గద్వాల సర్వేయర్ హత్యకేసులో సంచలన విషయాలు
గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడి కోసం భర్త తేజేశ్వర్ ను హత్యచేసిన ఘటనలో పోలీసుల కీలక విషయాలు బయటపెట్టారు. తేజేశ్వర్ ఐదు సార్లు ప్రాణగండం నుంచి తప్పించుకున్నన్నాడు.. కానీ ఆరోసారి మాత్రం హంతకుల బారినుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కేసులో భార్య ఐశ్వర్యదే కీ రోల్ గా పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో కొన్నేళ్లుగా ఐశ్వర్య అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలరావు ఓసారి ఐశ్వర్యను ఇంటికి కూడా తీసుకెళ్లాడు. మనకు పిల్లలు లేరు కదా.. ఐశ్వర్యను పెళ్లిచేసుకుంటానని భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు తిరుమలరావు భార్య ఒప్పుకోలేదు.
ఆ సమయంలో అక్కడ పెద్ద గొడవలే జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయానికే తేజేశ్వర్ తో నిశ్చితార్దం జరిగి .. రద్దు కూడా అయింది. అయితే తిరుమలరావుతో పెళ్లి సెట్ అవకపోవడంతో మళ్లీ తేజేశ్వర్ ను లైన్లో పెట్టింది ఐశ్వర్య. తమది పేద కుటుంబమని కట్నాలు ఇచ్చుకోలేమని అందుకే పెళ్లి రద్దు చేసుకున్నామని తేజేశ్వర్ కు మాయమాటలు చెప్పింది. దీంతో తేజేశ్వర్ తనకు ఎలాంటి కట్నం అవసరం లేదని ఆమెను పెళ్లిచేసుకుంటానని మాటిచ్చాడు. పెద్దవాళ్లు వద్దంటున్నా ఐశ్వర్యను పెళ్లిచేసుకున్నాడు. అయితే తేజేశ్వర్ తో పెళ్లైనా తిరుమలరావుతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఎలాగైనా తేజేశ్వర్ అడ్డు తొలగించుకొని నీ దగ్గరకి వచ్చేస్తానని తిరుమలరావుకు తెలిపింది ఐశ్వర్య. దీంతో కిల్లర్ గ్యాంగ్ కు రూ.75 వేలు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ హత్యకు పథకం వేసాడు తిరుమలరావు. ఒక స్థలానికి సర్వే చేయాలంటూ కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్ ను రమ్మని పిలిచారు. ఆ సమయంలో వాళ్లు వెళ్తున్న కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. సుపారీ గ్యాంగ్ కు ఐశ్వర్యనే లొకేషన్ తెలిసేలా చేసింది. కారులోనే తేజేశ్వర్ ను హతమార్చారు. కత్తితో గొంతుకోసి చంపి, మృతదేహాన్ని కవర్లో కట్టి, పాణ్యం సమీపంలోని గాలేరి నగర కాల్వ వద్ద పడేసారు హంతకులు. అంతకుముందు తేజేశ్వర్ మర్డర్ కు ప్లాన్ వేయగా తప్పించుకున్నాడు. కానీ ఆరోసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. భార్య క్రూరత్వానికి బలయ్యాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. తిరుమలరావు తన భార్యను కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు. ముందు తేజేశ్వర్ ను అడ్డుతప్పించి .. ఆ తర్వాత తన భార్యను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఈలోగా పోలీసులకు చిక్కాడు, తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో సహా, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్య చేసిన మనోజ్, సహకరించిన ఇద్దరు వ్యక్తులు, క్యాబ్ డ్రైవర్ , మధ్యవర్తిత్వం చేసిన ఒక వ్యక్తితో కలిపి 8 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Also read: విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?
Also read: భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !
Also read: కలెక్షన్లు కుమ్మేస్తున్న‘కుబేర’
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/