పండుగల విషయంలో ఈమధ్య సందిగ్ధం నడుస్తోంది. ఒక తిథి రెండు రోజుల పాటు ఉండటంతో మిగులు, తగులు విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం దీపావళి విషయంలోనూ అలాంటి సందేహమే నడుస్తోంది. అక్టోబర్ 31న దీపావళి చేసుకోవాలా ? లేదంటే నవంబర్ 1 న చేసుకోవాలా ? అని చాలా మంది సందేహంలో ఉన్నారు. అలాంటి వారికి క్లారిటీ ఇవ్వడానికి ఈ ఆర్టికల్ ఇస్తున్నాం. చదవండి…
హిందూ బంధువులందరికీ నమస్కారం…
హిందువుల పండగలు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అందరికీ తెలియజేయడానికి మనం మహర్షి భక్తి పీఠం అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాం. ఈ ఛానెల్ ను ప్రతి ఒక్క హిందువు subscribe చేసుకోండి. ఈ లింక్ కింద ఇస్తున్నాను.
Subscribe మహర్షి భక్తి పీఠం https://www.youtube.com/@maharshibhakthi
ఈ ఏడాది 2024లో దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై చాలామందిలో సందేహం ఉంది. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1 ఈ రెండు తేదీల్లో దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటామని మనందరికీ తెలుసు. దీపావళి పండుగ దక్షిణ భారత దేశంలో రెండు లేదా 3 రోజులు జరుపుకుంటారు. కానీ ఉత్తరాదిలో 5 రోజుల పాటు ఎంతో వేడుకగా చేసుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు జరుపుతారు. ఈ ఏడాది దీపావళిని ఏ తేదీన జరుపుకోవాలి… ఏ రోజు శుభప్రదమో…. దీపావళి పూజా విధానం ఏంటో చూద్దాం.
అక్టోబర్ 31 లేదా 1వ దీపావళి ఎప్పుడు?
దీపావళిని అక్టోబర్ 31 నాడు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:11 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 05:12 వరకు కొనసాగుతుంది. అంటే అమావాస్య తిథి అక్టోబర్ 31 రాత్రి ఉంటుంది. అందువల్ల దీపావళిని అక్టోబర్ 31రాత్రి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
దీపావళిని ఆశ్వయుజ మాసంలోని అమావాస్య నాడు జరుపుకుంటారు. ప్రదోష కాలం తర్వాత దీపావళి చేస్తారు. ఆ రోజు రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజ, నిశిత కాలపూజ చేస్తారు. అక్టోబరు 31 రాత్రి నాడే అమావాస్య గడియలు ఉండటంతో ఆ రోజే దీపావళి జరుపుకోవాలి. అమావాస్యకు సంబంధించిన దానధర్మాలు, పితృ ఆచారాలు లాంటివి మాత్రం నవంబర్ 01 న నిర్వహించుకోవచ్చేని చెబుతున్నారు.
దీపావళి ఎలా జరుపుకోవాలి ?
దీపావళి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలకు జలాభిషేకం చేయాలి. పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామి వారికి అభిషేకం చేయాలి.
గణేశుడికి పసుపు చందనం, పసుపు పువ్వులు, దుర్వాన్ని సమర్పించాలి. వరాలు ఇచ్చే అమ్మ లక్ష్మీదేవికి ఎర్రచందనం, ఎర్రని పువ్వులు సమర్పించాలి. దీపావళి రోజున నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. శ్రీ లక్ష్మీ సూక్తం, గణేష్ చాలీసా చదువుకోవాలి. పూజ తర్వాత లక్ష్మీదేవితో పాటు మిగతా దేవతలకు హారతి ఇవ్వాలి. దీపావళి రోజు గణేశుడికి లడ్డూలు లేదా మోదక్, లక్ష్మీ దేవతకు ఖీర్ సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
NOTE:
ఈ కథనాన్ని కొందరు పండితులు, వివిధ ఇంటర్నెట్ మాధ్యమాల నుంచి తీసుకొని రాయడమైనది. చాలా వరకూ దోషాలు రాకుండా భక్తుల విశ్వాసలు దెబ్బతినకుండా రాస్తున్నాం. మరింత సమాచారం కావాలి అనుకునేవారు హిందూ పండితులను సంప్రదించగలరు.