-
ఉత్తరాది లేదా దక్షిణాది ?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జులై 21న అనారోగ్య కారణాలతో
తన పదవికి రాజీనామా చేశారు,
దీంతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఊహించని విధంగా ఖాళీ అయింది.
ఈ రాజీనామా మానసూన్ సమావేశాల మొదటి రోజు సంచలనాత్మకంగా జరిగింది,
ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ధన్‌ఖడ్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు…
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఊహాగానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ధన్‌ఖడ్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు
జగదీప్ ధన్‌ఖడ్ 74 ఏళ్ల వయస్సులో, 2022 ఆగస్టు నుంచి ఉపరాష్ట్రపతిగా,
రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, ఆయన రాజీనామా అనారోగ్య కారణాలతో అని చెప్పినా
దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
అందులో ఒకటి
జస్టిస్ యశ్వంత్ వర్మ అభిసంశన వివాదం: జులై 21న, రాజ్యసభలో 63 మంది ప్రతిపక్ష ఎంపీలు అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిసంశన కోరుతూ ఒక నోటీసును సమర్పించారు,
దీనిని ధన్‌ఖడ్ ఒప్పుకున్నారు.
ఈ నోటీసు జస్టిస్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోడానికి సంబంధించినది.
అదే విషయంలో లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూడా
152 మంది ఎంపీల సంతకాలతో ఒక బైపార్టిసన్ తీర్మానాన్ని సిద్ధం చేసింది.
కానీ ధన్‌ఖడ్ ప్రతిపక్ష నోటీసును వెంటనే ఒప్పుకోవడం అనేది
NDA కు ఇబ్బందిగా మారింది. అదే ధన్‌ఖడ్ పై కోపానికి దారితీసిందని సమాచారం.
ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వాదనలు:
రాజ్యసభలో ప్రతిపక్ష లీడర్ మల్లికార్జున్ ఖర్గే, పహల్గాం ఉగ్రవాద దాడి,
భద్రతా వైఫల్యంపై సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ చర్చ ధన్‌ఖడ్ అనుమతితోనే జరిగింది,
ఇది బీజేపీ నాయకత్వానికి నచ్చలేదని తెలుస్తోంది.
ఈ సంఘటన కూడా ధన్‌ఖర్‌పై అసంతృప్తికి ఒక కారణంగా చెప్పబడుతోంది.
బీజేపీ, ఎన్‌డీఏలో అసంతృప్తి:
ధన్‌ఖడ్ రాజ్యసభ ఛైర్మన్‌గా తన విధానాలు,
న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలు, ప్రతిపక్షంతో తలెత్తిన వివాదాలు,
బీజేపీ నాయకత్వాన్ని ఇబ్బందిపెట్టాయి.
జస్టిస్ వర్మ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం,
ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసిన చర్యగా భావించాురు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో బీజేపీ నాయకులు జేపీ నడ్డా, కిరెన్ రిజిజు గైర్హాజరు కావడం, ధన్‌ఖడ్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కనిపించింది.
ఈ సంఘటనలు ధన్‌ఖర్‌ను రాజీనామాకు ప్రేరేపించాయని ఊహాగానాలు నడుస్తున్నాయి.
అనారోగ్యం ఒక సాకు మాత్రమేనా?:
ధన్‌ఖడ్ గత మార్చిలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు,
కానీ ఆ తర్వాత ఆయన తన విధులను సాధారణంగా నిర్వహించారు.
రాజీనామా రోజు కూడా ఆయన రాజ్యసభ సమావేశాలను నడిపించారు
జైపూర్ పర్యటనకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు.
అనారోగ్యం కేవలం ఒక కారణంగా చెప్పారని,
నిజానికి రాజకీయ ఒత్తిళ్లే రాజీనామాకు కారణమని ప్రతిపక్ష నాయకులు జైరామ్ రమేష్, ప్రియాంక చతుర్వేది వంటి వారు వాదిస్తున్నారు.
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక:
ధన్‌ఖడ్ రాజీనామాతో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారం,
సాధ్యమైనంత త్వరలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి.
ఈ ఎన్నిక సెప్టెంబర్ 19 లోపు పూర్తి కావాలి
ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియకు తేదీని ప్రకటిస్తుంది.
ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది,
ఇందులో నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు.
ఈ ఎన్నిక సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు (STV) విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది.
ఎలక్టోరల్ బలం
ప్రస్తుతం, లోక్‌సభలో 542 మంది సభ్యులు (ఒక సీటు ఖాళీగా ఉంది),
రాజ్యసభలో 240 మంది సభ్యులు (5 సీట్లు ఖాళీ) ఉన్నారు,
మొత్తం 786 మంది ఎలక్టోరల్ కాలేజీలో ఓటింగ్‌లో పాల్గొంటారు.
గెలవడానికి అవసరమైన కోటా 394 ఓట్లు.
NDAకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 మంది సభ్యులు ఉన్నారు,
అంటే మొత్తం 422 ఓట్లు, ఇది కోటా కంటే ఎక్కువ.
కాబట్టి, ఎన్‌డీఏ అభ్యర్థి గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అభ్యర్థులు ఎవరు…
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ అభ్యర్థి ఎవరై ఉంటారన్న ఊహాగానాలు ఇలా ఉన్నాయి:
ఉత్తరాది అభ్యర్థులు:
నితీష్ కుమార్: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ లీడర్ నితీష్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది.
బీహార్‌లో రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి…
నితీష్‌ను ఉపరాష్ట్రపతిగా నియమించడం ద్వారా NDA రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని భావిస్తోంది.
హరివంశ్ నారాయణ్ సింగ్: ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ లీడర్ హరివంశ్ కూడా ఒక బలమైన అభ్యర్థి
ఆయన ఇప్పటికే రాజ్యసభను నడిపే అనుభవం కలిగి ఉండటం ఒక ప్లస్ పాయింట్.
జేపీ నడ్డా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన స్థానంలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.
దక్షిణాది అభ్యర్థులు:
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాది నుంచి ఒకరిని నియమిస్తే,
ఉపరాష్ట్రపతి పదవి ఉత్తరాది అభ్యర్థికి ఇచ్చే ఛాన్సుంది
నితీష్ కుమార్ ఒప్పుకోకపోతే, దక్షిణాది నుంచి అభ్యర్థులకు ఛాన్స్ ఉంటుంది.
ఉదాహరణకు, కేసీఆర్ (తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి) పేరు కూడా ఊహాగానాల్లో ఉంది,
బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
నేనైతే నమ్మడం లేదు… BRS విలీనం అవుతుందని అనుకోవడం లేదు…
ఏమో ఏదైనా జరగొచ్చు… చూడాలి
మహిళా అభ్యర్థులు:
రాబోయే మహిళా రిజర్వేషన్ బిల్లు (30% మహిళల కోటా)
అమలుల్లోకి వస్తుండటంతో
మహిళా అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి)
పురంధేశ్వరి (బీజేపీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్) పేర్లు చర్చలో ఉన్నాయి.
ఈ అభ్యర్థులు దక్షిణాది నుంచి కావడం వల్ల,
NDA దక్షిణాది రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
అనూహ్య అభ్యర్థి: కొన్ని ఊహాగానాల ప్రకారం, ప్రతిపక్షాలను ఆకర్షించడానికి బీజేపీ శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ) వంటి వారిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు.
ఆయన ఇటీవల బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు.
జరిగే అవకాశం కూడా లేకపోలేదు.
ఉత్తరాది లేదా దక్షిణాది?
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాది నుంచి ఒకరిని నియమిస్తే,
ఉపరాష్ట్రపతి పదవి ఉత్తరాది లీడర్ కి ఇస్తారు.
నితీష్ కుమార్ లేదా హరివంశ్.
ఒకవేళ బీజేపీ అధ్యక్ష పదవి ఉత్తరాది లీడర్ కి ఇస్తే,
దక్షిణాది నుంచి నిర్మలా సీతారామన్ లేదా పురంధేశ్వరి లాంటి వారికి అవకాశం ఉండవచ్చు.
ఈ నిర్ణయం NDA రాజకీయ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది,
బీహార్ ఎన్నికలు, దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకునే NDA వ్యవహరిస్తుందని అంటున్నారు.
Also read: మల్కాజ్ గిరిలో పొలిటికల్ గేమ్ ?
Also read: కేసీఆర్, కేటీఆర్ లకు కవిత పోరు ఇంతింత కాదయా
Also read: ఫిష్ వెంకట్ కథ: మనందరికీ గుణపాఠం