నట సింహం బాలయ్య బాబు… డాకు మహారాజ్ మూవీ (Daku Maharaj) టీజర్, పోస్టర్ ఈమధ్యే రిలీజ్ అయ్యాయి. ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియని డాకు మహారాజ్ రియల్ స్టోరీలో బాలక్రిష్ణ (Actor Bala Krishna Nandamuri) నటిస్తున్నాడు. దాంతో చాలామందికి ఆసక్తి పెరిగింది. గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేసినప్పుడు ఆయన గురించి తెలుసు. కానీ… ఈ డాకు మహారాజ్ ఎవరు? ఏ చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించి చదవలేదే అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. డాకు మహారాజ్ గురించి బాలక్రిష్ణ అభిమానులే కాదు అందరూ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అందుకే డాకు మహారాజ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిపేందుకు ఈ ఆర్టికల్ www.teluguword.comలో ఇస్తున్నాం.
డాకు మాన్ సింగ్.. పోలీసులైకే క్రిమినల్. కానీ చాలా గ్రామాల్లో ఆయన్ని దేవుడిగా కొలుస్తారు. ఎందరికో మంచి చేసిన గొప్ప నాయకుడిగా గుర్తిస్తారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ టీజర్ ఈమధ్యే రిలీజ్ అయ్యింది. ఈ మూవీని మాన్ సింగ్ రియల్ స్టోరీ ఆధారంగా తీస్తున్నారు. లెక్కలేనన్ని దోపిడీలు చేసి… పోలీసులకు సవాల్ గా మారి… వేల మంది భూస్వాములు, ధనికులను హడలెత్తించిన డాకు మహారాజ్ దేవుడు ఎలా అయ్యాడు… అసలు అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
మాన్ సింగ్ (Maan Singh) ది ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు దగ్గరలోని ఖేరా రాథోడ్ గ్రామం. క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. పెరిగింది ఛంబల్ లోయలో. ఛంబల్ లోయ (Chambal ) అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బందిపోటు దొంగలు. గతంలో ఇదే ప్రాంతంలో దోపిడీలు చేసిన పూలన్ దేవి (Poolan Devi) తర్వాత ఎంపీగా కూడా ఎన్నికైంది. ఆమె రియల్ స్టోరీతో కూడా బ్యాండిట్ క్వీన్ (Bandit Queen) పేరుతో సినిమా వచ్చింది. ఇప్పుడు మాన్ సింగ్ స్టోరీ కూడా బాలయ్య బాబు హీరోగా వస్తోంది.
దోపిడీలు.. దౌర్జన్యాలు…
మాన్ సింగ్ ఛంబల్ ఏరియాలో 17 మంది తన మిత్రులతో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరిగింది. మాన్ సింగ్ వెంట ఉండే వాళ్ళతో పాటు పరోక్షంగా కూడా మొత్తం 400 మందికి పైగా పనిచేసేవారట. ఇతని మీద 185 హత్యలు,1112 దోపిడీ కేసులు ఉన్నాయి. లెక్కపెట్టలేనన్ని కిడ్నాపులు చేశాడు. తన వెంటపడి…. పట్టుకోడానికి ప్రయత్నించిన 32 మంది పోలీసులను కూడా మాన్ సింగ్ చంపేశాడు. 4 రాష్ట్రాలకు చెందిన వేల మంది పోలీసులు 15 యేళ్ళ పాటు అతని కోసం వెతికారు. ఇలా లెక్కలేనన్ని క్రిమినల్ కేసులతో పోలీసులకు most wanted గా మారాడు మాన్ సింగ్. పోలీసుల దృష్టిలో మాన్ సింగ్ గజ దొంగ అయితే… ఛంబల్ లోయలో కొన్నివేల మంది అతన్ని దేవుడిగా కొలుస్తారు.
పెద్దరాయుడిలా మాన్ సింగ్ తీర్పులు
మాన్ సింగ్ దోపిడీలు, కిడ్నాప్ లు, హత్యలే కాదు… ఛంబల్ ఏరియాలో పెద్ద రాయుడిలా తీర్పులు కూడా ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి లీడర్ ని అనిపించుకోవాలని ఆరాటం ఉండేది. పెద్దయ్యాక ఊళ్ళల్లో పంచాయితీలు తీర్చేవాడు… తనకు తోచిన విధంగా తీర్పులు చెప్పేవాడు. అయితే మాన్ సింగ్ కి శత్రువులు కూడా బాగానే ఉన్నారు. కొందరు రౌడీలు, వడ్డీ వ్యాపారులు ఆయన్ని వ్యతిరేకించేవారు. మాన్ సింగ్ పై కుట్రలు మొదలు పెట్టారు. అతని భూమిని అన్యాయంగా లాక్కున్నారు. తర్వాత తప్పుడు కేసు పెట్టి… జైలుకు పంపారు. మాన్ సింగ్ జైల్ నుంచి విడుదలయ్యాక తన విశ్వరూపం చూపించాడు. కటకటాల్లోకి వెళ్లడానికి ఎవరెవరు కుట్ర చేశారో… వాళ్ళపై దాడి చేశాడు. ఇళ్లకు నిప్పుపెట్టాడు. ఆ తర్వాత ఛంబల్ లోయలోకి పారిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో నడిచిన మాన్ సింగ్ రియల్ స్టోరీ. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాన్ సింగ్ ని జైల్లో పెట్టాక… అతని ఇద్దరు కొడుకులు జస్వంత్ సింగ్, ధన్వన్ సింగ్ లను ఎన్ కౌంటర్లో కాల్చేశారు. 1939లో మాన్ సింగ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి మరో కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. తన కొడుకులను ఎన్ కౌంటర్ చేసిన వాళ్ళని ఎవర్నీ వదిలిపెట్టలేదు. వెంటాడి వేటాడి చంపేశాడు…
దోచిందంతా…. దానం చేశాడు
మాన్ సింగ్ దోపిడీలు చేయగా వచ్చిన డబ్బుని ఎక్కువగా మంచి పనుల కోసమే ఖర్చు పెట్టాడని ఛంబల్ లోయలో చెబుతుంటారు. బలిసినోళ్ళ దగ్గర దోపిడీ చేసి … పేదలకు పంచి పెట్టేవాడు. ఆడవాళ్లంటే అతనికి ఎనలేని గౌరవం. చాలా మంది యువతులకు తన ఖర్చులతో పెళ్లిళ్లు కూడా చేశాడు. అందుకే ఆగ్రా చుట్టు పక్కల జిల్లాల్లోని చాలా గ్రామాల్లో మాన్ సింగ్ ని దేవుడిగా కొలుస్తారు. మాన్ సింగ్ కి ప్రత్యేకంగా గుడి కూడా కట్టారు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది.
బిగ్ బి అమితాబ్ (Big B Amithab) మాటల్లో ….
మాన్ సింగ్ గజదొంగ అయినప్పటికీ… అతను చేసిన మంచి పనుల గురించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన బ్లాగ్ లో రాశాడు. తన చిన్నప్పుడు డాకు మాన్ సింగ్ సాహసాల గురించి ఆగ్రా ఏరియాలో కథలు కథలుగా విన్నట్టు అమితాబ్ తెలిపారు. ఆగ్రా (Agra) చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ నలుగురు కలిసినా మాన్ సింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకునేవారని చెప్పారు.
బాలీవుడ్ లో సినిమాలు
డాకు మాన్ సింగ్ రియల్ స్టోరీతో బాబు బాయ్ మిస్త్రీ దర్శకత్వంలో 1971లో ‘డాకు మాన్ సింగ్’ అనే మూవీ వచ్చింది. ఆ తర్వాత 2019లో రిలీజ్ అయిన ‘సోంచిరియా’ అనే మూవీలో కూడా మాన్ సింగ్ నిజ జీవితానికి సంబంధించిన కొన్ని సీన్లు పెట్టారు. అప్పట్లో మనోజ్ బాజ్ పాయ్ ఈ మూవీలో నటించాడు. పూలన్ దేవి జీవిత కథ ఆధారంగా రిలీజ్ అయిన బాండిట్ క్వీన్ మూవీలోనూ మాన్ సింగ్ పాత్రలో మనోజ్ బాజ్ పేయి నటించారు. Tales of Man Singh – King of Indian Dacoits అనే పేరుతో కెన్నెత్ ఆండర్సన్ రాసిన పుస్తకం అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది లింక్ ద్వారా ఆ పుస్తకం కొనుక్కోవచ్చు
MAN SINGH TALES BOOK LINK: https://amzn.to/4fvKmqP
మాన్ సింగ్ పాత్రలో బాలయ్య బాబు (Bala krishna Nandamuri)
Sitara entertainment ఆధ్వర్యంలో నాగ వంశీ ఈ Daku Mansingh మూవీని నిర్మిస్తున్నారు. ఓ టీజర్ (movie teaser) కూడా రిలీజ్ అయింది. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది అనే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది. బాలకృష్ణ హిట్ మూవీ భగవంత్ కేసరి తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. దాంతో బాలయ్య బాబు మూవీపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, చాందినీ చౌదరి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ తో పాటు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు కూడా ఇందులో నటిస్తున్నట్టు చెబుతున్నారు. బాబీ కోలీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి తమన్ S సంగీతం అందిస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి ముందు జనవరి 12న worldwide గా ప్రేక్షకుల ముందుకు రానుంది.