ఆరోగ్య బీమా (Health policy) ఎంత అవసరమో మొన్నటి కోవిడ్ పరిస్థితులు చూశాక ప్రతి ఒక్కరికీ అర్థమైంది. లక్షల రూపాయలు హాస్పిటల్స్ కి పోయలేక ఎందరో మధ్యతరగతి, పేదల ప్రాణాలు పోయాయి. హాస్పిటల్ బిల్లులకు ఆస్తులు అమ్ముకొని చాలా మంది రోడ్డున పడ్డారు. అందుకే కోవిడ్ తర్వాత చాలామందిలో Health policiesపై బాగా అవగాహన పెరిగింది. కానీ ఈమధ్య రెగ్యులర్ బీమా పాలసీల కంటే భిన్నంగా Desease specific insurance polices కూడా వచ్చాయి. ఆరోగ్య బీమా ఎంతవరకూ అవసరం ? ఈ కొత్త స్పెసిఫిక్ పాలసీలు ఎంతవరకూ ఉపయోగపడతాయో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న “తెలుగు వర్డ్” Telegram group లో జాయిన్ అవ్వండి.
Click here : Telugu Word Telegram Link
5 లక్షల పాలసీ ఓకేనా ?
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు…చాలామంది దాదాపు 5 లక్షల రూపాయల కవరేజీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 లక్షలు ఏ మూలకూ రావని… గత కొన్నేళ్ళుగా పెరిగిన వైద్య ఖర్చులను బట్టి తెలుస్తోంది. గుండెపోటు లాంటివి వచ్చి సర్జరీలు చేయాల్సి వస్తే… పేషెంట్ హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఈజీగా ఖర్చవుతున్నాయి. మనకు 5 లక్షల పాలసీయే ఉంటే… మిగతా 10 లక్షలు చేతి నుంచి కట్టుకోవాల్సిందే. చాలా మందికి గతం కంటే ఆదాయంలో ఏ మాత్రం పెరుగుదల ఉండటం లేదు. ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కుటుంబ బడ్జెట్ తలకిందులు అవుతోంది. అందుకే ఈమధ్య రెగ్యులర్ బీమా పాలసీలే కాకుండా Desease specific insurance polices వచ్చాయి. క్యాన్సర్ కేర్, కార్డియాక్ కేర్, డయాబెటిక్ కేర్ ఇలా రకరకాల పాలసీలు వచ్చాయి.
ఇది కూడా చదవండి : Home Loan Top up తీసుకుంటున్నారా ?
కాంప్రహెన్సివ్ బీమా సరిపోదు !
జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఫ్యామిలీ కాంప్రహెన్షివ్ హెల్త్ పాలసీ తీసుకోమని చెబుతుంటారు. ఇలాంటి ఫస్ట్ టైమ్ హెల్త్ ఇష్యూ వచ్చినంత వరకూ ఓకే. ఒకవేళ అది క్రిటికల్ అయి హార్ట్ బైపాస్ సర్జరీ లేదంటే యాంజియా లాంటివి ఎదురైతే కాంప్రమెన్సివ్ బీమాతో ఉపయోగం ఉండదు. ఇలాంటి సమస్యలు వస్తే… ఏదో ఒకటి, రెండు సార్లు హాస్పిటల్ కి వెళ్ళిరావడం కాదు… తరుచుగా వెళ్ళాల్సి వస్తుంది. దాంతో ప్రీమియం కంటే క్లెయిమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి : PAN 2.0: పాన్ కార్డ్ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?
ఏంటీ స్పెసిఫిక్ పాలసీలు ?
ప్రస్తుతం డిసీజ్ స్పెసిఫిక్ పాలసీలకు ప్రాధాన్యత పెరిగింది. ఇవి బీమా తీసుకునే వ్యక్తులకు ఉండే నిర్ధిష్ట అనారోగ్య సమస్యలకు సంబంధించినవి. అంటే క్యాన్సర్ కేర్, కార్డియాక్ కేర్, డయాబెటిక్ కేర్ లాంటివి. ఇవి కవర్ అవ్వాలంటే సాధారణ ఆరోగ్య పాలసీలు పనికిరావు. ఉదాహరణకు Cardiac Specific Policy లాంటివి తీసుకుంటే పేస్ మేకర్స్, గుండె మార్పిడి లాంటి వాటిని కవర్ చేస్తారు. అందుకే క్రిటికల్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు కాంప్రహెన్సివ్ పాలసీలతో పాటు స్పెసిఫిక్ పాలసీలు లేదంటే క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ ను జతచేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకసారి ఇలాంటి సమస్యలు వస్తే… బీమా కంపెనీలు అంత తొందరగా పాలసీని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు.
స్పెసిఫిక్ పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ ఎంత ?
సాధారణంగా Health Policies తీసుకుంటే Pre existing conditions కవరేజ్ చేయడానికి 3 యేళ్ళ టైమ్ ఇస్తారు. అంటే అప్పటికే ఉన్న వ్యాధులకు 3 యేళ్ళ తర్వాతే క్లెయిమ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. అయితే Cardiac care లాంటివి తీసుకుంటే 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తో ప్రీమియంను యాక్సెప్ట్ చేస్తారు. అంటే Hearth problems ఉన్నవాళ్ళు పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాత ఏదైనా సమస్య వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే కార్డియాక్ కేర్ పాలసీని అంత ఈజీగా కంపెనీలు ఆమోదించవు. కొన్ని ఆంక్షలు పెట్టే ఛాన్సుంది. పాలసీ తీసుకునేటప్పుడు ఆ కండీషన్స్ క్షుణ్ణంగా చదువుకోవడం లేదంటే వాటి గురించి తెలుసుకున్నాకే జాయిన్ అవ్వాలి. సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీతో పోలిస్తే కార్డియాక్ కేర్ పాలసీ ప్రీమియం కూడా 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఏ పాలసీలు బెటర్ ?
ఎలాంటి Health problems లేని వాళ్ళు Comprehensive పాలసీ తీసుకుంటే సరిపోతుంది. కానీ వీటికి Critical illness raider లేదంటే Topup policy లాంటివి కూడా యాడ్ చేసుకోవాలి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్ లో ఉండేవాళ్ళు 15 నుంచి 20 లక్షల కవరేజ్ పాలసీలు తీసుకోవాల్సిందే. చిన్న పట్టణాల్లో రూ.10 లక్షలు కవర్ అయ్యే ఆరోగ్య బీమా సరిపోతుంది.
స్పెసిఫిక్ పాలసీలు ఇచ్చే కంపెనీలేవి ?
Star Health, Aditya Birla, HDFC Ergo General, ICICI Lombard, Niva Bupa, Care Health, TATA AIG General లాంటి సంస్థలు స్పెసిఫిక్ పాలసీలను అందిస్తున్నాయి. ఇలాంటి Desease specific insurance policyకి 45యేళ్ళు ఉన్నవారికి హైదరాబాద్ లాంటి చోట్ల 5 లక్షల కవరేజ్ కి 19 వేల రూపాయల దాకా ప్రీమయం ఉంది. (IRDAI website)
హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు ఇవి మస్ట్
ఆరోగ్య బీమాలో పాలసీలు తీసుకునేవారు తప్పనిసరిగా తమకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దాచిపెట్టకుండా బీమా సంస్థలకు చెప్పాలి. ఒకవేళ మీరు దాచిపెడితే ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక… అది pre existing desease అని తెలిస్తే పాలసీని తిరస్కరించే అవకాశం ఉంది. అప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఏదైనా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి.
👉 ఆ పాలసీకి Pre existing desease వెయిటింగ్ పీరియడ్ ఎంతకాలం ?
👉 Hearth care పాలసీ అయితే వేటికి కవరేజ్ ఇస్తారు… వేటికి ఉండదు తెలుసుకోవాలి
👉 మీరు తీసుకునే పాలసీ కంపెనీ కింద Network Hospitals List చూడండి. మీకు దగ్గర్లో హాస్పిటల్స్ ఉన్నాయా ?
👉 Cashless ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి ? Room rent, Sub limits ఎంతవరకూ ఉన్నాయి?
👉 ప్రీమియం కాస్త ఎక్కువైనా వీలైనంతలో 5 లక్షలకు మించి పాలసీ తీసుకోవాలి. మినిమం 10 నుంచి 20 లక్షల పాలసీ కవరేజ్ ఉంటే బెటర్.
👉 మీరు తీసుకునే Health Policy లైఫ్ లాంగ్ కవరేజ్ ఉందా ?
👉 Annual health checkupsకి అవకాశం ఉందా ?
👉 కొన్ని బీమా సంస్థలు Hospital ఖర్చులతో పాటు గుండెకు సంబంధించి అంటే Valve replacement, Angia plasty, Bypass surgery లాంటివి కవరేజీ కోసం… పాలసీ మొత్తం కాస్త ఎక్కువ తీసుకొని ఇస్తాయి. అలాంటి ఛాన్స్ ఉందేమో అడిగి చూడండి.
(ఈ ఆర్టికల్ నిపుణుల సలహాలు తీసుకొని ఇచ్చాం. ఇది కేవలం అవగాహన కోసమే. పాలసీల విషయంలో మీరు పర్సనల్ గా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి )