ఆగస్టు 27, 2025 – వినాయక చవితి ప్రత్యేకం
గణపతి బప్పా మోరియా! అని వినిపించే శబ్దాలతో మరోసారి మన ఇళ్ళు, వీధులు వినాయకుడి భజనలతో మార్మోగబోతున్నాయి. ఈనెల 27న వినాయక చవితి వస్తోంది. భక్తులంతా ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ ఆనందాన్ని మనం ప్రకృతికి కూడా పంచుదాం. అందుకోసం పర్యావరణాన్ని కాపాడే గణనాథుని ఆహ్వానిద్దాం.
ఇన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో చేసిన విగ్రహాలు, రసాయన రంగులు వాడటం వల్ల నదులు, చెరువులు కలుషితం అవుతున్నాయి. గణనాథుని విగ్రహాలను నీళ్ళల్లో నిమజ్జనం చేసిన తరువాత విషపూరిత పదార్థాలు జలచరాలను చంపేస్తున్నాయి. అందుకే ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను మన ఇంటికి తెచ్చుకుందాం.
ఎకో ఫ్రెండ్లీ గణపతుల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
[irp posts=”4091″ ]
ఎందుకు ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు?
* 🌱 సహజ పదార్థాలతో తయారీ – మట్టి, శుద్ధమైన రంగులు, చెట్ల నుంచి వచ్చిన పదార్థాలతో తయారవుతాయి.
* 🌊 పర్యావరణహితం – నీళ్ళల్లో ఈజీ కలిసిపోతాయి, ఎలాంటి కలుషితాలను మిగల్చవు.
* 💚 ఆరోగ్యకర వేడుకలు – మట్టి విగ్రహాలతో కుటుంబాలకు, పిల్లలకు సురక్షితం.
* 🌍 గణనాథుని ఆరాధిస్తూ, ప్రకృతిని కూడా కాపాడినట్లవుతుంది.

ఈ మార్పు కేవలం పండుగకే పరిమితం కాదు, భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పిద్దాం. పచ్చని జీవనశైలిని ఎంచుకోవడం, మట్టి విగ్రహాలను ఆరాధించడం ద్వారా మనం గణేష్ ఆరాధనతో పాటు ప్రకృతిని కూడా ఆరాధించినట్టు అవుతుంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎకో ఫ్రెండ్లీ గణనాథ విగ్రహాలు అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేస్తున్నారు. సహజరంగులతో అలంకరించబడినవి మాత్రమే కాకుండా కొన్ని విగ్రహాలు సీడ్స్ (విత్తనాలు) తో తయారవుతాయి. నిమజ్జనం తరువాత అవి మొక్కలుగా పెరిగి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేస్తాయి.
ఎక్కడ దొరుకుతాయి?
ఈ ఏడాది మీ ఇంటికి పర్యావరణహిత గణనాథుని ఆహ్వానించాలనుకుంటే, అమెజాన్‌లో మట్టి వినాయక విగ్రహాలు చాలా దొరుకుతున్నాయి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద కమ్యూనిటీ పండల్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. వారం ముందే బుక్ చేసుకుంటే … పండగ సమయానికి మన ఇంటికి మట్టి గణేష్ లు విచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం…
👉 [అమెజాన్‌లో ఎకో-ఫ్రెండ్లీ గణనాథ విగ్రహాలను చూడండి- క్లిక్ చేయండి )

ఈ వినాయక చవితి భక్తి, ఆనందంతో పాటు బాధ్యతగా జరుపుకుందాం. ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఎంచుకోవడం అంటే గణనాథుని మాత్రమే కాకుండా ఆయన సృష్టించిన ప్రకృతిని కూడా గౌరవించడం అని గుర్తించండి
గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా” అని ఆ విఘ్న నాయకుడిని తలుచుకుంటూ… ఈ ఏడాది మన ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడాలని వేడుకుందాం… . 🌿
[irp]




