Jaya Kishori Jaya Kishori

Jaya kishori: ఎవరీ జయకిశోరీ ! సోషల్ మీడియాలో ఎందుకింత సంచలనం !

Latest Posts Top Stories Trending Now

మూడు రోజుల క్రితం జయాకిశోరీ (Jaya Kishori) ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. ఆ డియోర్ హ్యాండ్ ధర 2 లక్షల రూపాయలకు పైనే. దాంతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆధ్యాత్మికవేత్తకు అంత ఖరీదైన వస్తువులు అవసరమా ? అని నెటిజెన్లు కామెంట్స్ మొదలుపెట్టారు. వాటికి వెంటనే జవాబు కూడా ఇచ్చారు జయా కిశోరీ… తాను సన్యాసిని కాదు… నేనూ మామూలు మనిషినే అని నెటిజెన్లకు షాకిచ్చారు. ఎవరీ జయ కిశోరీ… ఎందుకింత పాపులర్ అయ్యారు ? .

జయా కిశోరీకి (Jaya Kishori) 29యేళ్ళ వయస్సు… ఆమె హిందూ మతం మీద ప్రసంగం ఇస్తుంటే… జనం పిన్ డ్రాప్ సైలెన్స్ తో వింటారు. జయ 7యేళ్ళ వయస్సులోనే ఇలా బహిరంగ వేదికలపై మాట్లాడటం మొదలుపెట్టారు. తన ఏడు రోజుల పాటు శ్రీమద్ భగవద్గీత పారాయణం, 3 రోజుల పాటు “కథా నాని బాయి రో మేరే” తో గుర్తింపు పొందారు. అందుకే ఆమె ఫాలోవర్స్ జయా కిశోరీని ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్ అనీ, కిషోరీ జీ అని పిలుచుకుంటారు. శ్రీకృష్ణుడి భక్తురాలిగా… ఆధునిక మీరాబాయిగా మారిపోయారు జయా కిశోరీ.

జయా కిశోరీ ఆధ్యాత్మిక బోధనలేత కాదు… వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు కూడా ఇస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పథంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నట్టే. ఆమె భజనలు యూట్యూబ్ లో పాపులర్ అయ్యాయి. 2021 జులై 24 నాడు జయ కిషోరీ మోటివేషన్ ( Jaya Kishori Motivation) అనే యూటబ్యూ ఛానెల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ You tube ఛానెల్ లో 9 లక్షల మంది subscribers ఉన్నారు. జయా కిశోరీ ఛానెల్ లో శివ్ స్తోత్ర, మేరే కన్మా, సాజన్ మేరో గిర్దారీ అనే సాంగ్స్ పెద్ద హిట్ కొట్టాయి. ఆమె పాడ్ కాస్ట్ లో కనిపిస్తుంటుంది. ఈమధ్యే రణవీర్ షోలో కూడా మాట్లాడింది. అందులో ఆధ్యాత్మికతతో పాటు హిందూ మతం, లైఫ్ మోటివేషన్ కోచింగ్ గురించి వ్యక్తిగత అంశాలపైనా మాట్లాడింది.

బీకామ్ చదివిన జయా కిశోరీ

జయా కిశోరీ శ్రీమతి కిశోరీ మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీలో చదువుకున్నారు. కోల్ కలతాలోని శ్రీ శిక్షాయతన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) పట్టా పొందారు. డివోషనల్ గానే కాదు… బూగీ వూగీలో శాస్త్రీయ నృత్యం కూడా చేశారు. దాదాపు 20కి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌ పాడారు. శివ స్తోత్ర, సుందర్‌కాండ్, లగన్ తుమ్సే లగా అండ్‌ ఠాకూర్ జీ కా మేలా లాంటి భజనలతో అభిమానులకు దగ్గరయ్యారు.

ఆమె ప్రసంగాలకు జనం ఫిదా

అన్ని వయసుల వాళ్ళూ కనెక్ట్‌ అయ్యేలా స్పీచెస్ ఇవ్వడం జయా కిశోరి స్పెషాలిటీ. మనిషి విజయానికి సహనం, స్థిరత్వం, ప్రశాంతత కావాలంటూ తన ప్రసంగాల్లో చెబుతుంటారు. ఆమె ప్రధానంగా 4 అంశాలపై ఫోకస్‌ చేస్తారు. శ్రీమద్‌ భగవద్గీతలోని పాఠాలు, అవి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయి. నిజ జీవితంలో సాగే వ్యక్తిగత కథలు, కుటుంబ విలువల ప్రాముఖ్యత గురించి వివరిస్తుంటారు.
ఆధ్యాత్మికత, మోటివేషనల్ స్పీచెస్ తో జయా కిశోరికి అనేక అవార్డులు, రివార్డులు లభించాయి. ఆదర్శ్‌ యువ ఆధ్యాత్మిక గురు పురస్కారం, సమాజ్‌ రతన్‌ అవార్డులు అందుకున్నారు. సంస్కార్‌ ఛానల్‌ ‘Artist of the year’ అవార్డుతో సత్కరించింది. సోషల్ మీడియాలో జయా కిశోరీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. భాగవతం, భగవద్గీత, మహాభారతంపై ఆమె స్పీచెస్ కి యూట్యూబ్‌లో ఫుల్ రెస్పాన్స్ ఉంది. 9 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండటంతో జయ కిశోరీ వీడియో పోస్ట్ చేయగానే గంటల్లోనే వైరల్‌ అవుతుంటాయి.

నేనూ మీలాంటి దానినే… సాధ్విని కాదు

మూడు రోజుల క్రితం జయాకిశోరీ (Jaya Kishori) ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. ఆ డియోర్ హ్యాండ్ ధర 2 లక్షల రూపాయలకు పైనే. దాంతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆధ్యాత్మికవేత్తకు అంత ఖరీదైన వస్తువులు అవసరమా ? అని నెటిజెన్లు కామెంట్స్ మొదలుపెట్టారు. వాటికి ధీటుగా జవాబిచ్చారు జయా కిశోరీ. నేనూ అందరిలాంటి అమ్మాయినే… నా ఇంట్లో, నా కుటుంబంతో కలసి జీవిస్తాను. కష్టపడి పనిచేయండి… డబ్బు సంపాదించండి… మీతో పాటు మీ ఫ్యామిలీకి మంచి జీవితాన్ని అందించండి… మీ జీవిత ఆశయం నెరవేర్చుకోండి… అని యువతకు చెబుతాను. నా స్పీచెస్ గమనిస్తే… నేను ఈ సృష్టి మాయ… డబ్బులు సంపాదించవద్దు… అన్నీ వదిలిపెట్టాలి అని నేనెప్పుడూ చెప్పలేదు. నేను పాటించని వాటిని ఎప్పుడూ మీకు చెప్పను. నేను సాధ్విని కాదు… అన్నీ వదిలేయడానికి … ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది… ఇప్పుడు జరుగుతోంది నెగెటివ్ పబ్లిసిటీ… అంటూ తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చారు జయా కిశోరీ.

Tagged