జ్యోతి మల్హోత్రా… హైదరాబాద్ ని టార్గెట్ చేసిందా ?

Latest Posts Top Stories Trending Now

జ్యోతి మల్హోత్రా…ఒకప్పుడు ట్రావెల్ టూర్స్ చేసే య్యూటూబర్…బ్లాగర్….ఇప్పుడామెను దేశద్రోహి అంటున్నారు. మన దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముకుంది. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీతో సంబంధాలు… పాకిస్తాన్ కి టూర్ కి వెళ్ళడం…. అక్కడ ప్రముఖులతో ఇంటర్వూలు చేయడం.. ఇవన్నీ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్రాకు చాలా ఈజీగా మారాయి. అయితే ఆమె మూలాలు హైదరాబాద్ లోనూ కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కీలక వ్యక్తులు పాల్గొన్న కార్యక్రమాల్లోనూ హల్చల్ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు, మంత్రుల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నది. హైదరాబాద్ లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఎవరు సహకరించారు. ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Jyothi Malhotra

తల్లిపాలు తాగి అన్నట్టుగా….

ఆపరేషన్ సిందూర్ తో మన దేశంపై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుపెట్టింది మన సైన్యం. ఇప్పుడు ఆపరేషన్ చేపట్టి… ఇంటి దొంగలు… దేశ ద్రోహుల్ని పట్టే పనిలో ఉన్నాయి మన నిఘా సంస్థలు, పోలీసులు. పాకిస్తాన్ కి గూఢచారిగా పనిచేస్తూ భారత్ కు చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్న దేశ ద్రోహి… మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హరియానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పాకిస్తాన్ లో చాలా సార్లు పర్యటించింది… వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ లాంటి మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా పాకిస్తాన్ లోని అధికారులకు భారత దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఇన్ఫర్మేషన్ ను చేరవేసింది.

2023లో పాకిస్తాన్ కి వెళ్ళిన జర్నలిస్ట్ బృందంలో జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. అప్పుడే అక్కడ డానిష్ అనే వ్యక్తిని కలిసింది…. అప్పటి నుంచి మన దేశ రహస్యాలను సేకరించి, అక్కడికి చేరవేస్తోంది. వాళ్ళు ఇచ్చే పదో, పరకో, గిఫ్టులకో ఆశపడి మన దేశానికి ద్రోహం చేసింది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా జ్యోతి ప్రవర్తించింది.

Jyothi Malhotra

జ్యోతి టూర్స్ పై నెటిజెన్స్ అనుమానాలు

సోషల్ మీడియాలో జ్యోతి మల్హోత్రా చేసిన దేశ ద్రోహాలను నెటిజెన్స్ ఒక్కోటిగా బయటపెడుతున్నారు.. ఫస్ట్ అవేంటో చూద్దాం… ఆ తర్వాత ఆమె హైదరాబాద్ పర్యటన సంగతి చూద్దాం… ఏప్రిల్ 22న ఏ ఏరియాలో అయితే ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారో….అదే ప్లేసులో యూట్యూబర్, దేశ ద్రోహి అయిన జ్యోతి మల్హోత్రా వీడియో టూర్ చేసింది… జనవరి 2025 నెలలో కశ్మీర్, లఢఖ్ ఏరియాల్లో మొత్తం 5 రోజులు 5 ఏరియాల్లో పర్యటించింది. వాటిల్లో పహల్గామ్ ను ఉగ్రవాదులు ఇప్పటికే టార్గెట్ చేశారు. 26 మంది టూరిస్టులను చంపేశారు. అంటే జ్యోతి మల్హొత్రా క్లూ ఇచ్చిన ఇంకా నాలుగు ఏరియాల్లో దాడులు జరిగే అవకాశం ఉందా ? ఏమో నిఘా వర్గాలే తేల్చాలి.

ట్విట్టర్ లో గణేష్ అనే నెటిజెన్ పోస్ట్ చేసిన ఈ సమాచారం నేను మీకు షేర్ చేస్తున్నాను. అందుకోపం గణేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

కేరళలో జ్యోతి అనుమానస్పద కదలికలు

Jyothi Malhotra
2025 జనవరి నెలలో ఆమె కశ్మీర్ తోపాటు కేరళలో కూడా పర్యటించింది. జ్యోతి మల్హోత్రా 2025 జనవరి కొచ్చికి వెళ్ళింది… కోచ్చి ఒక్కటే కాదు… మలబార్ తీరంలో కూడా ఆమె పర్యటన కొనసాగింది… కొచ్చికి 270 కిలోమీటర్ల దూరంలో మలబార్ ఉంటుంది. ఇక్కడ సైనిక్ అకాడమీ ఉంది. ఈ ప్రాంతంలో జ్యోతి మల్హోత్రా పర్యటించింది… అక్కడ ఏదైనా సమాచారం సేకరించిందా… లేదా అన్నది మన నిఘా వర్గాల దర్యాప్తులో తేలుతుంది…
ఇక రెండోది
జ్యోతి మల్హోత్రా…కన్నూర్ కి వెళ్ళింది.. ఆమె పయన్నూర్ కాశీపురం వానప్రస్థ టెంపుల్ ను సందర్శించింది… ఇది అలక్కడ్ లో ఉంది… ఇక్కడికి దగ్గరల్లో… ఎజిమల నావల్ ట్రైనింగ్ అకాడమీ ఉంది… జ్యోతి మల్హోత్రా వెళ్ళిన అలక్కడ్ కి 17 కిలోమీటర్ల దూరంలోనే ఈ అకాడమీ ఉంది… అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ అకాడమీ వీడియోలు ఏవీ యూట్యూబ్ లేదా ఇన్ స్టాలో జ్యోతి పోస్ట్ చేయలేదు. కానీ వాటి సమాచారం పాకిస్తాన్ కు చేరవేసిందా… అన్న అనుమానాలు ఉన్నాయి.

ఒక్కో వీడియోకి 5 రోజులు గ్యాప్ ఎందుకు ?

జ్యోతి మల్హోత్రా జనవరి 15 నాడే కేరళలోని కన్నూర్ కి ఎంటర్ అయినా… ఆమె ఫస్ట్ వీడియో మాత్రం… జనవరి 20న పోస్ట్ చేసింది… ఆ తర్వాత జనవరి 20న కన్నూర్ కి వెళ్ళింది… కానీ 25న తన వీడియోను పోస్ట్ చేసింది… ఆమె ఎందుకు ఇంత టైమ్ తీసుకుంది అనేది డౌట్ గా ఉంది. అలక్కడ్ కి 30 నిమిషాల జర్నీలో ఉన్న పడన్నా అనే విలేజ్ లో 11 మంది యూత్ ఐసిస్ లో జాయిన్ అయ్యారు. కసార్ గాడ్ లో ఐసిస్ మాడ్యూల్స్ పనిచేశాయి. కేరళ స్టోరీ … రియల్ ఇన్సిడెంట్ జరిగింది కూడా కాసర్ గడ్ లోనే. అక్కడి దాకా జ్యోతి మల్హోత్రా ఎందుకు వెళ్ళింది… ఎవర్ని అయినా కలిసిందా అన్నది డౌట్.

జ్యోతి మల్హోత్రా కన్నూర్ నుంచి అలక్కడ్ కి వయా వలప్పట్నం ద్వారా వెళ్ళినట్టు వీడియోలో చెప్పింది… కానీ ఆమె నేషనల్ హైవే మీద కాకుండా… సమ్ ఇంటీరియర్ రోడ్స్ గుండా ప్రయాణించినట్టు కథనాలు వస్తున్నాయి… అంటే అక్కడ ఎవర్ని అయినా కలవడానికి వెళ్ళిందా అనేది డౌట్. కేరళలో ఏం వ్యవహారాలు చక్కబెట్టింది… ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి… పాకిస్తాన్ కి పంపింది అనేది మన ఎంక్వైరీ టీమ్స్ విచారణలో బయటపడే ఛాన్సుంది.

జ్యోతి మల్హోత్రా ట్రావెల్ సీక్వెన్స్ మీద అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ఆమె 2025 జనవరిలో మొదట కశ్మీర్ వెళ్ళడం… అక్కడి నుంచి కేరళ… ఆ తర్వాత మహా కుంభ్… అక్కడి నుంచి పాకిస్తాన్ కి వెళ్ళడం…. అనుమానాలకు తావిస్తోంది. కేరళ ట్రిప్ లో జ్యోతి ఏమేమి చేసిందో తెలిస్తే…ఆమె దేశ ద్రోహం నేరాల చిట్టా బయటకు వస్తుంది. అలాగే జ్యోతి మల్హోత్రా ఫ్రెండ్షిప్ చేసిన… ఒడిషా యూట్యూబర్ తోపాటు… ఇలా ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 బెంగాల్ లో కీలక స్థావరాల వీడియోలు 

జ్యోతి మల్హోత్రా….పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోనూ వీడియోలు తీసినట్టు బయటపడింది… ప్రస్తుతం కోల్ కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు… బెంగాల్ పోలీసులు జ్యోతి తిరిగిన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. జ్యోతి తిరిగిన కోల్ కతా, సిలిగుడిలో ఇంపార్టెంట్ ఆర్మీ రెజిమెంట్స్ ఉన్నాయి. కోల్ కతాలో ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్డాఫీస్ ఉంది. బరాక్ పూర్ లో చాలా ప్రాంతాలు… రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ అధీనంలో ఉన్నాయి… ఇక్కడ భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది.బాగ్డోగ్రా, హసిమారాలో వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి. మూడు మౌంటేన్ డివిజన్స్ కలిగిన 33 కార్ప్స్ హెడ్డాఫీసులు సిలిగుడికి దగ్గర్లో ఉన్న సుక్నాలో ఉంది. ఒడిశాలో మరో యూట్యూబర్ తో కలసి పూరిలోని జగన్నాథ్ ఆలయం, కోణార్క్ లోని సూర్యదేవాలయంతో పాటు చాలా ఆలయాల వీడియోలను తీసింది జ్యోతి మల్హోత్రా

ఇక మన హైదరాబాద్ సంగతి చూస్తే…..

జ్యోతి 2023 సెప్టెంబరులో హైదరాబాద్‌లో కూడా యాక్టివ్ గా ప్రోగ్రామ్స్ చేసింది… ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర వీడియోలు చేసింది. అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరైన ఈ కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రా యధేచ్ఛగా తిరిగింది. దేశద్రోహం కేసులో ఆమె అరెస్ట్ అయ్యాక పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ లో ఎవరెవర్ని కలిసింది… అక్కడ ఏమైనా ప్రత్యేక వీడియోలు తీసిందా… అన్న కోణాల్లో నిఘా వర్గాలు విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఎవరైనా యూట్యూబర్లతో జ్యోతి మల్హోత్రాకు ఫ్రెండ్షిప్ ఉందా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.

యూట్యూబర్లతో జాగ్రత్త

హరియానాలో అరెస్టు అయిన తర్వాత జ్యోతి వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి… సాధారణ మహిళగా… యూట్యూబర్ గా కనిపించిన జ్యోతి… పాకిస్తాన్ కి సహకరిస్తూ… దేశ ద్రోహానికి పాల్పడింది… ఇలాంటి యూట్యూబర్లను ఇకముందైనా… ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇతర సైనిక అకాడమీల ఏరియాల్లోకి రాకుండా చూసుకోవాలి… సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరును అడ్డం పెట్టుకొని…. రహస్యంగా ఉంచాల్సిన ఆర్మీ స్థావరాలను వీడియోలు తీసే ప్రమాదాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో కనిపించే యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు అందరినీ ఒకే గాట కట్టాల్సిన పని లేదు. కానీ విదేశీ నిఘా సంస్థలకు తొత్తులుగా పనిచేసే ఇలాంటి దేశ ద్రోహుల వల్ల మిగతా వాళ్ళకి… నిజమైన దేశభక్తి కలిగి… పొట్ట కూటి కోసం వీడియోలు తీసుకుంటున్న… మా లాంటి సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )

Tagged

Leave a Reply