తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ రాజకీయం చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా ఉందామనుకున్న టైమ్ లో తారకరత్న చనిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని యాక్టివ్ గా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు బైఎలక్షన్ జరగనుంది. పోటీకి అన్ని పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తోంది. కంటోన్మెంట్ లో లాగే ఈ సీటు గెలుచుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అనుకోని అవకాశంగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. నిజానికి జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ టీడీపీకి చెందినవారు. ఈ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అందుకే ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీకి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి అక్టోబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్లో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వొచ్చు. నియోజకవర్గంలో పరిస్థితులను స్టడీ చేసేందుకు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ తో కూడిన కమిటీని సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు. 2009 పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పడింది. 2014 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు మాగంటి గోపీనాథ్. 2014లో టిడిపి నుంచి, 2018, 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు.
ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పిజిఆర్ కుమార్తె విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒప్పందం కుదిరితే సమీకరణలు మారతాయని అంటున్నారు. మరోవైపు గోపీనాథ్ కుటుంబం నుంచే బిఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. సాధ్యం కాకపోతే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు కేటాయించే పరిస్థితి ఉంది. మాగంటి గోపీనాథ్ చంద్రబాబుకు కావల్సిన మనిషి. అందుకే ఆయన చనిపోయినప్పుడు లోకేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా నిలబడితే మాత్రం నందమూరి సుహాసినికి ఛాన్స్ దక్కదని అంటున్నారు.
తెలంగాణలో టిడిపిని విస్తరించాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రూపంలో అవకాశం వచ్చింది. టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిని రంగంలో దించే పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి నుంచి నందమూరి సుహాసిని అయితే బెటర్ అని చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ వర్గం ఓట్లు కూడా ఎక్కువే. సామాజిక సమీకరణల దృష్ట్యా సుహాసిని అభ్యర్థిత్వం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also read: చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్
Also read: హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?
Also read: కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్