Site icon Telugu Word

తాగి బండి నడుపుతావా ? మైండ్ ఉందా ?: జాన్వీ క‌పూర్ ఫైర్

ఈ మ‌ధ్య మ‌ద్యం మ‌త్తులో ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి మ‌నం చూస్తూనే ఉన్నాం. పురుషులతో పాటు మ‌హిళ‌లు కూడా మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ని న‌డుపుతూ ప‌లువురి మ‌ర‌ణానికి కార‌ణం అవుతున్నారు. తాజాగా జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలితీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్‌ చేస్తూ బైక్‌ని ఢీకొట్ట‌డంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో మ‌హిళ పోలీసుల‌ని వ‌దిలేయ‌మంటూ రిక్వెస్ట్ చేయ‌డం అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచింది. ఈ ప్రమాదం జాన్వీ కపూర్ దృష్టికి వెళ్ల‌గా, ఆమె సోషల్ మీడియా వేదికగా కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇంత నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? `మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్న వారి ప్రాణాలకి ఎంత ముప్పు అనేది ఆలోచిస్తున్నారా? ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఇటీవ‌ల మ‌ద్యం కార‌ణంగా జరిగే ప్ర‌మాదాల‌తో ఎంతో అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు? కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ తీరు మారాలి అంటూ జాన్వీ క‌పూర్ ఇన్‌స్టా వేదిక‌గా త‌న ఆవేదన తెలియ‌జేసింది. ఇక జాన్వీ విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్‌కి డెబ్యూ ఇచ్చిన ఈ భామ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి గ్రాండ్ గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ముద్దుగుమ్మకు ఘనంగానే స్వాగతం పలికారు.

తొలి చిత్రంతోనే జాన్వీకపూర్ సౌత్ ఆడియ‌న్స్ ని ఎంత‌గానో అల‌రించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాల‌లో న‌టిస్తుంది జాన్వీ. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పెద్ది అనే చిత్రంలో ఈ భామ న‌టిస్తుండ‌గా, ఈ చిత్రం హిట్ అయితే జాన్వీ జోరుకి అడ్డుక‌ట్ట వేయ‌లేము.

Read this also : హాస్పిటల్స్ & మెడికల్ మాఫియా అడుగడుగునా దోపిడీకి గురవుతున్న పేషంట్

Read this also : హెల్దీ కిడ్నీస్ కోసం !

Read this also : టాలీవుడ్ లో సంచలనం-నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

Exit mobile version