డయాబీటీస్ ఉన్నవారిలో క్రియాటిన్ స్థాయిలు పెరగడం కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాల డయాబీటీస్ కారణంగా కిడ్నీ, గుండె, నరాలు, పళ్లపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు క్రియాటిన్ నిల్వలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. క్రియాటిన్ స్థాయులను నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
క్రియాటిన్ స్థాయులను అదుపులో ఉంచేందుకు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఆహారంలో ప్రొటీన్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి, అయితే శరీరంలో కండ పరిమాణం తగ్గకుండా జాగ్రత్త వహించాలి. అధిక బరువు లేదా కొవ్వు ఉంటే క్రియాటిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది, అందువల్ల బరువును అదుపులో ఉంచుకోవాలి.
మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. పప్పు దినుసులు, సోయా, పాలు, పెరుగు లాంటివి ప్రొటీన్‌తో పాటు శరీరానికి మేలు చేస్తాయి. మాంసాహారం తినేవారు తక్కువ కొవ్వు ఉండే చేపలు, చికెన్, రెండు గుడ్లు (తక్కువ నూనెతో వండినవి) తీసుకోవచ్చు. అయితే, రోజుకు 90-100 గ్రాముల ప్రొటీన్‌ను మించకూడదు. ఈ ఆహార నియమాలు పాటిస్తూ, రెండు నెలల తర్వాత క్రియాటిన్ స్థాయులను మళ్లీ పరీక్షించుకోవాలి.
డయాబీటీస్‌తో పాటు రక్తపోటు (బీపీ) ఉన్నవారు మెడిటేషన్, యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కిడ్నీ ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం, ఉప్పు తక్కువగా వాడటం కూడా ముఖ్యం. ఈ ఆహార నియమాలు ఎత్తు, బరువు, శరీర నిర్మాణాన్ని బట్టి మారుతాయి కాబట్టి, పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : రోజూ 7,000 అడుగులైనా నడవాలి !
Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE
Read also : పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత