ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు. రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు. ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.
ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య హైదరాబాద్ కు చెందిన ఓ బాధితురాలి నుంచి 5 కోట్ల 90 లక్షల రూపాయలను బదిలీ చేయించుకున్నాడు. అలాగే మరో 80 యేళ్ళ వృద్ధుడికి కూడా వాట్సాప్ వీడియో కాల్ చేసి… మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారు అంటూ బెదిరించి… దాదాపు 5 కోట్ల రూపాయలను కాజేశారు. నాచారంలో కూడా 75 యేల్ళ వృద్ధుడిని ఇలాగే మోసం చేశారు. ముంబై టెలికాం శాఖ నుంచి చేస్తున్నామంటూ… మనీ లాండరింగ్ పేరు చెప్పి… బెదిరించి… దాదాపు 5 కోట్లు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ అనేకం జరుగుతున్నాయి… ఈ సైబర్ కేటుగాళ్ళు… మన దగ్గ నుంచి డబ్బులు లాగడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు…
వీళ్ళంతా లేటెస్ట్ గా వాడుతున్న పదం… డిజిటల్ అరెస్ట్…
వాళ్ళు పోలీస్ అధికారులం అని చెప్పుకొని… వాట్సాప్ కాల్స్ లేదంటే… స్కైప్ ద్వారా మనకు వీడియో కాల్ చేస్తారు… మనకు కనిపించేలాగా… పోలీస్ డ్రెస్సుల్లో దిగిన ఫోటోలను వాళ్ళ డీపీలుగా పెట్టుకుంటున్నారు… అలాగే వాట్సాప్, స్కైప్ అకౌంట్స్ కి కూడా ముంబై క్రైంబ్రాంచ్ పోలీస్… ముంబై సైబర్ పోలీస్ అని రక రకాల ఐడీలు తగిలించుకుంటున్నారు. కానీ వాళ్ళు కనిపించకుండా… హైడ్ చేసుకొని… మనల్ని వాచ్ చేస్తుంటారు. మనీ లాండరింగ్, ఇల్లీగల్ డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో… భయపెట్టి….. తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. బాధితులను కదలనీయకుండా… ఆలోచించుకోనీయకుండా….. కనీసం పక్కకి కూడా చూడనీయకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంటారు.
ముంబై పోలీసులే కాదు… సీబీఐ, ఈడీ అధికారులమని కూడా చెప్పుకుంటున్నరు ఈ కేటుగాళ్ళు. మన మీద మనీ లాండరింగ్ కేసు నమోదైనట్టుగా… డూప్లికేట్ FIR కాపీలు… CBI దగ్గర కేసు ఉన్నట్టుగా ఫేక్ డాక్యమెంట్స్ కూడా పంపుతున్నారు. వీటిని చూపించి ఇంకా భయపెడుతున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించి తీవ్రమైన నేరం… మీరు అరెస్టు ఖాయం… బెయిల్ దొరకదు… బయటకు రావడానికి నెలలు, యేళ్ళు కూడా పట్టవచ్చని బెదిరిస్తున్నారు.
ఆ నేరంతో సంబంధం లేదని బాధితుడు మొత్తుకుంటున్నా… వాళ్ళు అలా బెదిరిస్తూనే ఉంటారు. మధ్యలో ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని లైన్లోకి తీసుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇంకో వ్యక్తి లైన్లోకి వచ్చి… తాను సైబర్ క్రైమ్ ఎస్పీ ఇంకోటి అనో చెప్పుకుంటూ… మీరు డిజిటల్ అరెస్టు అయ్యారనీ… ఎంక్వైరీకి సహకరించాలని… మీరు నిజంగా మనీలాండరింగ్ కి పాల్పడకపోతే… మీ మీద కేసు తీసేస్తామని చెబుతారు. విచారణ పూర్తయ్యే దాకా వీడియో కాల్ ఆఫ్ చేయొద్దని… ఎవ్వరికీ ఈ విషయం చెప్పవద్దనీ… కనీసం మంచి నీళ్ళు తాగడానికి… టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా అనుమతించకుండా… ఇబ్బంది పెడుతుంటారు. బాధితులు ఉన్న గది నుంచి బయటకు వెళ్ళకుండా మాగ్జిమమ్ ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే… బయటకు వెళితే ఎవరికైనా చెబుతారని … మీ ఇంటి బయట మా పోలీసుల నిఘా ఉందీ… వీడియో కాల్ ఆపితే,… బయట ఉన్న పోలీసులు అరెస్టు చేసి ముంబైకి తీసుకొస్తారని కూడా కేటుగాళ్ళు హెచ్చరిస్తున్నారు.
నేరం చేయలేదని నిరూపించుకోడానికి RBI ఏర్పాటు చేసిన ఖాతాలోకి మీ అమౌంట్ పంపాలంటూ… నేరంలో మీ ప్రమేయం లేకపోతే… మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయని చెప్పి… అకౌంట్లో ఉన్న మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారు. కొంతమంది అయితే… బ్యాంకుకు వెళ్లి… తన అకౌంట్ లో క్యాష్ తో పాటు… FDలు, షేర్లు కూడా నేరస్థుల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇలాంటి రోజూ వందలు, వేలల్లో జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు… అసలు డిజిటల్ అరెస్టులు అనేవి మన చట్టంలో లేవంటున్నారు పోలీసులు. ఎంతటి తీవ్ర నేరం అయినా… డిజిటల్ అరెస్టులు ఉండవు. అలా ఎవరైనా బెదిరించారంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టే… ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ ని ఇతరుల అకౌంట్స్ లోకి ట్రాన్స్ ఫర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. దర్యాప్తు అధికారులం అని ఎవరైనా ఫోన్ చేస్తే… 1980కి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
ఈమధ్యే డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశంలో జరుగుతున్న అరాచకాల మీద మీద ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ అని కాల్ చేస్తే నమ్మొద్దని పిలుపు ఇచ్చారు. మోడీ స్పందించిన తర్వాత ఇప్పుడిప్పుడే బ్యాంకులు కూడా అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. అటు ప్రభుత్వం సంస్థలు కూడా స్పందిస్తున్నాయి.