Credit card loans Credit card loans

Credit Card: క్రెడిట్‌ కార్డులో లోన్ కావాలా ? జాగ్రత్త !

Blog Money Matters

దాదాపుగా క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరో కొందరు మాత్రమే… అది దగ్గర ఉంటే ఎంత దుబారా అవుతుందో తెలిసి క్రెడిట్ కార్డును దగ్గరకు రానీయరు… ఎవరైనా ఇస్తామన్నా క్రెడిట్ కార్డు తీసుకునే సాహసం చేయరు. కానీ ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అంతేకాదు… ఏదో ఒక అవసరానికి ఆ కార్డులపైన లోన్స్ కూడా తీసుకుంటున్నారు… ఇలాంటి రుణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. లేకపోతే కొంప కొల్లేరే ! అని వార్నింగ్ ఇస్తున్నారు.

క్రెడిట్ కార్డు (Credit Card) రాగానే చాలామంది ముందుగా చెక్ చేసేది లిమిట్ ఎంత అని… లిమిట్ తెలిస్తే చాలు… ఇక రెచ్చిపోయి ఎక్కడ ఏం కొన్నా గీకేస్తారు… ఆ తర్వాత 45 రోజులకు క్రెడిట్ కార్డు బిల్లు చేతికి వస్తే గానీ అసలు తత్వం బోధపడదు. నిజానికి క్రెడిట్ కార్డు కూడా లోన్ లాంటిదే… అందుకే వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు… కార్డు మీద లోన్ (Credit card loan )తీసుకునే విషయంలోనూ కేర్ లేకపోతే అప్పుల్లో మునగడం ఖాయం అంటున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్. క్రెడిట్‌ కార్డు కొనుగోళ్ళకే కాదు… ఎమర్జనీలో అప్పు తీసుకోడానికి ఉపయోగపడుతుంది. అర్జెంట్ కోసమో లేదంటే అవసరాల కోసమో డబ్బులు కావాలి అనుకుంటే వెంటనే లోన్ తీసుకునే ఫెసిలిటీ ఈ క్రెడిట్ కార్డులో ఉంది. Personal loansతో పోలిస్తే దీనికి రూల్స్ పెద్దగా ఉండవు. ఎలాంటి additional documents పెట్టకుండా ఒక్క క్లిక్ తో లోన్ మన బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవుతుంది. క్రెడిట్‌ కార్డుతో ATM నుంచి క్యాష్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ ఇది మరీ డేంజర్. ఇంట్రెస్ట్ రేటు దారుణంగా ఉంటుంది. దానికంటే Credit Card మీద Loan కి అప్లయ్ చేయడం బెటర్.

క్రెడిట్‌ కార్డు ఉన్నంత మాత్రాన అందరికీ లోన్ రాదు. కానీ బ్యాంకులు లేదంటే ఆ కార్డు సంస్థలు మీ కార్డు మీద ఎంత దాకా లోన్ ఇస్తాయో ముందే చెబుతాయి. మధ్య మధ్యలో కస్టమర్ కేర్ కాల్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి క్రెడిట్ కార్డు మీద లోన్స్ తీసుకున్నప్పుడు… అదే రోజు నుంచి వడ్డీ లెక్కిస్తారు. కార్డు మీద లోన్ EMIల్లో కట్టుకోడానికి maximum 36 నెలలు ఇస్తారు. అంటే మూడేళ్ళు. కొన్ని బ్యాంకులు ఐదేళ్ళ దాకా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మనం కార్డులో అమౌంట్ ను ATM ద్వారా తీసుకుంటే ఆ మేరకు లిమిట్ లో బ్లాక్ చేస్తారు. కానీ లోన్ తీసుకుంటే అలాంటి ప్రాబ్లెమ్ ఏమీ ఉండదు. సో… మనకు ఇచ్చిన లిమిట్ వరకూ కొనుగోళ్ళు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడే ప్రతి ఒక్కరూ కొన్ని డాక్యుమెంట్లను బ్యాంకులకు ఇస్తారు. వాటి ఆధారంగానే ఇప్పుడు Credit card loan మంజూరవుతుంది. అందుకే ప్రత్యేకంగా మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పన్లేదు.

కార్డు వివరాలను Online లో అకౌంట్ లో క్రెడిట్ కార్డు సెక్షన్ లో చూస్తే.. ఎంత లోన్ వస్తుంది… వడ్డీ ఎంత వసూలు చేస్తారు. EMI లు నెలకు ఎంత కట్టుకోవచ్చో తెలుస్తుంది. అంతేకాదు నెలకు ఎంత వరకూ చెల్లించగలరో నిర్ణయించుకొని దాన్ని బట్టి… EMIని కూడా సెట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులపై రుణాల మీద వడ్డీలు 10 నుంచి 24 శాతం దాకా ఉంటాయి. దీనికి తోడు మన ఉద్యోగాన్ని బట్టి కేటగిరీ నిర్ణయించి … ఆమేరకు వడ్డీ రేట్లు ఫిక్స్ చేస్తారు. మీడియా, లాయర్లు, పోలీసులకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఛాన్సుంది. అందుకే ఎమర్జన్సీ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో Credit card loans తీసుకోవడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోన్ తీసుకున్నా EMI మన బిల్లుతో పాటే జనరేట్ అయి… Credit card bill లోనే వస్తుంది. అందువల్ల మన నెలవారీ బడ్జెట్‌లో ఈ EMI కి కొంత డబ్బులు పక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే లోన్ తీసుకోవాలి.

క్రెడిట్‌ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు. ఇతర loansతో పోలిస్తే Credit cardపై లోన్ కి వడ్డీ రేటు ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
మీ EMI లు అనేవి మొత్తం మీ ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోవాలి. అప్పుడే లోన్ తీసుకోవాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డుపై లోన్ తీసుకుంటే అది క్రెడిట్‌ స్కోర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే లోన్ కోసం అప్లయ్ చేయడం బెటర్. లేదంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

Tagged