FOR ENGLISH VERSION : CLICK HERE
ఎన్నో ఏళ్లుగా బీమా కంపెనీలు, కస్టమర్లు కోరుతున్న జీఎస్‌టీ మినహాయింపు ఇప్పుడు నిజమైంది. ప్రభుత్వం అన్ని రకాల పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీలపై (Personal Insurance Policies) జీఎస్‌టీని సున్నా శాతం (0% GST) చేసింది. అంటే ఇకపై మనం ప్రీమియం చెల్లించేటప్పుడు అదనంగా పన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఇంతకాలం ప్రీమియం ఎక్కువే అనుకుని ఇన్సూరెన్స్ తీసుకోకుండా దూరంగా ఉన్న వాళ్లకు ఇది మంచి అవకాశం. ఇప్పుడు పన్ను భారమూ తగ్గింది కాబట్టి, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి అనుకోవాలి.
[irp posts=”4207″ ]
ఎందుకు ఇన్సూరెన్స్ ముఖ్యం?
- అనుకోని సంఘటనల్లో కుటుంబానికి అండగా నిలిచేది టర్మ్ ఇన్సూరెన్స్. (Term Insurance )
- ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్ద ఖర్చు తప్పించేది హెల్త్ ఇన్సూరెన్స్. (Health Insurance)
ఇప్పటికి చాలా మంది ఈ రెండు పాలసీలను ఆర్థిక ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్నారు. ఇక జీఎస్‌టీ మినహాయింపు తర్వాత మరింత లాభం పొందేలా ఇన్సూరెన్స్ రివ్యూ చేసుకోవడం మంచిది.
మనం దృష్టి పెట్టాల్సిన విషయాలు
- పాలసీ సెలక్షన్ (Policy Selection): మీ ఫ్యామిలీ సైజ్, ఆదాయం, ఆరోగ్య స్థితిని బట్టి పాలసీని ఎంచుకోండి.
- కంపెనీ పోలిక: ప్రీమియం తక్కువగా ఉందని ఎంచుకోకండి. క్లెయిం సెటిల్మెంట్ రేషియో చూసి నిర్ణయం తీసుకోండి. ఉదాహరణకు – ఒక కంపెనీ 95% క్లెయింలు చెల్లిస్తే, ఇంకో కంపెనీ 80% మాత్రమే చెల్లిస్తే, కాస్త ఎక్కువ ప్రీమియం అయినా 95% కంపెనీనే మంచిది.
- ఇప్పటికే ఉన్న పాలసీ: మీరు ఇంతవరకు చెల్లిస్తున్న ప్రీమియం జీఎస్‌టీతో కలిపి ఎంత? ఇప్పుడు ఎంత అవుతుంది? ఉదాహరణకి – మీరు రూ.40,000 ప్రీమియం చెల్లించేవారు. దానికి 18% జీఎస్‌టీ కలిపి రూ.47,200 అవుతుండేది. ఇకపై జీఎస్‌టీ ఉండదు కాబట్టి కేవలం రూ.40,000 చెల్లిస్తే సరిపోతుంది.
- పాలసీ విలువ పెంపు: ఆదా అయిన పన్నుతో పాలసీ కవరేజ్ పెంచుకోవచ్చు. ఉదాహరణకి – రూ.50 లక్షల పాలసీ ఉన్నవారు, ఇప్పుడు అదే ప్రీమియంతో రూ.75 లక్షలకు పెంచుకోవచ్చు.
- హెల్త్ ఇన్సూరెన్స్‌లో లాభం: సాధారణంగా రూ.5 లక్షల పాలసీ నుంచి రూ.10 లక్షల పాలసీకి వెళ్ళాలంటే కేవలం రూ.3,000 అదనంగా పెట్టాలి. ఇక జీఎస్‌టీ మినహాయింపు వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ విలువ గల పాలసీ పొందవచ్చు.
ఒక చిన్న టిప్
మీ పాలసీ రిన్యువల్ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీని ఒకసారి సంప్రదించి కొత్త లాభాలు, పెరిగిన కవరేజ్ గురించి అడగండి. అప్పుడే మీకు స్పష్టంగా ఎంత అదనపు బెనిఫిట్ వస్తుందో తెలుస్తుంది.
👉 మొత్తంగా, జీఎస్‌టీ మినహాయింపు వల్ల ఇన్సూరెన్స్ ఇక భారమనే భావన పోయింది. ఇప్పుడు ఇది మనకు కవర్ & సెక్యూరిటీ పెరిగే మంచి ఛాన్స్.
Read also : క్రిప్టో కరెన్సీకి క్యూఆర్ కోడ్ : సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్



