Telugu Word

iPhoneలో బుక్ చేస్తే బాదుడే 😢!

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కంటే iPhone లో షాపింగ్ చేసినా… క్యాబ్స్ బుక్స్ చేసినా అధిక ఛార్జీలు వసూలు చేస్తారా ? ఇది నిజమేనా ? గత వారం రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. కొందరు ప్రాక్టికల్ గా నిరూపిస్తుండటంతో… అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. Android, iPhone రేట్ల వివక్షపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Iphone

ఈకామర్స్ వెబ్ సైట్స్, యాప్స్ తో పాటు… ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ సర్వీసులకు iPhone నుంచి కొనుగోళ్ళు, బుకింగ్స్ చేస్తే Android మొబైల్ యూజర్ల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈమధ్య చెన్నైకి చెందిన కొందరు …ఉబర్ క్యాబ్ సర్వీస్ కోసం… ఆండ్రాయిడ్, ఐఫోన్లను పక్క పక్కన పెట్టి… బుకింగ్ చేస్తే… అందులో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కంటే iPhone నుంచి చేసిన బుకింగ్ కి 50 రూపాయలు అదనంగా చూపించింది. వీటిని ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై కొందరు influencers రీల్స్ కూడా చేయడంతో ఈ టాపిక్ పై చర్చ తీవ్రంగా సాగుతోంది. స్విగ్గీ, ఉబర్, ఫ్లిప్ కార్ట్ లో కొనుగోళ్ళ విషయంలోనూ ఈ వివక్ష కనిపించిందంటూ X లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు… కొత్త ఏడాది సందర్భంగా హోటల్ రూమ్స్ బుకింగ్స్ విషయంలోనూ ఈ ధరల తేడా కనిపించిందని కొందరు ఆరోపిస్తున్నారు. 20శాతం తేడా వచ్చిందని అంటున్నారు. నెటిజన్లు పెడుతున్న వీడియోలు, ఫోటోలు, పోస్టులను లక్షల మంది చూస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.

ఫోన్ ఆధారంగా ధరలను నిర్ణయించడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. చాలామందికి iPhone కొనుక్కోవడం డ్రీమ్. స్టూడెంట్స్, నిరుద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మధ్యతరగతి జనం కూడా EMIలు, అప్పులు చేసి మరీ iPhones కొనుక్కుంటున్నారు. అంతమాత్రాన వాళ్ళందర్నీ ధనికుల కోటాలో వేస్తే ఎలా ? అసలు మొబైల్ ఫోన్ల వాడకం ఆధారంగా ధరలు నిర్ణయించడమేంటి ? దీనిపై చట్టాలు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు.

ఆల్గారిథమ్స్ తో బురిడీ

మనం ఇంటర్నెట్ లేదా ఏదైనా ఈ-కామర్స్ యాప్స్ లో ఏదైనా వస్తువు కొందామని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత నుంచి మనం ఏ యాప్ లేదా వెబ్ సైట్ ఓపెన్ చేసినా… గతంలో సెర్చ్ చేసిన వస్తువులే కనిపిస్తాయి. అంటే మనం ఆ వస్తువు కొనడానికి ఇంట్రెస్ట్ గా ఉండటంతో వాటినే ఎక్కువ చూపిస్తుంటాయి. ఇది లేటెస్ట్ కంప్యూటర్ ఆల్గారిథమ్స్, బ్రౌజింగ్ హిస్టరీ, AI ద్వారానే సాధ్యమవుతోంది. ఇదే పద్దతిలో ఇప్పుడు Android, iPhone వివక్ష కూడా మొదలైందన్న ఆరోపణలు వస్తున్నాయి.

చట్టాలు ఏం చెబుతున్నాయి ?

Android, iPhone వాడకం ద్వారా రేట్లు వసూలు చేయడం అనేది unfair trade practice కిందకి వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. జనరల్ గా packed item కి వేర్వేరు ధరలు పెట్టడం అనేది లీగల్ మెట్రాలజీ చట్టాల ప్రకారం నేరం. కానీ మనకు సప్లయ్ చేసే ఈ-కామర్స్ సంస్థలు గానీ, క్యాబ్ సర్వీస్ యాప్స్ గానీ… సర్వీస్ సెక్టార్ కిందకు వస్తాయి. సో ఇది చట్టం పరిధిలోకి రాదని వాదించే వారూ ఉన్నారు.
ఆండ్రాయిడ్, iPhone వినియోగదారులకు వేర్వేరు రేట్లు వసూలు చేసే ఈ పద్దతిపై ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: ఇండియాలోకి చైనా వైరస్

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Exit mobile version