ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి… పవన్ కల్యాణ్ పుణ్యమా అని
NDA తో పొత్తు పెట్టుకుంది… బీజేపీని కలుపుకుపోయి పవర్ లోకి వచ్చింది…
కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు…
అధికారంలో ఉన్నప్పుడు NDA కు సపోర్ట్ చేసినా….
పవర్ దిగిన తర్వాత…. NDA టీడీపీతో అలయెన్స్ అవడం…
మొన్నటిదాకా NDA కి సపోర్ట్ చేశావ్ కదా… మాతో మీకేం పని
ఇండియా కూటమి కూడా జగన్ దూరం పెట్టింది…
దేశంలో ఏవో కొన్ని పార్టీలు తప్ప… దాదాపు అన్ని పార్టీలు
NDA or ఇండియా కూటమి… ఎవరో ఒకరి పొత్తుతో కంటిన్యూ అవుతున్నాయి.
కానీ వైసీపీకి ఎటు పోవాలో తెలీయని పరిస్థితి ఉంది…
ఇప్పుడు కష్ట కాలంలో ఎవరు అండగా నిలబడతారో అర్థం కాని పరిస్థితి ఉంది…
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
మద్యం కుంభకోణం కేసులో కీలక నేతలంతా అరెస్టవుతున్నారు…
జగన్ చుట్టూ ఉన్న లీడర్లు ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నారు.
ఇంత కష్ట కాలంలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో
ఏ ఇతర రాజకీయ పార్టీల నుంచి సహకారం అందడం లేదు..
జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఇచ్చే పార్టీలు కనిపించడం లేదు.
దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇలాంటి కష్ట కాలంలో అండగా నిలిచే రాజకీయ పార్టీలు లేకపోవడం YSR CP లోటే అనుకోవాలి.
ఏపీలో అధికార పార్టీగా టీడీపీ కూటమి ఉంది.
ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అవుతోంది.
అయితే కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉన్నాయి.
ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసుల్లో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు.
త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది.
కానీ ఒక్కరంటే ఒక్క వామపక్ష నేత.. కాంగ్రెస్ పార్టీ నేత మద్యం స్కామ్
కేసులో అక్రమ అరెస్టులు అని ఆరోపించడం లేదు.
పైగా వైసీపీ హయాంలో ఖచ్చితంగా మద్యం స్కామ్ జరిగే ఉంటుందని
ఎక్కువ మంది అనుమానిస్తూ మాట్లాడుతున్నారు.
దీంతో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల సహకారం లేదని తేలిపోయింది.
భవిష్యత్తులో కూడా అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయన్న ఆశలేదు.
జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉందో తెలియట్లేదు.
ఏదైనా పార్టీ మద్దతు తీసుకుందామా అంటే…
మొన్నటిదాకా జాతీయ వ్యవహారాలను చక్కబెట్టింది విజయసాయిరెడ్డి.
జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డియే ఎక్కువగా జాతీయ పార్టీ నేతలతో టచ్ లో ఉండేవారు.
ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
వైయస్సార్ కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా మారారు.
ఇలాంటి కష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డికి
జాతీయ స్థాయిలో అండగా నిలిచేవారు లేకుండా పోయారు.
పైగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారన్న కోపం…
ఆ పార్టీ హై కమాండ్ లో ఉంది.
అందుకే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్.
కేసులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయితే అంతిమంగా
వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తారన్నది హై కమాండ్ అభిప్రాయంగా ఉంది.
తెలుగుదేశం ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది.
చంద్రబాబుపై జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సానుకూలత ఉంది.
చంద్రబాబు గతంలో జాతీయస్థాయిలో చాలా రాజకీయ పార్టీలతో కలిసి పని చేశారు.
అందుకే ఆయన బిజెపితో చేతులు కలిపినా….
జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు మాత్రం చంద్రబాబు విషయంలో ఎలాంటి విమర్శలు చేసే అవకాశం లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు స్థాయిలో జాతీయ పార్టీలతో పరిచయాలు లేవు
ఇటు ఏపీలోనూ తోటి పార్టీలతో సఖ్యత లేకపోవడంతో
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మీ ఒపీనియన్ తెలియజేయండి
Also read: కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు ?మహిళలకీ ఛాన్స్ ?
Also read: మల్కాజ్ గిరిలో పొలిటికల్ గేమ్ ?
Also read: కేసీఆర్, కేటీఆర్ లకు కవిత పోరు ఇంతింత కాదయా