ప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ దిగొచ్చింది. సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50వేలు ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. బ్యాంక్ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మినిమమ్ బ్యాలెన్స్ ను సవరించింది. మెట్రో/ అర్బన్ అకౌంట్ హోల్డర్స్ రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ ఉండాలి. సెమీ అర్బన్ ఏరియాల్లో రూ.7,500 ఉండాలని రూల్స్ సవరించింది. రూరల్ కస్టమర్స్ గతంలో లాగే రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుందని ఐసీఐసీఐ తెలిపింది.
ఐసీఐసీఐ ఈమధ్య సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాలంటూ రూల్ పెట్టడంతో ఖాతాదారులు షాక్ అయ్యారు. ఈ ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే వర్తిస్తుందని తెలిపింది. కానీ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లకు రూ50 వేలకు పెంచింది. గతంలో ఈ అమౌంట్ రూ.10 వేలు మాత్రమే. సెమీ అర్బన్ ఖాతాదార్లకు రూ.5 వేల నుంచి ఒక్కసారిగా రూ.25 వేలకు పెంచింది. రూరల్ కస్టమర్లకు రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచింది. బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహణ విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. కానీ జనం నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో ఈ మినిమమ్ బ్యాలెన్సులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ అకౌంట్స్ లో కనీస నిల్వ లేకపోతే విధించే ఫైన్స్ ను ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా ఎత్తివేశాయి. కానీ ఐసీఐసీఐ ఓవరాక్షన్ తో ప్రస్తుతం కొనసాగుతున్న ఖాతాదారులు కూడా భయపడ్డారు. తమ అకౌంట్స్ రద్దు చేసుకోడానికి రెడీ అవడంతో, బ్యాంక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Read also : కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025: లోక్‌సభలో ఆమోదం.. కీలక మార్పులు ఏమిటి?
Read also : 2025 శ్రీకృష్ణ జన్మాష్టమి – ఈసారి ఎందుకంత స్పెషల్?
Read also : Vivo V60 Launched in India: Premium Mid-Range Smartphone