిసొచ్చిందా ?

ఉచితాల పేరుతో బడ్జెట్ కి మించి హామీలు ఇస్తుండటం… ఆ తర్వాత వాటిని అమలు చేయలేకపోతుండటంతో కాంగ్రెస్ (Congress party) పార్టీకి చెడ్డపేరు వస్తోందని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి (Mallikarjun Kharge) భయం పట్టుకుంది. అందుకే ఉచితాలు అనేవి… బడ్జెట్ పరిమితికి లోబడి ఉండాలని ఇప్పుడు చెబుతున్నారు. అది కూడా తన సొంత రాష్ట్రంలో కర్ణాటకలో పరిస్థితి చూశాక ఆయనకు ఈ విషయం బోధపడినట్టు ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయడం ఇప్పుడు తలకు మించిన భారం అయింది. ఉచిత పథకాలను అమలు చేయడం కోసం పన్నుల భారం పెరిగిపోవడంతో బెంగళూరు సిటిజన్స్ సహా రాష్ట్రమంతగా కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్నారు. పైగా ఇదే టైమ్ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై పునరాలోచన చేస్తామంటూ కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సరే… తర్వాత తన మాటలు వక్రీకరించారని మాట మార్చారనుకోండి. కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది.

ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనీ…జనంలో విశ్వాసం కోల్పోతామని అన్నారు మల్లిఖార్జున ఖర్గే. ఐదు, ఆరు, పది ఇలా గ్యారంటీలు పెంచుకుంటూ పోకండి… అంటూ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు కూడా ఖర్గే సూచనలు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చేశారు. జనం కట్టిన పన్నులన్నీ ఉచిత హామీలకే పోతే… రోడ్లు వేయడం కూడా కష్టమవుతుందని అంటున్నారు ఖర్గే (Kharge). గ్యారంటీలతో రాష్ట్రాలు దివాలా తీస్తాయని కూడా హెచ్చరించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.

హామీలతో దగా : ప్రధాని మోడీ

ఉచితాలపై ఖర్గే ప్రకటనతో వెంటనే రెస్పాండ్ అయ్యారు ప్రధాని మోడీ. అమలు చేయలేని గ్యారంటీలు ఇస్తూ కాంగ్రెస్ జనాన్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. X లో మోడీ ట్వీట్ చేశారు. హామీలు ప్రకటించడం ఈజీ… కానీ వాటిని అమలు చేయడం కష్టం… ఆ విషయం కాంగ్రెస్ కి ఇప్పుడు తెలిసొచ్చింది… తాము ప్రకటించే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని వాళ్ళకీ తెలుసు. అయినా జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు అంటూ నిలదీశారు మోడీ. కర్ణాటకలో అభివృద్ధి ఎప్పుడో ఆగిపోయింది. స్కీములు బంద్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు టైమ్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీ కోసం తెలంగాణలో రైతులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలపై దేశ ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తతతో ఉండాలని మోడీ హెచ్చరించారు.

తెలంగాణ పరిస్థితి ఏంటి ?

తెలంగాణలోనూ 6 గ్యారంటీల్లో 3, 4 సబ్ గ్యారంటీలు అమలు చేశారు. ఇంకా అమలు చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. వాటికి ఎలాట్ చేయడానికి రాష్ట్ర ఖజనా సరిపోదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్ హామీల మీద విరుచుకుపడటానికి రెడీ అవుతున్నారు. కొత్త ఏడాదిలో కొత్తగా మళ్ళీ జనంలోకి వస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. మరి ఈలోగా ఎన్ని హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నది చూడాలి.

 

Tagged