ఇల్లు కొని ఆరు ఏడు యేళ్ళ అవగానే… మనం Housing Loan EMIలు సక్రమంగా కడుతుంటే… ఇక బ్యాంకుల నుంచి తెగ ఫోన్లు వస్తుంటాయి. మీకు Top up Loan ఇస్తాం తీసుకోండి అంటూ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తుంటారు. నిజంగా అవసరం లేకున్నా… చాలా మంది ఇంటి రిపేర్ల పేరుతో అదనంగా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు Home Loan Top up తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
ప్రస్తుతం వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే కొత్త ఇళ్ల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. గత అక్టోబర్ లో 20శాతం మేరకు రిజిస్ట్రేషన్లు పెరిగినా అవి బ్యాంకుల వ్యాపారానికి ఏ మాత్రం సరిపోలేదు. అంటే ఇంటి రుణాలు తీసుకునేవారు ముందుకు రావట్లేదు. దాంతో పాత కస్టమర్లు… అంటే ఇప్పటికే Home Loan తీసుకున్న వాళ్ళల్లో Top upకి అర్హత ఉంటే ఎంతో కొంత అమౌంట్ ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు. Housing Loan తీసుకొని కనీసం 2 లేదా 3 యేళ్ళు దాటిని వారికి మాత్రమే బ్యాంకులు Top up Loans ఇస్తుంటాయి. మీరు Home Loan తీసుకునేటప్పటికీ… ఇప్పటికీ ఇంటి విలువ ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. దానికి తోడు మీ Income కూడా కొద్దో గొప్పో పెరిగే ఉంటుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని బ్యాంకులు, Housing loans ఇచ్చే సంస్థలు మీకు Top up ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి.
మీ లోన్ పీరియడ్ లోపే తీర్చాలి
సాధారణంగా బ్యాంకులు Housing Top up Loans ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు పాటిస్తాయి. గతంలో మీరు లోన్ తీసుకున్న పీరియడ్ లోపే ఈ కొత్త టాపప్ లోన్ కూడా తీర్చేలా EMIలో కలుపుతాయి. అంటే మీరు ఇంకా 10 లేదా 15 యేళ్ళు Home Loan EMI చెల్లించాల్సి ఉంటే, దానికి తగ్గట్టుగా (అంతే వ్యవధికి) లోన్ ఇస్తాయి. ఈ టాప్ అప్ లోన్ మొత్తం కూడా తక్కువగా ఉంటే వారంలోనే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. కొంచెం ఎక్కువైతే 2, 3 వారాల్లోనే క్లియర్ చేస్తుంటాయి బ్యాంకులు.
అదనపు వడ్డీ బాదుడు
టాప్ అప్ లోన్ ఇస్తామని బ్యాంకులు కాల్ చేయగానే వడ్డీ ఎంత తీసుకుంటారో ముందే ఎంక్వైరీ చేయండి. Home Lona interest rate తో పోలిస్తే వీటికి కొంచెం వడ్డీరేటు ఎక్కువే ఉంటుంది. కొన్ని బ్యాంకులు గతంలో రుణానికి టాపప్ లోన్ మీద ఒక శాతం అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అయితే ఓ రకంగా చెప్పాలంటే… పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు, Gold Loansతో పోలిస్తే ఈ Home Loan Top up వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. మీకు వేర్వేరు చోట్ల రుణాలు ఉంటే… వాటిని మొత్తాన్ని తీర్చుకోడానికి ఈ టాపప్ లోన్ ను ఉపయోగించుకోవచ్చు.
Read also :Real Estate : ఆ ఏరియాలో రియల్ బూమ్… ఫ్యూచర్ సిటీ చుట్టూ ఫుల్ డిమాండ్ !
మళ్ళీ డాక్యుమెంట్స్ అవసరం లేదు
మీరు బ్యాంకులో Home Loan తీసుకునేటప్పడు ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తీసుకుంటాయి. అందువల్ల ఇప్పుడు టాపప్ కోసం పెద్దగా ఏవీ అడగరు. బ్యాంక్ శాలరీ స్టేట్ మెంట్, శాలరీ స్లిప్ లాంటివి కొన్ని మాత్రమే అడిగే ఛాన్సుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే…Home Loan EMI ఇంకా ఏడేళ్లకన్నా తక్కువ ఉంటే… మీకు టాపప్ మొత్తాన్ని భారీగానే బ్యాంకులు శాంక్షన్ చేస్తాయి.
బడ్జెట్ చూసుకుంటున్నారా ?
లోన్ వస్తుంది తీసుకుంటున్నాం అనే భావనతో ఉండకుండా… కొత్తగా తీసుకునే ఈ లోన్ పై EMI ఎంత పడుతుంది. దాంతో మన బడ్జెట్ మీద ఎంత వరకూ ప్రభావం చూపిస్తుందో బేరీజు వేసుకోవాలి. మీకు నిజంగా ఆ అమౌంట్ తో అవసరం ఉందని అనుకుంటేనే Top up Loan తీసుకోండి. ఏవో తాత్కాలిక ఖర్చుల కోసం తీసుకుంటే… లాంగ్ స్డాండింగ్ లో ఆ అమౌంట్ కి వడ్డీ భరించాలన్న సంగతి మర్చిపోకండి.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసమో… లేదంటే అధిక నష్ట భయం ఉన్న పథకాల్లో పెట్టుబడులు పెట్టి, ఫుల్లుగా లాభాలు సంపాదించవచ్చు అన్న ఆలోచనలతో లోన్ తీసుకోవద్దు. పరిస్థితులు తలకిందులై నష్టపోతే మీ మీద అప్పులు భారం పడే ఛాన్సుంది.
ఇంతకుముందు చెప్పినట్టు ఇంటి రిపేర్ల కోసం, ఇతర అవసరాల కోసం ఈ టాపప్ లోన్లను బ్యాంకులు ఇస్తాయి. వాటిని మీరు ఇంటి పనులతో పాటు దేనికి వాడుకుంటామన్న దానిపై క్లారిటీ ఉండాలి. మీరు Home Loan Top up తీసుకునేటప్పుడే ఆ మొత్తాన్ని ఎలా వాడుకుంటాం… దేనికి ఎంత కేటాయించాలి… దాని వల్ల మన అప్పులు తీరుతాయా… ఇలాంటి అంశాలను ముందే చర్చించుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటిస్తే బెటర్.
మీరు టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళడానికో, ఏవైనా లగ్జరీ వస్తువులు కొనడానికో Home Loan Top ups ని వాడుకోవద్దని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటికి కావాలంటే పర్సనల్ లోన్స్ లాంటివి తీసుకోవాలి. అప్పుడు తొందరగా EMI తీర్చే ఛాన్సుంటుంది. అంతే తప్ప మళ్ళీ 10, 15 యేళ్ళ అసలు, వడ్డీ తీర్చే పరిస్థితిని తెచ్చుకోవద్దు.
Telugu word website లో ఇలాంటి మంచి ఆర్టికల్స్ మీరు పొందాలంటే ఈ కింద లింక్ ద్వారా Telegram Group లో జాయిన్ అవ్వండి.
Telugu word Telegram Link https://t.me/teluguwordnews